Tag Archives: క్రమశిక్షణ

విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి

విద్యను అర్ధించేవారిని విద్యార్ధులు అంటారు. క్రమశిక్షణ అంటే సక్రమమైన ప్రవర్తనతో మెసులుకోవడం అంటారు. ముఖ్యంగా విద్యార్ధి దశలో విద్యార్ధులకు సరైన క్రమశిక్షణ ఖచ్చితంగా ఉండాలని సూచిస్తారు. నేర్చుకునే వయస్సులో ఏవి తరువుగా నేర్చుకుంటారో, అవే జీవితం అంతా తోడుగా ఉంటాయి. అందుచేత విద్యార్ధి దశలోనే పిల్లలకు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను అలవాటు చేయాలని చెబుతారు. విద్యార్థులు క్రమశిక్షణ​ తెలుగులో వ్యాసం వ్రాయండి.


పిల్లలకు వినయ విధేయతలు ఎందుకు నేర్పాలి? క్రమశిక్షణను ఎందుకు అలవాటు చేయాలి?


మొక్కగా ఉన్నప్పుడే వంగని మొక్క, అది పెరిగి చెట్టుగా మారాకా మాత్రం వంగుతుందా? ఒక మొక్క వలె వ్యక్తి బాల్యం సుకుమారంగా ఉంటుంది. వారి మనసు చాలా సున్నితంగా ఉండవచ్చును. అటువంటి చిన్నప్పుడే వారికి వినయవిధేయతలు అలవాటు కాకపోతే, వారు పెద్దయ్యాకా కూడా వారు అలాగే వినయం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. క్రమశిక్షణారాహిత్యంగా ఉండడం చేత వారికి జీవితంలో అవకాశాలు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా వినయపరులతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. వ్యక్తి జీవితంలో తనకున్న పరిస్థితులలో కుటుంబంలో కానీ, పని చేసే కార్యాలయంలో కానీ, పని చేయించుకునే కార్యాలయంలో కానీ సత్ప్రవర్తన చేతనే అవి వృద్దిలోకి తీసుకుని రాగలరు. వ్యక్తి ఉత్తమ స్థితికి క్రమశిక్షణతో కలిగిన ప్రవర్తన ఎంతో సహాయపడుతుంది కావునా పిల్లలగా ఉన్నప్పుడే, వారికి క్రమశిక్షణ నేర్పించాలని చెబుతారు.


ఇంకా సృజనాత్మకత, తెలివి, అవగాహన ఏర్పరచుకునే వయస్పు కాబట్టి, ఆ వయస్సులో ఎటువంటి విషయాలలో శ్రద్ద చూపితే, ఆ విషయాలు మనసులో బలంగా నాటుకుంటాయి. ఇక చదువు విషయంలో బాలబాలికలు చూపే శ్రద్ద వలన,  కాబట్టి క్రమశిక్షణ అనేది వ్యక్తికి విద్యార్ధి దశ నుండి చాలా అవసరం అని అంటారు.


ఎలా చెబితే, పిల్లలకు క్రమశిక్షణగా ఉండడానికి ప్రయత్నిస్తారు?


పిల్లలకు సులభంగా అనుకరిస్తూ ఉంటారు. అంటే తాము గమనించింది, చేయడానికి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇంట్లోవారు ప్రవర్తించే ప్రవర్తనను, పిల్లలు గమనిస్తూ, అదేవిధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి పిల్లల ముందు పెద్దవారు క్రమశిక్షణతో ప్రవర్తించడం చాలా మేలైన విషయంగా చెప్పబడుతుంది. క్రమశిక్షణతో ఉండమని చెప్పడం కన్నా, క్రమశిక్షణతో వారి ముందు ప్రవర్తించడమే సరైన మార్గముగా చెబుతారు.


విద్యాలయాలలో కేవలం పిల్లలకు క్రమశిక్షణ గురించి బోధించడమే కాదు. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన అందరూ ప్రదర్శించినప్పుడే, విద్యార్ధులకు వ్యవస్థ అంటే క్రమశిక్షణ ప్రధానం అనే ఆలోచన బలపడుతుంది. లేకపోతే విద్యార్ధి దశ నుండే, క్రమశిక్షణ కేవలం మాటలకే పరిమితం, అది ఒక వ్యాసరచన చేసి, మార్కులు సంపాదించుకోవడానికే అనే అభిప్రాయం బలపడే అవకాశం ఉంటుంది. కావునా పిల్లలకు క్రమశిక్షణతో కూడిన బోధనతో బాటు, క్రమశిక్షణతో వ్యవహరించడం చాలా చాలా ప్రధానం.


అలాగే కుటుంబంలోనూ కూడా పెద్దవారు, చిన్నవారి ముందు క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనతో ఉండడం చేత, మరింత మంచి ఫలితం పొందవచ్చును. క్రమశిక్షణ అంటే ఏమిటి?


క్రమమైన పద్దతిని అనుసరించడమే క్రమశిక్షణ అంటారు. ప్రతి పనికి, ఆ పనిని పూర్తి చేయడానికి ఒక క్రమము ఉంటుంది. అలాంటి క్రమమును గురించి తెలుసుకునే, అదే పద్దతిలో నడుచుకోవడం క్రమశిక్షణ అంటారు. ఉదాహరణకు మనం స్వీకరించే ఆహారం.


ఒక పనిని క్రమపద్దతిలో చేయకపోతే?


మనం తీసుకునే ఆహారం ముందుగా వండుతారు. అది ఏ క్రమములో ఉంటుంది? మనం రోజు తినే ఆహారంలో ప్రధానంగా అన్నం ఉంటుంది. దానికి అనుషంగికంగా కూరలు ఉంటాయి. అన్నమును ఒక క్రమములోనే వండుతారు.



  1. శుభ్రపరిచిన పాత్ర

  2. నిర్ణీత పరిమాణంలో బియ్యం

  3. బియ్యమును నీటితో శుభ్రపరుచుట

  4. కడిగిన బియ్యమును, శుభ్రపరిచిన పాత్రలో వేయడం, తగినంత నీరును పోయడం

  5. గ్యాస్ స్టౌవ్ వెలిగించడం

  6. కడిగిన బియ్యము, తగినంత నీరు కలిగిన శుభ్రపరిచిన పాత్రను గ్యాస్ స్టౌవ్ పై ఉంచడం.

  7. బియ్యము అన్నముగా మారేవరకు ఉడికించడం.

  8. ఉడికించిన అన్నమును ఆహారముగా తీసుకుంటారు. (ఏదైనా క్రమపద్దతిలో వండిన కూరతో కానీ పచ్చడితో కానీ స్వీకరించడం)


ఇప్పుడు చూడండి… పై పద్దతిలో ముందుగా ఏదైనా పనిని చేస్తే ఎలా ఉంటుంది? 1 వ పాయింట్ అంటే, శుభ్రం చేయకుండానే ఒక పాత్రంలో బియ్యమును పోసి, అందులో బియ్యం వేసి, నీరు పోసి స్టౌవ్ పైన పెట్టేసి, ఆ పాత్రలో బియ్యమును ఉడిస్తున్నాం… ఇప్పుడు ఇందలో స్కిప్ చేయబడినవి ఏమిటి?


పాత్ర శుభ్రం చేయలేదు. బియ్యమును కూడా శుభ్రం చేయలేదు.


శుభ్రం చేయని పాత్రను అన్నం వండడానికి ఉపయోగించాము కాబట్టి, గ్యాస్ స్టౌవ్ పై అన్నం ఉడుకుతున్న పాత్రను శుభ్రం చేయాలంటే, అందులో వేసిన బియ్యం వృధా అవుతాయి. కాలం వృధా అవుతుంది. గ్యాస్ వృధా అవుతుంది. ఇంకా శరీరానికి హాని చేసే క్రిములు మనం తీసుకునే ఆహారంలో ఉండవచ్చును….


క్రమశిక్షణ లేని పనితనం సరైన ఫలితం?


ఇలాగే ఏదైనా ఒక పనిని క్రమ పద్దతిలో చేయకపోతే, ఆ పని ఫలితం సరైన సమయంలో పొందలేరు. ఇంకా అతి విలువైనా కాలం కూడా హరించుకుపోతుంది. అన్నం వండుకోవడం సక్రమంగా చేయకపోతే, మరలా వండుకునే అవకాశం ఉంటుంది. అదే అనేకమంది నడిచే ఒక బ్రిడ్జ్ కడితే, ఆ బ్రిడ్జ్ పరిస్థితి, అక్కడ నడిచే మనుషులు పరిస్థితి ఏమిటి? అలాగే ఒక వ్యక్తికి ఆపరేషన్ జరిగితే?… అంటే కొన్ని కొన్ని పనులు మరలా చేసుకునే అవకాశం ఉంటుందేమో కానీ కొన్ని పనులకు ఒక్కసారే అవకాశం, రెండవ అవకాశం ఉండదు. దాని యొక్క నష్టం భరించాల్సి ఉంటుంది. అప్పుడే సాధనలో ఉండే దోషాలు బయటపడతాయి.


ఇలా ఒక క్రమపద్దతిలో చేసే పనులు గురించి, విద్యలో భాగంగా నేర్చుకుంటూ ఉంటాము. అవి అనేక పుస్తకాలలో కూడా లభిస్తూ ఉంటాయి. కానీ క్రమశిక్షణ మాత్రం ఎదుగుతున్న వయస్సులోనే, ప్రవర్తిస్తూ అలవాటు చేసుకునే క్రియ కాబట్టి… అది చూసి నేర్చుకునే వయస్సులోనే అలవాటు కాబట్టి క్రమశిక్షణ విషయంలో పిల్లలు, పెద్దలు కూడా క్రమశిక్షణతో నడుచుకోవడం ప్రధానం అని సూచిస్తారు.


అన్నం వండుకోవడానికి మొదటగా కడిగిన పాత్ర ఎలాగో, విద్యను పూర్తి స్తాయిలో అభ్యసించడానికి విద్యార్ధికి ప్రాధమిక దశలో క్రమశిక్షణ చాలా ప్రధానం అంటారు. ప్రాదమిక దశలో కేవలం విషయాలు పరిచయం అవుతాయి. కళాశాల విద్యలోనే లోతైన విశ్లేషణ, మరియు పరిశోధనాత్మక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. కావునా క్రమపద్దతిలో తెలుసుకోవడం అనే ప్రక్రియలో క్రమశిక్షణ పిల్లలకు అవసరం అంటారు.


ఏ వ్యవస్థ అయినా ముందుగా ఒక నియమావళి ఉంటుంది.


ఏదైనా ఒక వ్యవస్థ మనుగడ సాగిస్తుందంటే, ఆ వ్యవస్థలో పాటించే నియమ నిబంధనలు క్రమశిక్షణతో ఆచరించే వ్యక్తుల వలననే అంటారు. ఒక వ్యవస్థలోని వ్యక్తులంతా ఒక్కమాటపై నిలబడితే, ఆ వ్యవస్థపై అంటే సమాజంలో అందరికీ నమ్మకం ఉంటుంది. అలా ఒక వ్యవస్థలో అంతా ఒక్కమాటపై నిలబడే తత్వం క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తులకే సాధ్యం అంటారు. ఒక వ్యవస్థ స్థాయిని పెంచేది, దించేది కూడా ఆ వ్యవస్థలో భాగస్వాములైన వ్యక్తులే కారణం అవుతారు. కాబట్టి వ్యవస్థాగత అభివృద్దికి వ్యక్తి క్రమశిక్షణ చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది… కావునా విద్యార్ధులకు విద్యార్ధి దశలోనే క్రమశిక్షణ చాలా అవసరం అంటారు. ఎందుకంటే నేటి విద్యార్ధులే రేపటి వ్యవస్థలో భాగస్వాములు కాగలరు కాబట్టి…

ఇలా రంగం ఏదైనా సరే ఆయా రంగాలలో ఉండే వ్యక్తుల క్రమశిక్షణ చేతనే రంగం అభివృద్దిని పొందుతుంది… సమాజంలో వివిధ రంగాలు, వివిధ వ్యవస్థలు, సంస్థలు భాగమై ఉంటే, సజావుగా సాగుతున్నంతకాలం సమాజంలో వ్యక్తుల జీవన విధానం కూడా మెరుగ్గా ఉంటుంది. అంటే సమాజంలో వ్యవస్థలు సరిగ్గా పనిచేయడానికి కారణం వ్యక్తి క్రమశిక్షణతో కూడిన పని కారణం అవుతుంది కాబట్టి విద్యార్ధి దశ నుండే క్రమశిక్షణ అలవరచుకోవాలని అంటారు.

విద్యార్థులు క్రమశిక్షణ​ విద్యార్ధి దశ నుండే ప్రారంభించాలి

మొక్కై ఒంగనప్పుడు మానై ఒంగునా అనే నానుడి ప్రసిద్ది… అంటే మొక్కగా ఉండనప్పుడు ఒంగనది రానిది అది పెరిగి పెద్దదయ్యాక ఒంగుతుందా…. అలాగే విద్యార్ధి దశలో క్రమశిక్షణ అలవాటు అవ్వకపోతే, వ్యక్తిగా ఎదిగాక క్రమశిక్షణ అలవాటు అవుతుందా? చిన్నప్పుడు లేని క్రమశిక్షణ పెద్దయ్యాక ఉండదనే అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది.

విద్యార్ధి దశ అంటే నేర్చుకునే దశ… అనుకరించే దశ. చూసి పట్టుకునే దశ. విని సాధన చేసే దశ. కాబట్టి విద్యార్ధి దశలోనే విద్యార్థులు క్రమశిక్షణ​ను అలవాటు చేసుకోవాలి.

సమయానికి తగిన పనులు చేయడం.

ఏ సమయంలో ఏ పనులు చేయాలో, అటువంటి పనులు చేయడం

పెద్దలు మాటలు ఆలకించి, మంచిని సాధన చేయడం.

క్రమశిక్షణతో కూడిన సాధన మంచి ఫలితాలను అందిస్తుంది. కాబట్టి విద్యార్థులు క్రమశిక్షణ​ చిన్నప్పటి నుండి అలవాటు చేసుకోవాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు నిత్యం వెన్నంటి ఉంటారు. ప్రతివారికి బాల్యం భగవంతుడు అందించిన వరం. అనుకరించడంలో డిగ్రీ పుచ్చుకున్నట్టుగా అనుసరించడంలో ముందుండే బాలల చుట్టూ రక్షణ వలయంలాగా సమాజం ఉంటుంది.

ఇంట్లో అమ్మా, నాన్న అన్నయ్య, అక్క, ఇంటి చుట్టూ ఇరుగుపొరుగు, ఇంటి బయట బంధువులు, ఊరికెళితే అత్తయ్య, మామయ్య, అమ్మమ్మ, తాతయ్య చదువుకుంటున్న వేళల్లో బోధకులు ఇలా నిత్యం బాలల వెన్నంటి బాలల శిక్షణకు, బాలల ఉత్తమ క్రమశిక్షణ కోసం పాటుపడే వ్యవస్థ మన సమాజంలో బాలలకు వరం వంటిది.

స్కూలుకు వెళ్ళిన బాలలు ఇంటికి తిరిగిరాకపోతే ఇంటి నుండి పెద్దల ఆరా… స్కూల్ నుండి ఇంటికి బయలుదేరిన పిల్లలు ఇంటికి క్షేమంగా చేరడానికి ప్రయత్నించే స్కూల్ సిబ్బంది…. ఇలా బాలల చుట్టూ బాలల కోసం పాటుపడేవారు తమ వంతు సేవ చేస్తూనే ఉంటారు.

సమాజంలో ఎక్కడన్నా రాజీపడి తప్పును క్షమిస్తారేమో కానీ బాలల విషయంలో తప్పుకు తావివ్వరు. అలా రక్షణాత్మక దోరణి బాలలపై చూపుతారు. అటువంటి బాల్యం అందరికీ వరమే. బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు అనేకమంది వారి చుట్టూ ఉంటారు.

బాలల దినోత్సవం సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు.

ప్రతి యేడాది నవంబర్14 బాలల దినోత్సవం. ఆ సందర్భంగా బాలలకు శుభాకాంక్షలు. బాలలు మీది నేర్చుకునే వయస్సు ఆ వయస్సులో మీరు ఏమి నేర్చుకుంటున్నారో అది మీ జీవితము మొత్తము మీకు తోడుగా ఉంటుంది. కాబట్టి మంచి విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవడానికి నిత్యం పాటుపడాలి. ఎందుకంటే నిత్యం మీ వెన్నంటి ఉండేవారి తపన అదే కాబట్టి.

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు

ఇక బాల్యంలో బాలలు ఏమి అలవాటు చేసుకుంటూ ఉంటే, ఆ అలవాట్లే జీవితము అంతా ప్రభావం చూపుతూ ఉంటాయి. కారణం అనుసరించే గుణం కలిగిన మనసుకు అనుసరించి, అనుసరించి అలవాటుగా మార్చేసుకుంటుంది. కాబట్టి మీరు మీ బాల్యంలో మంచి అలవాట్లను అలవరచుకుంటే, అవి మీకు జీవితము మొత్తము మంచి కీర్తి ప్రతిష్టలను సాధించడానికి దోహదపడతాయి. ఎందుకంటే నిత్యం మీ వెన్నంటి ఉండేవారి చిరకాల కోరిక అదే కాబట్టి.

ఎదిగే వయస్సులో అల్లరి ఉంటుంది. అదే అలవాటుగా అయిపోతే నలుగురిలో మీరు అల్లరిపాలు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అల్లరి సరదా దగ్గర ఆగిపోవాలి. మంచి అలవాట్లతో మనసుపై నియంత్రణ కలిగి ఉండడం అలవాటు చేసుకోవాలి.

బాలల దినోత్యవం సందర్భంగా బాలలు తమకు తాము గమనించవలసిన విషయాలు

పైన చెప్పుకున్నాము… బాలలుగా ఉన్నప్పుడు బాలల చుట్టూ ఒక రక్షణ వలయంగా ఇంటి దగ్గర నుండి స్కూల్ వరకు రక్షణాత్మక దోరణి ఉంటుందని.

అలా ఏర్పడిన రక్షణ వలయంలో ఉన్నవారంతా మీ క్షేమము కొరకే ఆలోచిస్తూ ఉంటారు. అందులో భాగంగా కొన్ని కొన్ని సార్లు కొంతమంది విద్యార్ధులను టీచర్లు మందలించడం కానీ ఇంట్లో పెద్దలు మందలించడం కానీ జరుగుతుంది. అలా మందలించబడిని విద్యార్ధులు తమ తప్పులు తాము తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే మార్గం ఇంట్లో పెద్దవారిని కానీ స్కూల్లో టీచర్లను కానీ అడిగితే అక్కడే మీ మనసుపై మీకు విజయం సాధించే అవకాశాన్ని అందుకుంటున్నట్టే లెక్క.

ఇలా విద్యార్ధులు కొన్ని కొన్ని తప్పులు అల్లరితో వచ్చేవిగా ఉన్నట్టు ఉన్నా…. ఎక్కడైనా స్వభావం దోషంగా కనబడితే అటువంటి బాలల విషయంలో పెద్దలు కానీ టీచర్లు కానీ గమనించగానే బాలలను హెచ్చరించడం, మందలించడం సహజం…. కాబట్టి బాలలూ మిమ్మల్ని టీచర్లు మందలిస్తే, ముందు అలా మందలించడానికి కారణం కనుక్కోవాలి. అలా కనబడిన కారణంలో మీ తప్పును మీరు తెలుసుకోగలగాలి. తప్పును సరిదిద్దుకోవడానికి మార్గం ఆలోచించాలి. అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తపడాలి.

బాలలుగా ఉన్నప్పుడు పెద్దల మందలింపు చర్యలను తప్పు బట్టడం కన్నా ముందు ఆమాటలను పాజిటివ్ దృక్పదంతో ఆలోచించడం అలవాటు చేసుకోవాలి.

బాలలుగా ఉన్నప్పుడే ప్రధాన విషయాలలో వినడం ప్రధానం.

మొక్కగా ఉన్నప్పుడు ఒంగని మొక్క పెరిగి మానై అంటే పెద్ద చెట్టుగా పెరిగాకా ఒంగుతుందా? ఈ సామెతే బాలలకు బాగా వర్తిస్తుందంటారు.

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు
బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు

బాల్యంలో వినడం మానేసి ఇష్టానుసారంగా వ్యవహరించే పిల్లలలు పెరిగి పెద్దయ్యాక కూడా అదే ప్రవర్తన కలిగి ఉంటారు. అటువంటి ప్రవర్తన వలననే సమాజంలో ఎప్పుడో ఒకసారి నలుగురిలో నవ్వులపాలు అవుతూ ఉండడం జరగవచ్చును. అదే బాల్యంలో క్రమశిక్షణకు అలవాటు పడితే మాత్రం ఆ క్రమశిక్షణ జీవితాంతము ఉంటుంది.

ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ విద్యార్ధులను దండించారు అంటే దానికి కారణం మాత్రం క్రమశిక్షణను ఉల్లంఘించారనే భావన బలపడడమే అవుతుంది.

కాబట్టి బాలలుగా ఉన్నప్పుడు క్రమశిక్షణను ఉల్లంఘించరాదు. పొరపాటున క్రమశిక్షణ ఉల్లంఘించినా మరలా అది రిపీట్ కాకుడదు.

సమాజంలో ప్రధాన దరిద్రం ఏమిటంటే, కొన్ని వీడియోల ద్వారా ప్రేక్షకులను ఆకర్షించడం కోసం కామెడీ ప్రయత్నంలో బాగంగా క్రమశిక్షణను హేళన చేయడమే ప్రధాన ధ్యేయంగా ఉండడం.

కాబట్టి క్రమశిక్షణ ఉల్లంఘించడం అంటే గొప్పకాదు. అది మీకు మీరే నష్టం చేసుకుంటున్నట్టే.

బాలలుగా ఉన్నప్పుడే ప్రధాన విషయాలలో వినడం ప్రధానం. ప్రధాన విషయాలలో అంటే క్రమశిక్షణ, పాఠ్యాంశాలు చదివే తీరు, అవగాహన ఏర్పరచుకోవడం. పెద్దల మాటను గౌరవించడం. విన్నదానిలో విషయ సంగ్రహణం. ఎటువంటి విషయాలను వెంటనే వదిలిపెట్టాలి. ఎటువంటి విషయాలలో పట్టింపులు ఉండాలి. ఎటువంటి విషయాలలో పట్టుదల చూపాలి… ఇవ్వన్ని ఎప్పటికప్పుడు పెద్దల ద్వారా బాలలకు చెప్పబడుతూనే ఉంటాయి. విని మంచిని స్వీకరిస్తూ, పాజిటివ్ కాన్సెప్టును మైండులో బాగా వృద్ది చేసుకోవాలి….

బాలల దినోత్సవం బాలలకు భరోసగా ఉండేవారు ఎల్లప్పుడూ బాలల చుట్టూ ఉంటారు… బాలలుగా ఉన్నవారు పెద్దల కష్టం గుర్తించి, వార కష్టాన్ని వృధా కానీవ్వకుండా… నేర్చుకోవాలసిన విషయాలలో దృష్టి కేంద్రికరించడం ప్రధాన కర్తవ్యం.