Tag Archives: స్మార్ట్ ఫోన్ కొంటే

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్

భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్ అవుతుంది. కారణం BharOS భారతీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంగా ఇండియన్స్ పరిచయం చేస్తున్నారు. ముఖ్యంగా BharOS ప్రత్యేకత ఏమిటంటే, ఎటువంటి డిఫాల్ట్ యాప్స్ లేకపోవడం. ఇంకా పర్సనల్ సెక్యూరిటీ పదిలం…

నేటి టెక్నాలజీ కాలంలో పర్సనల్ డేటా దుర్వినియోగం అవుతుంది… అని చాలామంది చెబుతుంటే, ఎక్కువమంది విశ్వసిస్తున్నారు.

కొన్ని కంపెనీలు గుత్తాదిపత్యం చెలాయించడానికి గానూ కొత్త ఫోనులో డిఫాల్ట్ యాప్స్ ఉంచుతున్నారు.

ఏమిటి ఈ డిఫాల్ట్ యాప్స్?

ఒక వ్యక్తి ఒక ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ కొంటే, ఆ స్మార్ట్ ఫోనులో ఆ వ్యక్తి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా… కొన్ని యాప్స్ ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తి తను కొనుగోలు చేసుకున్న స్మార్ట్ ఫోన్ కు పూర్తి యజమాని ఎలా అవ్వగలడు? ఇది తేలని ప్రశ్న అయితే…

ఇప్పుడు ఇన్ స్టాల్ చేయబడిన డిఫాల్ట్ యాప్స్, ఫోన్ కొనుగులో చేసుకోవడానికి అవకాశం లేకపోవడం అంటే, అది అతని ఫోనుపై కంపెనీ కూడా యజమానిగా ఉంటున్నట్టే అవుతుంది కదా.

ఒక వ్యక్తి ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కున్నారు. అతను ఆ ఫోనులో ఆన్ లైన్ ద్వారా వీడియోలు చూడడానికి అనేక వీడియో ప్లాట్ ఫామ్స్ యొక్క వెబ్ సైటులు ఉంటాయి. వెబ్ సైటు ద్వారా వీడియో వీక్షణ చేయగలిగే అవకాశం ఉన్నప్పుడు, పర్టిక్యులర్ గా యూట్యూబ్ యాప్ డిఫాల్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ వినియోగదారుడు కావాలనుకుంటే, ఇన్ స్టాల్ చేసుకోవడానికి లేకపోతే అన్ ఇన్ స్టాల్ చేసుకునే అవకాశం లేకుండా సాఫ్ట్ వేర్ తయారు చేయబడి ఉండడం జరుగుతుంది. ఇలా చాలా యాప్స్ డిఫాల్ట్ గా కొత్త ఫోనులో ఉంటున్నాయి. యూట్యూబ్ అయితే అందరూ వాడేదాకా అలవాటు పడ్డారు కాబట్టి ఇప్పుడు అది వాడుకలో ఉంది. ప్రారంభంలో యూట్యూబ్ డిఫాల్ట్ యాప్ లేదు….

ఇలా డిఫాల్ట్ యాప్స్ స్మార్ట్ ఫోన్ లో స్పేస్ ను ఆక్యుపై చేస్తుంది. ఫోన్ మెమోరీ పుల్ నోటిఫికేషన్స్ ఎక్కువయ్యి…. ఫోన్ అంటే విసుగు వచ్చేవారు కూడా ఉండవచ్చును. ఇప్పుడు BharOS వలన ఇటువంటి డిఫాల్ట్ యాప్స్ సమస్య అసలు ఉండదనేది… ఆసక్తికరం… అభినందనీయం… ఆమోదయోగ్యం.

ఇంకా BharOS వ్యక్తిగత భద్రతకు హామినివ్వడం కూడా అందరికి ఆసక్తి పెరుగుతుంది. ఈ BharOS భరోసా ఉంటుందని నమ్మకం కలుగుతుంది.

అయితే ఈ ‘BharOS’ మన భారతదేశానికి సంబంధించినది అయితే ప్రపంచం అంతా వ్యాప్తి చెందిన ఓఎస్ కంపెనీలకు ఎందుకు షాక్?

అంటే, ప్రపంచంలో ఎక్కువ స్మార్ట్ ఫోన్లు ఉపయోగించేవారిలో భారతీయులు కూడా ఎక్కువగానే ఉంటారు. కాబట్టి చాలామంది ఈ BharOS కు ఆకర్షితులైతే ఇతర ఓఎస్ కంపెనీలకు షాక్… భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్.

కానీ ఇతర ఫీచర్ల విషయంలో ఏమేరకు అవగాహన కనబరుస్తారో చూడాలి.

అవగాహన సులభంగా ఉంటేనే, అందరూ ఉపయోగిస్తారు. ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుక సులభంగా ఉంటుంది… తక్కువ ఖర్చు కాబట్టి ఇంతమంది వాడుతున్నారు.

తెలుగులో వ్యాసాలు

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

మధువు మీనింగ్ ఇన్ తెలుగు

చిత్తము అనే పదానికి తగిన అర్థం

తెలుగులో సంఘర్షణ అంటే ఏమిటి?

యద్భావం తద్భవతి అంటే ఏమిటి

చతురత పదానికి అర్థం చతురత మీనింగ్

అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము

ధోరణి అంటే అర్ధం ఏమిటి?