Tag Archives: రామ్ చరణ్ – చిరంజీవి

ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా

ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా అంచనా వేయడం జరిగింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి మరియు తనయుడు రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడమే. ఇంకా ఆర్ఆర్ఆర్ సూపర్ హిట్ కావడంతో… మరింతగా సినిమాపై ఆసక్తి పెరిగింది.

రామ్ చరణ్ – తారక్ జంటగా నటించిన సినిమా ఆర్ ఆర్ ఆర్ ప్రపంచవ్యాప్తంగా మంచి కలెక్షన్లను రాబడితే, ఇక రామ్ చరణ్ – చిరంజీవి గురించి తెలుగు రాష్ట్రములలో మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఏప్రిల్ 29న రిలీజ్ అయినా ఆచార్య తెలుగు సినిమా తర్వాత కలెక్షన్ల విషయంలో వెనుకబడిందని చెబుతున్నారు. ఇంకా సినిమా హిట్ టాక్ కన్నా డివైడింగ్ టాక్ పాపులర్ అయ్యింది. అందువలన ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా కాస్త సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చబోయే చిత్రంగా చర్చించుకోవడం ఎక్కువైంది.

ప్లాప్ లేది సినిమా దర్శకుడు వలన ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా అని ఆశించారు

కొరటాల శివ గతంలో ప్రభాస్ తో మిర్చి, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ భరత్ అను నేను వంటి హిట్ సినిమాలను అందించాడు. ఈ సినిమాలు హిట్ అవ్వడంతో బాటు సందేశాత్మక సినిమాలుగా కూడా ప్రశంసలు పొందాయి. అలాంటి కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య ఆశించిన ఫలితాన్ని అందుకోలేక బాక్సాఫీస్ వద్ద కష్టాలు పడుతుంది.

ఆర్ ఆర్ ఆర్ హిట్ అయినప్పుడు కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన సినిమాల జాబితాను ప్రచారం చేసిన మీడియా ఇప్పుడు ఆచార్య కలెక్షన్ల తీరు చూశాకా ప్లాపుల జాబితాకు ప్రచారం కల్పించడం జరుగుతుంది. మొత్తానికి ప్లాప్ లేని దర్శకుడి ఒక ప్లాప్ సినిమా వచ్చినట్టయింది.

చిరంజీవి కెరీర్లో ఆచార్య ఒక పెద్ద ప్లాప్ అనే ప్రచారం ఊపందుకుంటుంది. మొత్తానికి ఆచార్య కలెక్షన్లు చూస్తే, తండ్రికొడుకులు కలిసి నటించిన ఆచార్యతో మెగా కలెక్షన్స్ బొనంజా సృష్టించలేక, ప్లాపుల జాబితాలోకి జారుకుందనే వ్యాక్యకు బలం చేకూరుతుంది.

EMI calculator for personal loan