మహేష్ బాబు రాజకుమారుడు నుండి భరత్ అను నేను వరకు చిత్రాలు: మహేష్ మహేష్ మహేష్ అంటూ మహిళలు కలవరిస్తారు అంటూ చాటి చెప్పే తెలుగు చిత్రం వచ్చి మహేష్ పేరుపై ఉన్న క్రేజీని చూపింది. ఆపేరుకు అంతలా క్రేజీ ఎందుకు క్రేజ్ వచ్చింది అంటే మహేష్ బాబు అంటారు. అష్టాచమ్మా చిత్రంలో మహేష్ పేరు గురించి ఆ చిత్ర కధానాయికలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఇక నిజజీవితంలో మహేష్ లు చాలామందే ఉంటారు. ప్రముఖులు కూడా ఉంటారు. అయితే సినిమా హీరో మహేష్ బాబు మాత్రం మంచి క్లాస్ ఇమేజ్ ఉన్న హీరో.
హీరోగా చేసిన తొలిచిత్రంతోనే నూతన ఉత్తమ నటుడుగా నంది పురష్కారం అందుకున్నారు. మహేష్ కృష్ణగారబ్బాయిగా ఆగష్టు9 1975లో జన్మించారు. నీడ, పోరాటం, శంఖారావం, బజారురౌడి, గూడచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్నాతమ్ముడు చిత్రాలలో బాలనటుడుగా నటించారు. కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ చేసారు.
1999 సంవత్సరంలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రాజకుమారుడు చిత్రం ద్వారా మహేష్ బాబు హీరోగా పరిచయం అయ్యారు. తొలిహీరో చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. 2000 సంవత్సరంలో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో యువరాజు చిత్రంలో ఒక బిడ్డ తండ్రిగా రెండవ చిత్రంలోనే నటించేసి ఆశ్చర్యపరచారు. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన వంశీ చిత్రంలో తనతో వెండితెరని షేర్ చేసుకున్న ఆమెతోనే మహేష్ బాబు తన జీవితాన్ని షేర్ చేసుకుంటున్నారు. 2001 సంవత్సరంలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం ద్వారా స్పెషల్ జ్యూరి నంది పురష్కారం అందుకున్నారు. అరె ఒరేయ్ అని తనను కన్నవారితో కూడా పిలవబడని ఒక యువకుడుగా మహేష్ మురారి చిత్రంలో నటించారు.
తండ్రికి కౌబోయ్ చిత్రాల్లో ఉన్న క్రేజ్ వలననో ఏమో 2002లో టక్కరిదొంగ అనే కౌబోయ్ చిత్రంలో నటించారు. ఆశించినంత ఆర్ధిక విజయం సాధించకపోయినా మహేష్ బాబు నంది స్పెషల్ జ్యూరి పురష్కారం అందుకున్నారు. అలాగే అదే సంవత్సరం వచ్చిన బాబి చిత్రం అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. 2003 సంవత్సరంలో వచ్చిన ఒక్కడు ఆ సంక్రాంతి సీజన్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది, ఉత్తమ నటుడుగా మహేష్బాబు ఫిలిం ఫేర్ పురష్కారం అందుకున్నారు. అదే సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం నిజానికి బాగున్నా అభిమానులకు అంతగా ఎక్కలేదు. కాని నిజానికి మహేష్ బాబు ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు.
నాని, అర్జున్, పోకిరి విబిన్నమైన కధా చిత్రాలలో మహేష్ నటన
2004 సంవత్సరంలో మహేష్ నానిగా నటించారు. 8ఏళ్ల బాలుడు 28 ఏళ్ల యువకుడుగా మారితే ఎలా ఉంటుందో ఈ చిత్రం ద్వారా చూడగలం. తమిళ దర్శకుడు ఎస్ జే సూర్య దర్శకత్వంలో అమీషా పటేల్ హీరొయిన్ గా ఈ చిత్రం వచ్చి, పాటల పరంగా ఆకట్టుకుంది. అదే సంవత్సరంలో చెల్లెలు కోసం ప్రాణాలకు తెగించే అన్నగా అర్జున్ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు, తత్ఫలితంగా నంది స్పెషల్ జ్యూరి పురష్కారం అందుకున్నారు.
అర్జున్ చిత్రం తర్వాత వచ్చిన అతడు అందరిని ఆకట్టుకున్నాడు, టివిలలో చాలా కాలం ఈ చిత్రం ప్రదర్శితమైంది. మహేష్ అను అతడుకి ఉత్తమ నటుడుగా 2005 సంవత్సరానికి నంది పురష్కారం వచ్చింది. చిత్రంగా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ చేయనంటే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుతో తీసి పవన్ ప్రశంశ అందుకున్నారు.
2006లో పోకిరి చిత్రంలో పోకిరి యువకుడుగా నటించిన మహేష్ బాబుకి సూపర్ డూపర్ హిట్ తో బాటు ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడు పురష్కారం లభించింది. పోకిరి తరువాత అంతపెద్ద భారి విజయాలు సాధించని సినిమాలుగా సైనికుడు, అతిథి (2007), ఖలేజా(2010) చిత్రాలు మిగిలాయి. దూకుడు తగ్గించిన 2011లో దూకుడు చిత్రంతో కలెక్షన్ల దూకుడు పెంచారు. అలాగే దూకుడు చిత్రానికి కూడా మహేష్ బాబు ఉత్తమ నటుడుగా నంది పురష్కరానికి ఎంపిక అయ్యారు. 2012లో బిజినెస్ మేన్ చిత్రం కూడా దూకుడులాగానే విజయవంతమైంది.
తెలుగులో మల్టీ స్టారర్ చిత్రంగా 2013 లో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో చిన్నోడుగా మహేష్ బాబు అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో పెద్దోడుగా వెంకటేష్ నటించారు. 2014 లో మహేష్ 1అంటూ వచ్చి, ఆగడు అంటూ 2015లో శ్రీమంతుడుగా మంచి హిట్ కొట్టారు. 2016 వచ్చిన బ్రహ్మోత్సవం ఉత్సాహం తగ్గించి 2017లో కూడా స్పైడర్ పై చూపించింది. ప్రస్తుతం 24వ చిత్రంగా మహేష్ బాబు భరత్ అను నేను అంటూ మంచి హిట్ చిత్రంతో దూకుడును మళ్ళి మొదలు పెట్టారు. అంతఃకరణ శుద్ధితో అనే డైలాగ్ ప్రసిద్ది చెందింది.
మనిషి ఋషి అయితే ఎంత గొప్పవాడు అవుతాడో, అంతటి గొప్పవాడు రైతు తర్వాతే అని సాటి చెప్పే చిత్రంగా వచ్చిన మహర్షి సినిమాలో మహేష్ బాబు కధానాయకుడుగా నటించారు. వ్వవసాయం గొప్పతనం గురించి గొప్పగా మాట్లాడుకునే విధంగా సమాజాన్ని ప్రభావితం చేసిన సినిమాగా మహర్షి సినిమా ప్రశంసలు అందుకుంది. ఇంకా ఈ మహర్షి సినిమాలో అల్లరి నరేష్, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, పూజా హెగ్డే నటించారు.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో