Tag: ప్రియనేస్తమా

  • తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ

    తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ వ్రాయడం గురించి….

    లేఖ వ్రాసేటప్పుడు మొదటగా టాప్ రైట్ కార్నర్లో డేట్, దాని క్రిందగా ప్లేస్ వ్రాస్తాము. ఆ తరువాత ఉత్తరం వ్రాసే వ్యక్తి పేరు, ఆ వ్యక్తి చిరునామ వ్రాస్తాము.

    ఇంకా క్రిందగా ఉత్తరం ఎవరికి వ్రాస్తున్నామో వారి హోదాను బట్టి, వారిని సంభోదిస్తాము.

    మిత్రుడుకి లెటర్ వ్రాస్తున్నాము కాబట్టి ప్రియమైన స్నేహితుడా…. లేదా

    ప్రియనేస్తమా లేకా ప్రియమిత్రమా… అంటూ ఆప్యాయంగా సంబోధిస్తూ లేఖ వ్రాయడం మొదలు పెడతాము.

    తేదీ: 01.08.2021, 
    విజయవాడ

    మొదటగా తారీఖు, ప్రాంతము వ్రాసాము… ఇప్పుడు మిత్రుని పేరు, చిరునామా…

    మీ మిత్రుని పేరు, 
    మిత్రుని నివాస వీధి, 
    మిత్రుని ఊరు, మండలం, జిల్లా,
    మిత్రుని స్టేట్ - పిన్ కోడె.

    ఇప్పుడు మిత్రుడిని సంభోదిస్తూ…. లేఖను వ్రాయడం….

    ప్రియ నేస్తమా...
    నీవు అచ్చట కుశలమా.... నేను ఇచ్చట కుశలము. అంటూ కుశల ప్రశ్నలతో మొదలు పెట్టి... పండుగ గురించి వ్రాయాలి. పండుగ విశిష్టత, పండుగను మీ ఊరిలో ఏవిధంగా జరుపుకుంటారు. పండుగలో ప్రధాన ఆకర్షణలు ఏమిటి తెలియజేస్తూ... పండుగ ప్రభావం మీపై ఎలా ఉంటుందో తెలియజేస్తూ... లేఖ కొనసాగించాలి. తరువాత పండుగకు మిత్రుని ఆహ్వానిస్తూ', లేఖను కొనసాగించవచ్చు.

    దీపావళి, సంక్రాంతి, దసరా, వినాయక చవితి తదితర పండుగలు పల్లెటూళ్లలో బాగా జరుగుతాయి. అలాగే పట్టణాలలోనూ బాగా జారుగుతాయి.

    ఎప్పుడూ ఓకే లాగా కాకుండా మార్పు కోరే మనసుకు మరొకచోట జరిగే పండుగలపై కూడా ఆసక్తి ఉంటుంది. కాబట్టి పల్లెటూల్లో ఉండేవారికి పట్టణం వాతావరణంపై, పట్టణంలో ఉండేవారికి పల్లెటూరిపై ఆసక్తి ఉంటుంది.

    కావున పండుగ గురించి మీ మీ ప్రాంతాలలో ఎలా చేస్తారో… అందులో విశేషాలు ఏమిటో తెలియాయజేయడం. ఇంకా ఆ పండుగలో ఎలా పాల్గొంటున్నది… తెలియజేస్తూ… మిత్రుడికి ఆహ్వాన లేఖను ముగించడం….

    ఓయ్ మిత్రమా నీవు మా ఊరిలో పండుగను చూడాలి... నీకు ఇదే నా ఆహ్వానం... నీవు, నీ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని, మా ఊరికి రావాలి.
    తప్పకుండా నీవు పండుగకు మా ఊరికి వస్తావని ఆశిస్తూ... నీనేస్తం...
    
    ఇట్లు,
    ప్రియ మిత్రుడు
    మీ పేరు.

    ఈ విధంగా తెలుగులో తెలిసిన పండుగ గురించి మిత్రునికి లేఖ వ్రాయవచ్చు.