Tag Archives: హ్యాపీ దసరా విషెస్ టు యు

అమ్మ అనుగ్రహం ఉండనివారుండరు కానీ అమ్మను మరిచిపోతూ ప్రవర్తిండం వలననే

అమ్మ అనుగ్రహం ఉండనివారుండరు కానీ అమ్మను మరిచిపోతూ ప్రవర్తిండం వలననే జీవితంలో కష్టాలు అంటారు. అమ్మ అనుగ్రహం అందరిపై ప్రసరించాలి… హ్యాపీ దసరా విషెస్ టు యు

చిన్నపిల్లలను అమ్మ అనునిత్యం రక్షిస్తూ కంట గమనిస్తూ ఇంటిపని చేసుకుంటూ ఉంటుంది. అటువంటి అమ్మ నన్ను పట్టించుకోవడం లేదని శ్రీకృష్ణుడంతటివాడే అల్లరి చేశాడని భాగవతంలో చెబుతారు.

పిల్లలుగా ఉన్నవారెవరైనా అంతే అల్లరితోనే అమ్మతో ఆటలు… ఎంత అల్లరి చేసినా, ఎంత మొండివారైనా సరే పిల్లలను అమ్మ ఓ కంటకనిపెడుతూనే ఉంటుంది. ఎక్కడ పొరపాటునా ప్రమాదము తెచ్చుకుంటాడో అనే శంకతో…

ఒక కుటుంబంలో అమ్మ అలాంటి చల్లని చూపు పిల్లలపై ప్రసరిస్తూ ఉంటే, మరి అమ్మలను గన్నయమ్మ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అయి ఆ కనకదుర్గమ్మ చల్లని చూపు పడని జీవితం ఉంటుందా…?

మన కర్మ ప్రభావం చేతను అమ్మ ఆగ్రహానికి గురైనాము అనో, అమ్మ అనుగ్రహానికి నోచుకోలేదనో బాధపడుతూ ఉంటామని అంతే కానీ అమ్మ అనుగ్రహం లేకుండా ఉండదని పెద్దలు అంటూ ఉంటారు. నిజమే కదా లోకాలను పాలించే అమ్మను నమ్మి చెడినవారుండరు.

అమ్మ అనుగ్రహం అందరికీ ఉంటుంది. చంటి పిల్లలను గమనించే తల్లిలా అమ్మ కనకదుర్గమ్మ అందరినీ ఓ కంట కనిపెట్టుకునే ఉంటుందని అంటారు. అటువంటి అమ్మ నవరాత్రులలో ఉత్సాహంతో అమ్మను ఆరాధిస్తూ అమ్మకు కృతజ్ఙతలు తెలియజేస్తూ ఉండడం వలన అమ్మ మరింత ఆనందిస్తూ ఉంటుంది. నిత్యానందమయి అయిన అమ్మ చల్లని చూపు మీపై మీ కుటుంబ సభ్యులపై ఉండాలని ఆశిస్తూ…. హ్యాపీ దసరా విషెస్