భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము. భారత స్వాతంత్ర్యం వచ్చాక, దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ప్రజల తీర్పును గౌరవించిన అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, అదుకు తగినట్టుగా తమ వంతు పాత్రను పోషించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగినప్పుడు ఓటరు విభిన్నంగా తీర్పులు చెప్పిన సందర్భములు కూడా ఉన్నాయి. కేంద్రంలో అధికారం అందించిన పార్టీకి, ప్రాంతీయంగా ఓటమి తప్పలేదు. అలా ఓటరు ఏవిధంగా తమ తీర్పును చెప్పినా భారతదేశంలో రాజకీయ పార్టీలు ప్రజల తీర్పును గౌరవించాయి.
దేశంలో ప్రధానంగా కాంగ్రెసు, భాజాపా రాజకీయ పార్టీలు కేంద్రంలో పోటీ పడుతుంటే, రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ళలో కేంద్రంలోనూ, రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటే, తర్వాతి కాలంలో రాష్ట్రాలలో మాత్రం ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు ప్రభావం పెంచుకుంటూ వచ్చాయి.
కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ప్రభావం కాపాడుకుంటూ వచ్చింది. కానీ గత పదేళ్ల కాలం నుండి కాంగ్రెస్ తన ప్రభావం కోల్పోయి, మరలా పూర్వ వైభవం కోసం కృషి చేస్తుంది.
గత పదేళ్ళ కాలం నుండి భారతీయ జనతా పార్టీ మోదీ నాయకత్వంలో దేశంపై విశేషంగా ప్రభావం చూపుతుంది. 2014, 2019 సంవత్సరాలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఇప్పుడు మూడవసారి 2024 సార్వత్రిక ఎన్నికలలో కూడా విజయభావుటా ఎగురవేయాలనే కృతనిశ్చయంతో భారతీయ జనతా పార్టీ దూసుకువెళుతుంది.
కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం భారత పాలనలో కేంద్ర రాజకీయ పార్టీల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మరియు దాని మిత్ర పక్షాల ప్రభావం పెరుగుతుంది.
భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను మార్చిన నాయకులు…
మన దేశంలో అత్యంత శక్తివంతమైన పదవి అంటే, ప్రధాని పదవిగా చెబుతారు. ఆవిధంగా పాలనాపరంగా ప్రభావం చూపిన నాయకులలో దేశ ప్రధానులు. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరాగాంధి, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ మొదలైనవారు ప్రధానమంత్రి పదవిని అధిరోహించారు. 1990 దశకం వరకు ఒక విధానంలో పరిపాలన సాగితే, తర్వాతి కాలంలో జరిగిన పరిపాలన వేరు అంటారు. ఎందుకంటే 1990వ దశకంలో వరకు నెహ్రూ కుటుంబ పాలన ఉండేది.
ఆ తర్వాత కాలంలో ప్రధాన పదవిని చేపట్టిన పివి నరసింహారావుగారు మాత్రం దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ది పదంలో నడవడానికి చాలా చొరవ చూపించారని అంటారు. ఆయన పదవీ కాలంలో ఆర్ఖిక సంస్కరణలు తీసుకురావడం, తద్వారా భారతదేశంలో పెట్టుబడులు రావడం, అనేక రంగాలలో వృద్ది సాధించడం జరిగిందని అంటారు. తర్వాతి స్థానంలో వచ్చిన వాజ్ పేయి ప్రభుత్వం కూడా పివి నరసింహారావుగారు ప్రవేశ పెట్టిన సంస్కరణలను అనుసరించారని అంటారు.
ఆపై మరలా దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తిని పెంచుకున్న ప్రధానిగా దేశంపై అత్యంత ప్రభావం చూపుతున్న బారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోదీగారు. ఈయన ప్రభావం చూపుతున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఆదరిస్తున్నారు.
ఓటర్లను ప్రభావితం చేసే అంశం ఏమిటి?
ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ పాత్ర
సామాజిక విశ్లేషకుడు అంటే ఎవరు?
ఓటరు బాధ్యత ఏమిటి? వివరించండి.
ప్రణాళిక అంటే అర్ధం ఏమిటి? meaning in english
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
భారత పాలనలో రాజకీయ సామాజిక స్థితిగతులను విశ్లేషించుము
చిత్తము అనే పదానికి తగిన అర్థం
చతురత పదానికి అర్థం చతురత మీనింగ్
అభ్యుదయం అంటే అర్ధం తెలుగు పదము
రాజకీయాలు గురించి తెలుగు సినిమాలు
డబ్బులు దాచుకునేటప్పుడు దాచిన తర్వాత కూడా
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
భర్ ఓఎస్ ప్రజలకు భరోసా ఐతే ఇతర ఓఎస్ లకు షాకింగ్
మౌనంగా ఉండడమంటే నిశ్శబ్దంగా ఉండడం
ఇదే ఆటతీరుతో ఉంటే భారత్ కే ప్రపంచకప్….
ప్రశాంత్ వర్మ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ నీల్ వాటే నేమ్స్ గురుజీ!