శ్రావణమాసంలో మంగళవారం, శుక్రవారం విశిష్టమైనవి. ఇంకా ఆ రోజులలో శుభకర తిధులు, నక్షత్రాలు కలిసి వస్తే, ఆ రోజులలో పరమ పుణ్యదాయకమైన సమయం అంటారు. అలా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో… మహాలక్ష్మీ అనుగ్రహం ఉంటే ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇంట ధనదాన్యాలకు కొదువ ఉండదు. అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ…
శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో
సకల సంతోషాలకు ఆలవాలమైన మహాలక్ష్మీ అనుగ్రహం మీ ఇంటిల్లపాదిపై కుంభవృష్టి వలె కురవాలని కోరుకుంటూ…. శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు
నీమోములో లక్ష్మీకళ తొణికిసలాడుతుంది. మా ముందు నిలబడిన మహాలక్ష్మీకి శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు.
నడిచే మహాలక్ష్మీని చూడలేము అంటే తప్పు నిన్ను చూశాకా, ఆ ఆదిలక్ష్మీని చూసినట్టే… నీకు నీ కుటుంబ సభ్యులకు శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు.
వరలక్ష్మీ వత్రం, మంగళగౌరీ వ్రతం ఏదైనా వ్రతం మంగళముల కొరకే కావునా మీ ఇంట మంగళములకు లోటు లేకుండా ఉండాలని కోరుకుంటూ… శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు.
నీకు శుభాకాంక్షలు చెబితే, ఆ మహాలక్ష్మీకి శుభాకాంక్షలు చెప్పినట్టే…
శుభకరం మంగళకరం శుభప్రదం ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ…. శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు.
తీరని కోరికలు దు:ఖానికి మూలం. తీరుతున్న కోరికలు సంతోషానికి కారకం. తీరని కోరికలకు తావులేకుండా ఉండాలని కోరుకుంటూ…. శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు.
మీ ఇల్లు సుఖసంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటూ… శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు.
అన్ని శుక్రవారములలో శ్రావణ శుక్రవారం అందరికీ ఇష్టం. ఎందుకంటే ఆరోజు మహాలక్ష్మీ అనుగ్రహం సులభదాయకం అంటారు. అమ్మవారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ… శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు.
శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలుగులో
జీవితం లక్ష్యం వైపు వెళ్ళాలి. ఆ లక్ష్యం ఆనందకరంగా అందుకోవడానికి దైవానుగ్రహం కూడా అవసరం. సాధనతో మనసు సహకరించడానికి, పట్టుదలకు అమ్మ అనుగ్రహం తోడైతే, సాధన నిర్విరామంగా సాగుతుందని ప్రవచకారులు చెబుతూ ఉంటారు. అటువంటి లక్ష్యం ఉన్నవారు మహాలక్ష్మీ అనుగ్రహం సంపాదించడానికి శ్రావణ మాసం అవకాశం అందిస్తుందని, అందులో శ్రావణ శుక్రవారం మరింత సులభమని అంటారు. ఆచరణలో మనసు నిలబడడమే ప్రధానం.
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఇంగ్లీష్ వర్డ్స్ టు తెలుగు వర్డ్స్
తెలుగు పర్యాయ పదాలు వివిధ రకాలు