ప్రస్తుత ప్రసిద్ధ తెలుగు దర్శకులు

బుక్ రీడింగ్ అలవాటున్న మీ స్నేహితులకు షేర్ చేయండి

Telugu Chitra Movie Present Famous Directors

Telugu Chitra Movie Present Famous Directors తెలుగులో చిత్రాలని అందించి, అందిస్తున్న కొంతమంది దర్శకుల చిత్రాలు ప్రేక్షకాభిమానం సంపాదిస్తూ వారికి కూడా కొంతమంది అభిమానులు సంపాదించి పెడతాయి. అలా కొన్నిచిత్రాల ద్వారా కొంతమంది దర్శకులకు అభిమానులు ఉంటారు. దర్శకుని పై అభిమానంతో నమ్మకంతో వెళ్ళే దర్శకుల జాబితాలో ఇప్పటి తరం వారు ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాధ్, సుకుమార్, క్రిష్, శేఖర్ కమ్ముల, సతీష్ వేగేశ్న, కొరటాల శివ, మారుతి మొదలైనవారు ఉంటారు.

ఎస్ఎస్ రాజమౌళి చిత్ర దర్శకులు – SS Rajamouli Telugu Chitra Movie Present Famous Directors

ఎస్ఎస్ రాజమౌళి ప్రతి చిత్ర కధానాయకుడి అభిమానికి రాజమౌళి అభిమాన దర్శకుడుగా ఉంటారు. తమ అభిమాన హీరో చిత్రం రాజమౌళి దర్శకత్వంలో ఉంటే బాగుంటుంది అని అభిమానులు భావించేంతగా చిత్రాలను మలిచిన తెలుగుచిత్ర జక్కన అంటే అందరికి అభిమానమే. అలాగే ప్రతి భారతీయ కధానాయకుడుకి కూడా రాజమౌళి దర్శకత్వంలో చిత్రం అంటే అది వారికీ పట్టిన అదృష్టమే అవుతుంది. తెలుగు చిత్ర ఘనతని ప్రపంచానికి చాటుతూ ప్రాంతీయ చిత్ర స్థాయిని అంతర్జాతీయంగా మార్చేసిన చిత్రఋషి ఎస్ఎస్ రాజమౌళి.

స్టూడెంట్ నెం1 చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అయ్యి, తనని దర్శకుడిగా పరిచయం చేసిన హీరోకి చిత్రపరిశ్రమలో సుస్తిర స్థానం ఏర్పరచే చిత్రాలను తీసిన దర్శకుడు బహుశా రాజమౌళి గారే అయ్యి ఉండవచ్చు. Jr. NTR హీరోగా రాజమౌళి దర్శకుడుగా పరిచయం అయితే, సింహాద్రి, యమదొంగ చిత్రాలను jr. ఎన్టీఆర్ పామ్లో లేనప్పుడు రాజమౌళి హిట్ చిత్రాలను అందించారు. అలాగే మెగాస్టారు చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్ కి రెండవ చిత్రం మగధీరతో స్టార్ డం నిలబెట్టేసారు. పురుగుతో చిత్రం తీసి విచిత్రంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగ రాయించారు ఈగతో.

ఎన్టిఆర్, రామ్ చరణ్ కంటే ఎక్కువ లాభపడింది మాత్రం ప్రభాస్, మొదట తీసిన ఛత్రపతి సినిమా సూపర్ హిట్ అయితే, రెండవ సినిమా బాహుబలి భారతదేశంలో సూపర్ హిట్ అయ్యింది, మూడవ సినిమా భారతదేశ అల్ టైం రికార్డు అయ్యింది. తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని పెంచిన దర్శకుడిగా రాజమౌళి గారి గురించి ఎంతచెప్పిన అభిమానికి తనివితీరదు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్ర దర్శకులు – Trivikram Srinivas Telugu Chitra Movie Present Famous Directors

త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాలకు మాటలు రాస్తూ మాటల మాంత్రికుడుగా ఉండి, చిత్రాలను దర్శకత్వం చేస్తూ చిత్ర మాంత్రికుడు అయ్యారు. స్వయం వరం, చిరునవ్వుతో, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, జైచిరంజీవ, మన్మధుడు, వాసు మొదలైన్ చిత్రాలకు మాటలను అందించి, నువ్వే నువ్వే అంటూ చిత్ర దర్శకత్వం వహించారు. నువ్వే నువ్వే కాలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీ అయిన ఒక తండ్రి కూతురి గురించి పడే తపన చిత్రానికి హైలైట్.

అతడుతో అతడికి దర్శకుడెవరు అని తరచి చూసే విధంగా చిత్రం మలిచారు. చిత్రంలో మహేష్ బాబు హీరోగా నటిస్తే, అతని మానరిజంతో సినిమాని చాలా చక్కగా తీర్చిదిద్దారు. తెలుగు టీవీ ఛానెల్లో ప్రసారం అయిన ప్రతిసారి టివికి అతుక్కుని చూసిన చిత్రంగా చెబుతారు. తరువాత పవన్ కళ్యాణ్ తో జల్సా, మళ్ళి మహేష్ తో ఖలేజ, అల్లు అర్జున్ తో జులాయి, పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది చూపించి సన్ అఫ్ సత్యమూర్తి చిత్రంతో విలువలే ఆస్తులు అంటూ మన్ననలు పొందారు. ఆ తరువాత అఆ, అజ్ఞాతవాసి తీసి, ఇప్పుడు ఎన్టిఆర్ తో అరవింద సమేత వీరరాఘవ అని టైటిల్ తో అభిమానుల్లో ఆత్రుత పెంచారు.

సుకుమార్ చిత్ర దర్శకులు – Sukumar Telugu Chitra Movie Present Famous Directors

కొత్తగా ఆలోచన చేస్తూ నవీన తరానికి కొత్తగా చిత్రాలను చూపించే వారిలో ముందుండే దర్శకుడు. ఎప్పుడు కొత్తగా ఆలోచన చేసే యువతరానికి ఈయన చిత్రాలు కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి. అందుకు మొదటి చిత్రం ఆర్య ప్రేమించిన ప్రియురాలు, ఆమె ప్రియుడుగా అనుకునే వ్యక్తితో ప్రేమికుడుగా ప్రవర్తించే పాత్రలో హీరో సాహసోపేతంగా నడిపించిన నాయకుడుగా సుకుమార్ విజయవంతమయ్యారు. అలాగే ఆర్య-2 ప్రేమ-స్నేహం రెండు పార్శ్వాలు ఒకేసారి ఒకవ్యక్తిలో కలిగి అంతఃఘర్షణను చూపించే సాహసం కొత్తగానే కనబడుతుంది.

జగడం సినిమాలో రౌడీయిజం, 100% లవ్ సినిమాలో లెక్కలు వేసే ప్రేమను చూపించిన విధానంలో యువత ఆకర్షితులు. తరువాత 1 నేనొక్కడినే చిత్రం, కుమారి 21f చిత్రాలు అన్ని రొటీన్ కు భిన్నం అన్నట్లు సాగే చిత్రాలే. స్టార్ హీరోతో కూడా ప్రయోగాత్మక చిత్రం తీయగలిగిన దర్శకులలో సుకుమార్ ఒకరు. అల్లు అర్జున్ తో అర్య2, మహేష్ బాబుతో 1 నేనొక్కడినే తీసి, ఎన్టిఆర్ తో నాన్నకు ప్రేమతో చిత్రాలు నిరుపిస్తాయి. స్టార్ హీరో అయిన చిన్న హీరో అయిన చిత్రం రొటీన్ కి భిన్నమే అవుతుంది.

ఎన్టిఆర్ తో తీసిన నాన్నకు ప్రేమతో, నాన్న పగ కోసం జీవితాన్ని రిస్కులో పెట్టి నాన్నకు ఋణం తీర్చుకునే కొడుకుగా ఎన్టిఆర్ ని చక్కగా చూపిస్తారు. కలిక్యులేటేడ్ మైండ్ కలిగిన ఒక యువకుడి పాత్రలో ఎన్టిఆర్ కనిపిస్తారు. ఈమధ్యనే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ రికార్డు సృష్టించిన చిత్రం (బాహుబలి తరువాత ప్లేస్) రంగస్థలం అంటారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ చిట్టిబాబు పల్లెటూరి పాత పాత్రలో పరకాయ ప్రేవేశం చేసినట్టుగా చూపించడం సుకుమార్ సాహసమే చేసారు, విజయవంతం అయ్యారు.

పూరి జగన్నాథ్ చిత్ర దర్శకులు – Puri Jagannath Telugu Chitra Movie Present Famous Directors

ఎంట్రీ ఒక ఫేమస్ హీరోతో చేసిన దర్శకుడు. ఫేంలో ఉన్న పవన్ కళ్యాణ్ తో బద్రి చిత్రానికి దర్శకునిగా పూరి జగన్నాథ్ పరిచయం అయ్యారు. అయితే తరువాత ఎక్కువ చిత్రాలను రవితేజతో తీసి ఒక సక్సెస్ ఫుల్ హీరోగా రవితేజని నిలబెట్టారు. విభిన్న చిత్రాలను చాల వేగవంతంగా తెరకెక్కించడంలో ఘనాపాటిగా చెబుతారు. పెద్ద హీరో అయినా చిన్న హీరో అయిన ప్రారంబించిన చిత్రం కొద్దికాలంలోనే విడుదలకు సిద్దం అవుతుంది.

పవన్ కళ్యాణ్ తో బద్రి, కెమెరా మెన్ గంగతో రాంబాబు, అల్లు అర్జున్ తో దేశముదురు, ఇద్దరమ్మాయిలు, నాగార్జునతో శివమణి, సూపర్, ఎన్టిఆర్ తో ఆంధ్రావాల, టెంపర్ విజయవంతమైన చిత్రాలు తీసిన పూరి జగన్నాథ్ మహేష్ బాబుతో పోకిరి, బిజినెస్ మేన్, ప్రబాస్ తో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ ఇంకా రవితేజ, గోపీచంద్, నితిన్ తదితరులతో మొత్తంగా నలభై చిత్రాల వరకు దర్శకత్వం వహించారు.

జాగర్లమూడి రాధాకృష్ణ క్రిష్ చిత్ర దర్శకులు – Krish Telugu Film Present Famous Directors

గమ్యం చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకులు జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్). మొదటి చిత్రం అల్లరి నరేష్, శర్వానంద్, కమిలిని ముఖర్జీ లతో ఒక మంచి చిత్రం అందించారు. తరువాత వేదం చిత్రం కధాంశం ప్రధానంగా స్టార్ హీరోని ఒక కధలో భాగంగా నాలుగు కధలను ఒకే తెరపై విజయవంతంగా తెరకేక్కించారు. అలాగే వేదం చిత్రంలో ఒక స్టార్ హీరొయిన్ని వేశ్య పాత్రలో చూపించడం జరిగింది.

దగ్గుబాటి రానాతో కృష్ణంవందే జగద్గురుం అంటూ సందేశాత్మక చిత్రం తీసారు. తరువాత కంచె, గౌతమి పుత్ర శాతకర్ణి బాలకృష్ణతో చారిత్రిక అంశంతో సినిమా తీసారు. దర్శకుడైన పదేళ్ళలో అయిదు ఉత్తమ దర్శకుడు (Best Director) అవార్డ్స్ గెలుచుకోవడం విశేషం. నందమూరి బాలకృష్ణతో నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సినిమాకి పనిచేస్తున్నారు.

శతమానంభవతి కుటుంబ సంభందాలు మనోభావాలను సాంకేతిక విప్లవం ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నాయో ఈ చిత్రం ద్వారా సతీష్ వేగేశ్న దర్శకులు చెప్పడంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారని చెప్పవచ్చు. శర్వానంద్, ప్రకాష్ raj, జయసుధ, నరేష్, ఇంద్రజ మొదలైన వారు నటించిన పాత్రలే ప్రధానంశంగా కుటుంబ బందాలే విలువైనవిగా చిత్రం చక్కగా తెరకెక్కించారు, దర్శకులు.

మా పెళ్ళికి రండి, తొట్టిగాంగ్, కబడ్డీ, కబడ్డి తదితర చిత్రాలకు రైటర్ గా పనిచేసిన తర్వాత అల్లరి దొంగలబండి కామెడీ చిత్రం తీసిన సతీష్ వేగేశ్నకు గుర్తింపు తెచ్చిన చిత్రం శతమానంభవతి. శ్రీనివాస కళ్యాణం చిత్రం నితిన్ – రాశిఖన్నా జంటగా దర్శకత్వం వహిస్తున్నారు.

కొరటాల శివ, శేఖర్ కమ్ముల – Koratala Siva, Sekhar Kammula Telugu Chitra Movie Present Famous Directors

గర్ల్ ఫ్రెండ్ చిత్రానికి సహాయ రచయితగా భద్ర, మున్న, ఒక్కడున్నాడు, సింహ, బృందావనం, ఊసరవెల్లి చిత్రాలకు రచయితగా ఉన్న కొరటాల శివ మిర్చి చిత్రంలో స్టార్ డైరెక్టర్ గా మారారు. ప్రబాస్ అనుష్క శెట్టిలు జంటగా దర్శకుడిగా తీసిన తొలి చిత్రం సూపర్ హిట్ అయింది. పల్నాడులో రెండు గ్రామాల మద్య యుద్ధం కాకుండా ప్రేమతో గొడవలు మాన్పించే యువకుడు పాత్రలో ప్రభాస్ ని చక్కగా చూపించారు. శ్రీమంతుడు చిత్రం మహేష్ జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులతో తీసి, ఒక కోటీశ్వరుడు ఊరిని దత్తత తీసుకుని, ఊరిని బాగుచేయడం, ఊరి సమస్యలను సరి చేసే వ్యక్తిగా చిత్రం చక్కగా చూపించారు.

జనతా గారేజ్ అన్ని రిపైర్లు చేయబడును అంటూ జనం సమస్యలను తీర్చే వ్యక్తి తమ్ముడి కొడుకు ప్రకృతిని పరిరక్షించే వ్యక్తిగా ఎదిగి వచ్చి పెదనాన్న జనతా గారేజ్ బాధ్యతను తీసుకోవడం, ఒక కుటుంబా కదా చిత్రం ఎన్టిఆర్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో సందేశాత్మకంగా తీసారు. తరువాత మహేష్ బాబుతో భారత్ అను నేను అంతఃకరణ శుద్దితో ఒక ముఖ్యమంత్రి పనిచేసే తీరుని చూపించారు. సక్సెస్ రేట్ బాగా ఉన్న దర్శకులలో ఒకరిగా గుర్తింపు పొందారు.

శేఖర్ కమ్ముల డాలర్ ఇంగ్లీష్ చిత్రంతో అవార్డు పొంది ఆనంద్ సినిమాతో అందరికి ఒక కాఫీ లాంటి చిత్రం అందించి, గోదావరిలో ప్రయాణం చేయించిన దర్శకుడు. సహజమైన కధాంశాలు తీసుకుని కొత్తవారితో చిత్రాలు రూపొందించే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆనంద్, గోదావరి హిట్ చిత్రాల తరువాత హ్యాపీ డేస్ కొత్త నటులతో చిత్రం తీసిన ఆవకాయ బిర్యానీని తయారు చేయించారు. తరువాత ఒక ముఖ్యమంత్రి కొడుకు మంచి ముఖ్యమంత్రిగా పడే పాట్లు చాలా సహజంగా తీసారు. లైఫ్ ఇస్ బ్యూటీఫుల్ మూవీ తీసాక, నాగబాబు అబ్బాయి వరుణ్ తేజ్ – సాయి పల్లవితో ఫిదా హిట్ చిత్రం దర్శకత్వం వహించారు.

మరింత మంది దర్శకుల గురించి తరువాయి పోస్టులలో Telugu Chitra Movie Present Famous Directors

ధన్యవాదాలు
తెలుగురీడ్స్