రైతుల కష్టాలు గురించి 10 lines. సమాజంలో రైతు బ్రతుకు తెరువు భారంగా మారుతుందని మీడియాలో వార్తలు వింటూనో, చూస్తూనో ఉంటాము. వ్యవసాయం చేసిన రైతు కష్టం, సాటి రైతుకే ఎరుక అంటారు. నేడు అనేక రకాలుగా వ్యవసాయం చేసే రైతు కష్టాలను ఎదుర్కొంటున్నట్టుగా స్పష్టం అవుతుంది. ఎలా చెప్పగలం అంటే… రోజూ వార్తలలో రైతు కష్టాల గురించిన వార్తలు వినడమే కాదు, సమాజంలో వస్తున్న సినిమాలలో కూడా రైతు సమస్యల గురించి ఏకరువు పెడుతున్నారు. రైతు పడుతున్న కష్టం, రైతు ఎదుర్కొంటున్న సవాళ్లతో పాటు, రైతు పొందుతున్న అవమానాల గురించి కూడా సినీ మీడియా కోడై కూస్తుంది. రైతు కష్టాలు గురించి అనే విషయం తెలుసునని తెలియజేయడానికి పది లైన్లలో చెప్పడానికి ప్రయత్నిస్తే….
భూమి ఛిన్నాభిన్నం: సొంత భూమిలేని రైతులు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ ఉంటారు. అలా కౌలు రైతుకు మిగిలేది తక్కువ ఎందుకంటే, సొంతంగా భూమి లేకపోవడం. సొంతంగా భూమి ఉన్న రైతు, అన్ని సవ్యంగా ఉంటే, అతని భూమిలో అతనే వ్యవసాయం చేసుకోగలరు. కానీ నేటి సమాజంలో భూ కబ్జాలు సొంతభూమి గల రైతులను భాధించే విషయంగా చెప్పబడుతుంది.
రైతు కష్టాలు రైతు ఎదుర్కొనే సమస్యలు
రుణభారం: ఇప్పుడు ధరల మార్పిడి సమయం చాలా తక్కువ… గతం మాదిరి కాకుండా, నేటి సమాజంలో ధరల నియంత్రణ లేకుండా, ధరలు పెరుగుతూ ఉండడం రైతు వ్యవసాయానికి భారం అవుతుంది. సాదారణంగానే రైతుకు ఆర్ధిక సాయం అవసరం అయితే, ధరల మార్పిడి ఎక్కువగా ఉండడం, అంచనా తప్పడం, రుణాల భారం పెరగడం రైతు పాలిట శాపంగా మారుతుంది.
ఆధునిక సాంకేతికత లేకపోవడం: ఆర్ధిక భారం వలన ఆధునిక వ్యవసాయ పద్దతులను అనుసరించలేని రైతాంగం మనకు చాలా ఉంటుంది. ఇప్పటికీ పాత పద్దతుల ద్వారానే వ్యవసాయం చేస్తూ, అందరికీ అన్నదానం చేసే రైతులు ఉన్నారు.
నీటి కొరత: వ్యవసాయం అంటే భూమితో పాటు నీరు, భూమిలేకుండా వ్యవసాయం ఉండదు అలాగే నీరు లేకుండా వ్యవసాయం చేయలేరు. అటువంటి నీరు వ్యవసాయం చేసే రైతుకు సమయానికి ఉపయోగపడకపోవడం జరుగుతుంది. నీటి సరఫరా సౌకర్యాలు పెరగాలి.
పంట ధరల అస్థిరత: నీరు లేకపోయినా ఏదో పద్దతి ద్వారా వ్యవసాయం చేసిన రైతుకు వాతావరణం కూడా అనుకూలించాలి. అప్పుడే పంట చేతికి వస్తుంది. అలా వాతావరణం అనుకూలించినా రైతుకు మరొక నిత్య సమస్య ధర… హెచ్చుతగ్గులు… పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే, సంవత్సరమంతా పడ్డ కష్టం వృధా అవుతుంది.
వాతావరణ మార్పు: అన్నీ చక్కగా సాగి పని ముగిస్తే ఫలితం తథ్యం అంటారు. కానీ రైతు విషయంలో అన్నీ చక్కగా ఉన్నా, వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. లేకపోతే చేతికి అందివస్తుందనుకున్న పంట నీటిపాలు అయ్యే అవకాశం ఉంటుంది.
మధ్య దళారుల దోపిడీ: ఇది అతి పెద్ద సమస్యగా చెప్పబడుతుంది కానీ తీరని సమస్యగానే మిగిలిపోతుందని అంటారు.
ప్రభుత్వ విధానాలు: ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క విధానం మార్చుకుంటూ పోతే, అవి రైతుకు అనుకూలంగా ఉండడమేమో కానీ ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది.
వలసలు: వ్యవసాయంలో ఆదాయం లేకపోతే, కుటుంబ మనుగడ కష్టం కాబట్టి ఉన్న వ్వవసాయం వదిలేసి వలసలకు దారితీసే వారి సంఖ్య పెరగడం ఇప్పుడు రైతు సమస్యగా ఉన్నా, భవిష్యత్తులో సామాజిక సమస్యగా మారి అన్నం అందరికీ దొరకకపోవచ్చును.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
రైతుల కష్టాలు గురించి 10 lines
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు