Tag Archives: రామదాసు

కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు

కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు తెలుగు ఓల్డ్ మూవీ. తెలుగు ఓల్డ్ మూవీలో పెద్దమనుషులు సినిమా కొందరి పెద్దమనుషుల మసుగును చూపుతుంది.

తెలుగులో గల ఓల్డ్ మూవీస్ చూడడానికి మనసు మొరాయించ వచ్చును. కానీ మనసుకు మేలు కలిగించే విషయాలు పాత సినిమాలలో కూడా కనబడతాయి.

వాస్తవాలకు దూరంగా అవసరాలకు అనుగుణంగా మాట ఎలా మారుతుందో ఆలోచన చేస్తే, పెద్ద మనుషుల ప్రవర్తన, వారి మాటలు ఇంకెంతలాగా అవసరానికి అనుగుణంగా వాస్తవాలను దాస్తాయో పెద్దమనుషులు సినిమా చూస్తే అవగతమవుతుంది.

బయట సన్మానాలు సత్కారాలు, వారి మాటకు తిరుగు ఉండదు, ఇంట్లో వారి మాటకు విలువ ఉండదు. సమాజంలో అవసరానికి దణ్ణం పెడితో, ఇంట్లో అవసరం ఉన్నా పట్టించుకోని బంధాలతో సాగే పెద్దమనుషుల కధే ఈ చిత్రం.

ఒక ఊరిలో అయిదుగురు పెద్ద మనుషులలో నలుగురు పెద్దమనుషుల జీవితం పైన వివరించనట్టే ఇంటాబయటా కూడా అలానే ఉంటుంది. అయితే అందులో అయిదో పెద్దమనిషి మాత్రం ఇంటా బయటా గౌరవం ఉంటుంది.

ఇంకా అతని చెంత ధనం కన్నా ధర్మం ఎక్కువగా ఉంటుంది. ఆ కారణం చేత అతని బీద కుటుంబం అయినా ఓ మధ్యతరగతి పెద్దమనిషిగా ఇంటాబయటా సమాన గౌరవం పొందుతూ తనపని తాను చేస్తూ ఉంటాడు.

పెద్దమనుషుల మూవీలో రామదాసు ప్రధాన పాత్ర

అతని పేరే రామదాసు, అతను భార్య, గుడ్డి కూతురితో కలసి తాను నిర్వహిస్తున్న పత్రికా ప్రింటింగ్ ప్రెస్ తో కూడి ఉన్న ఇంటిలోనే నివాసం ఉంటారు. ఈ మూవీలో రామదాసు ప్రధాన పాత్ర.

అయితే ఈ రామదాసు మాత్రం ఆ ఊరి చైర్మెన్ అంటే అభిమానం, నమ్మకం మరియు గౌరవం ఇంకా స్వామి భక్తి ఎక్కువ. ఎందుకంటే రామదాసు ఆద్యర్యంలో ఒక శరణాలయం నిర్వహణ జరుగుతూ ఉంటుంది.

అయితే ఆ బాధ్యతలో ఎక్కడా తప్పుడు లెక్కలు చూపించకుండా, వచ్చిన విరాళపు సొమ్ము అంతా శరణాలయానికే ఖర్చు చేస్తూ ఉంటాడు. కానీ చైర్మెన్ ఇతర సహచరులు అయిన పూజారి, వ్యాపారి, కాంట్రాక్టరుతో ఎంతోకొంత సొమ్మును ఎప్పటికప్పుడు చైర్మెన్ గారికి చాటుమాటున చేరవేస్తూ ఉంటారు.

వీరు ముగ్గురు చేసే వారి వారి వృత్తులలో లాభాలు అక్రమమార్గంలో అర్జించి, వాటిలో వాటాను మాత్రం చైర్మెన్ గారికి ఇస్తూ ఉంటారు. ఇదంతా రామదాసుకు తెలియదు.

ఇంకా రామదాసు విషయంలో చైర్మెన్ ఏది అడగడు, అతను చెప్పినదానికి సరేనంటూ పైకి నటిస్తూ ఉంటాడు. అందుకే రామదాసు తన పత్రికలో రామదాసుగారి ప్రజాసేవ గురించి గొప్పగా వ్రాస్తాడు.

చైర్మెన్ గారికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు, అతని ఇంట్లోనే ఉంటారు. తమ్ముడు తిక్క శంకరం ఎప్పుడూ అన్నయ్యని అల్లరి చేస్తూనే ఉంటాడు. అతను మేక వన్నె పులిగానే వర్ణిస్తూ..ఉంటాడు.

వాస్తవానికి తమ్ముడుని పిచ్చోడు అని ముద్ర వేసి, చెల్లిని ఒక ముసలోడికిచ్చి వివాహం చేసి, ఆస్తిని తమ్ముడికి, చెల్లెలకు పంచే అవకాశం లేకుండా చైర్మెన్ తగు జాగ్రత్తలతో ఆస్తిని కాపాడుకుంటాడు.

మొత్తమ్మీద చైర్మెన్ పైకి పెద్దమనిషి, లోపల చిన్న మనిషి. చిల్లరకు చాటుమాటున చేయి చాస్తూ, పైకి పెద్ద పెద్ద దానాలు చేస్తూ ఉంటాడు. ఇంకా చైర్మెన్ గారి కొడుకు పట్నంలో వైద్య విద్యను అభ్యసిస్తూ ఉంటాడు.

చైర్మెన్ గారి అబ్బాయికి అతని బాబయి తిక్క శంకరం, పత్రికా సంపాదకుడు రామదాసు, అతని ఫ్యామిలి అంటే బాగా ఇష్టం. అతని మద్య మద్యలో ఊరికి వచ్చినప్పుడు రామదాసుగారింటికి వెళ్లి వస్తూ ఉంటాడు.

ఆ క్రమంలోనే రామదాసు కూతురుకి కళ్ళ ఆపరేషన్ చేయించడానికి పూనుకుంటాడు. ఒక్కసారి పట్నం తీసుకుపోయి పరీక్షలు చేయించి తీసుకువస్తాడు కూడాను.

చైర్మెన్ చేసిన హత్యను, తనమీద వేసుకుని జైలుకు వెళ్ళిన రామదాసు

ఇదిలా ఉండగా చైర్మెన్ గారి కారు డ్రైవరు, చైర్మెన్ విధవ చెల్లెలతో సరసమాడుతూ కనబడతాడు. వెంటనే చైర్మెన్ తన దగ్గర ఉన్న తుపాకితో ఆ కారు డ్రైవరుని కాల్చి చంపుతాడు. అక్కడే ఉన్న రామదాసు, చైర్మెన్ గారి చేతిలో తుపాకి తీసుకుని, కారు డ్రైవరు దగ్గరకు పరుగు పరుగున వెళతాడు.

అందరూ అక్కడికి చేరతారు, కారు డ్రైవరు రామదాసు చేతుల్లోనే కన్నుమూస్తాడు. అక్కడికి చైర్మెన్ కూడా వస్తాడు. అప్పటికే వచ్చిన పోలీసులు ఇది ఎలా జరిగిందని అడగడంతో, రామదాసు నేనే పొరపాటున పిట్టను కాల్చబోతే, అది ఇతనికి తగిలిందని సమాధానం చెబుతాడు.

రామదాసుకు కోర్టు కొంతకాలం కారాగార శిక్ష విధిస్తుంది. జైలులో రామదాసుని కలసిన చైర్మెన్, తాను నిజం చెప్పి పోలీసులకు లొంగిపోతానని నంగనాచి వినయం ప్రదర్శిస్తాడు. రామదాసు అది నిజమనుకుని, మీరు ఎట్టి పరిస్థితులలోనూ నిజం చెప్పవద్దు అని, మీరు ప్రజాసేవ చేయాలని చెబుతాడు.

ఇక రామదాసు జైలుకెళ్లడంతో చైర్మెన్ సహచరుల అరాచకాలు ఎక్కువ అవుతాయి. అనాధ శరణాయం నుండి కూడా దోపిడి చేస్తూ ఉంటారు. ఇంకా రామదాసు కూతురు, చైర్మెన్ గారి అబ్బాయిని వల్లో వేసుకుందని, చైర్మెన్ గారికి మాటలు ఎక్కిస్తారు. తరువాత రామదాసు భార్యని, అతని గుడ్డి కూతురుని అవమానించడంతో వారు ఊరు వదిలి వెళ్లిపోతారు.

రామదాసు జైలు నుండి వచ్చాక వారి ఆరాచకాలకు ఏవిధంగా అడ్డు వచ్చాడు. వారిని భగవంతుడు ఏవిధంగా శిక్షించింది? తెరపై చూడాలి. ఇంకా రామదాసు కూతురు చైర్మెన్ గారి అబ్బాయి ఒక్కటవటంతో కధ సుఖాంతం అవుతుంది. తిక్క శంకరయ్య సన్యాసం స్వీకరించడంతో సినిమాకు ముంగింపు పలకుతారు కె.వి. రెడ్డిగారు.

ఇది కెవి రెడ్డిగారి దర్శకత్వంలో పెద్దమనుషులు తెలుగు మూవీ స్టోరీ.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం

తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం

రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం

మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం

రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం

గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.

నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం

మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ

ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది

పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం

గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో

అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం

చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు

మద్యపానం వల్ల నష్టాలు వ్యాసం

సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో

మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?

కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం

నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి

చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం

వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం

నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి

నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు

పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం

వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు

ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి

అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం

దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం

దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం

మంధర పాత్ర స్వభావం చూస్తే

పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం

శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా

రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.

నేటి కాలంలో వృద్ధుల పరిస్థితి

గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి

రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

పావురం గురించి తెలుగులో వ్యాసం

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

దూరదర్శిని టి‌వి గురించి తెలుగులో వ్యాసం

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు

మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం

పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి

ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో

నేటి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎలా ఉంది?