వాల్తేరు వీరయ్య తెలుగు మూవీకి దర్శకుడు బాబీ కొల్లి నిర్మాణం మైత్రీ మూవీ మేకర్స్ విడుదల 2023 సంక్రాంతి సీజన్ తెలుగులో మెగా మాస్ మహారాజా యాక్షన్ కామెడీ మూవీ. ఈ చిత్రంలో చిరంజీవి వీరయ్య క్యారెక్టర్‌లో అభిమానులను అలరిస్తే, రవితేజ సాగర్ గా అందరిని ఆకట్టుకుంటాడు. ఇంకా వీరికి జంటగా శ్రుతి హాసన్, కేథరిన్ ట్రెసా నటించారు.
ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, పాటలు బాగుంటాయి. మాస్ ప్రేక్షకులను మెప్పించడానికే ఈ సినిమా తీసినట్టుగా ప్రచారం జరిగింది. అలాగే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది.
రాజకీయాల నుండి తిరిగి ఇండస్ట్రీకి వచ్చాక, మెగాస్టార్ రేంజికి తగ్గ సినిమాగా వాల్తేరు వీరయ్య కలెక్షన్లు ఉన్నాయని అభిమానులు ఆనందిస్తున్నారు. నిజంగానే ఈ సినిమా చూస్తున్నంతసేపూ కాలక్షేపంగా కధ కదులుతూ, చిరంజీవి కామెడి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. ఇక సెకండాప్ సినిమాలో రవితేజ ఎంట్రీ నుండి సినిమా ముగింపు వరకు సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది.
సినిమాలో మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర అయితే, సినిమా సెకండాఫ్ లో మాస్ మహరాజా పాత్ర పవర్ పుల్ గా కనబడుతుంది. అంతే పవర్ పుల్ గా ఎమోషన్ తో ఎండ్ అవుతుంది. ప్రేక్షకులు వారి ఎమోషన్ కు కనెక్ట్ అవుతారు.
వాల్తేరు వీరయ్య తెలుగు మూవీ ఇక కధ విషయానికొస్తే…
వైజాగ్ లో మత్యకారులకు నాయకుడుగా వాల్తేరు వీరయ్య ఉంటాడు. అడిగినవారికి ఎటువంటి సాయం చేయడానికి అయినా చేయడానికి సిద్దంగా ఉంటాడు. అతని మంచితనం అతని చుట్టూ అక్కడి ప్రజలు ఉంటారు. వీరయ్య ఐస్ ప్యాక్టరీ రన్ చేస్తూ ఉంటాడు. అందులో మైకేల్ పని చేస్తూ ఉంటాడు.
మంచితనం ఎక్కువైన చోట, చెడ్డతనం చాపకింద నీరులాగా భారీగా పెరిగిపోతుంది. అలా… వాల్తేరు వీరయ్య నీడలో ఒక మైకేల్(ప్రకాశ్ రాజ్) డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటాడు. అతనిపై అనుమానం రాకుండా చూసుకుంటూ ఉంటాడు. కానీ వీరయ్య(చిరంజీవి) తమ్ముడు సాగర్(రవితేజ) సిన్సియర్ పోలీసు అధికారి.
సాగర్ కు మైకేల్ కదలికలు అనుమానస్పదంగా అనిపించినా, అతనిని ఇంట్రాగేషన్ చేసే అవకాశం దొరకదు. కానీ వీరయ్య ఐస్ ప్యాక్టరీ నుండి స్కూల్ కు ఐస్ సరఫరా జరుగుతుంది. అయితే అందులో పొరపాటున మైకేల్ డ్రగ్స్ పెట్టిన ఐస్ వెళుతుంది. దాని వలన 25మంది విద్యార్ధులు మరణిస్తారు.
దాని పర్యవసానంగా వీరయ్యను జైలులో బందిస్తారు. వీరయ్యను ఎన్ కౌంటర్ చేయాలని పోలీసులు బావిస్తారు. కానీ అక్కడ రవితేజ మరణాన్ని పొందుతాడు. మైకేల్ విదేశాలకు వెళ్లిపోతాడు. మరణ సమయంలో వీరయ్య, సాగర్ ల బంధం ఎంత బలమైనదో… తెలుస్తుంది. వారి మద్య సెంటిమెంట్ బాగా ఆకట్టుకుంటుంది. ఇది అసలు కధ అయితే….
ప్రధమార్దంలో మైకేల్ తమ్ముడు సోలమన్ సీజర్ పోలీసుల నుండి తప్పించుకోవడం, అతనిని పట్టుకోవడానికి పోలీసు అధికారులు వీరయ్యతో ప్రయత్నం చేయడం. పోలీసులే కాకుండా రా అధికారుల కూడా ప్రయత్నం చేయడం… ఇదంతా కామెడీ యాక్షన్ కలగలపి ఉంటుంది.
waltair veerayya villain, waltair veerayya wikipedia, waltair veerayya story, “వాల్తేరు వీరయ్య తెలుగు మూవీ”
తెలుగులో వ్యాసాలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు
ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
చిత్తము అనే పదానికి తగిన అర్థం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
తెలుగు వ్యాసం పండుగలు ప్రాముఖ్యత అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ఇంటర్నెట్ ఉపయోగాలు నేడు నెట్ లేకపోతే జీవితం ముందుకు సాగదు
ఆన్ లైన్ విద్య ఎలా ఉపయోగించుకోవచ్చు? తెలుగులో వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
సెల్ ఫోన్ వలన కలిగే నష్టాలు తెలుగులో వ్యాసం
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
సమాజం కోసం రాజకీయ నాయకుల నైతికత
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్