పుస్తకం చదువుట అంటే కాసేపు ఏకాగ్రతతో ఉండడమే

పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం!

పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం! పుస్తకములు చరిత్రను తెలియజేస్తాయి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుస్తాయి. గొప్పవారి భావనలను అక్షరరూపంలో కలిగి ఉంటాయి. పుస్తకపఠనం మనకు ఊహా శక్తిని కలుగజేస్తాయి!

తెలుగురీడ్స్.కామ్ పుస్తకం పేజికు స్వాగతం… పుస్తకం ప్రమాణంగా చాలా విషయాలలో ఉంటుంది. భారతీయకోర్టులలో ప్రమాణం చేయించే భగవద్గీత మనకు పుస్తక రూపంలోనే ఉంది. కానీ అందులో ఉన్న సారంశం, ఒక మనిషి జీవన మార్గాన్ని మార్చేయగల శక్తిని కలిగి ఉంటుంది. అంతటి శక్తి కలిగిన సారం అక్షర రూపంలో ఒక పుస్తకంగా మనకు లభిస్తుంది. పుస్తకం ప్రమాణంగా సమాజంలో చాలా సందర్భాలలో కనబడుతుంది.

బ్రతుకు బండిని లాగించడానికి చేసే ప్రయత్నాలలో చదవు చెప్పేవారికి పుస్తకమే ఆధారం. విద్యార్ధి దశలో బాలబాలికలకు పుస్తకమే ఆధారం. పుస్తకంలో ఉండే 56 తెలుగు అక్షరాలే కానీ, అనేకానేక విషయాలను, విశేషాలను నేర్చుకునే దశలో మనకు నేర్పుతుంది. బుక్ రీడింగ్ గుడ్ హాబిట్ అయితే తెలుగుబుక్ రీడ్ చేయడం వలన మన సాహిత్యం మనకు మరింత చేరువ అవుతుంది.

అక్షరజ్ఙానం కలిగిందంటే, పుస్తకంతో మనకు మంచి సంభందమే ఏర్పడుతుంది. పుస్తకంలో ఉన్న విషయాలు కేవలం జీవనోపాధి కొరకు మాత్రమే అని చదివే వారికి, జీవనోపాధిని తెచ్చే అంతా జ్ఙానం, పుస్తకం ద్వారా నేర్చుకోవచ్చును. తెలుగు పుస్తకములలోని సాహిత్యంలో మనిషికి మేలు చేసే విషయాలు అనేకంగా ఉంటాయి అంటారు. తెలుగు బుక్స్ రీడ్ చేయడంతో తెలుగులో ఉన్న గొప్పతనం మనకు తెలియవస్తుంది అంటారు.

పుస్తకంలో ఉన్న విషయాలు, బౌతికంగా ఉన్న విషయాలతో ముడిపెట్టి పరిశోధనాత్మకంగా ఆలోచనచేసేవారికి, పుస్తకం ద్వారా మంచి పరిశోధనాత్మక జ్ఙానాన్ని సముపార్జించుకోవచ్చును. పుస్తకం ద్వారా ఊహాత్మక శక్తిని పెంచుకోవచ్చును. గత చరిత్రను ఊహించవచ్చును. సాంఘిక రచనలను చదవడం ద్వారా సామాజిక భవిష్యత్తును అంచనా వేసే శక్తిని పుస్తకం ద్వారా పొందే అవకాశం ఉంటుంది. పుస్తకం ద్వారా మనిషి తన గమనాన్ని పరిశీలన చేసుకోవచ్చును. తెలుగు బుక్స్ రీడ్ చేయడం ద్వారా నాలెడ్జ్ పెంచుకోవచ్చును అంటారు.

మంచి పుస్తకం చదివితే, మంచి ఆలోచనలు పెరిగితే, వేరు పుస్తకాలు వేరు వేరు విషయాసక్తిని పెంచుతాయి. పుస్తకం ద్వారా అర్ధంచేసుకునే ఆలోచన శక్తిని పెంచుకోవచ్చును. పుస్తకం ద్వారా మనకు అవగాహన శక్తిని పెంచుకోవచ్చును. ఇంతటి శక్తివంతమైన పుస్తకాలు ఒకనాడు కొనుగోలు చేయడానికి చాలా కష్టాలు పడినట్టుగా చెబుతారు. గతంలో దేశ నాయకులుగా మారిన వారెందరో పుస్తకం కొనుగోలు చేయడానికి లేక చదువుకోవడానికి ఎన్లో కష్టాలు పడినట్టుగా మహాత్ములు జీవిత చరిత్రలు చదివితే అర్ధం అవుతుంది.

కానీ ఇప్పుడు మనకు మంచి మంచి పుస్తకాలు, తెలుగు నీతి కధల పుస్తకాలు, తెలుగు సాంఘిక రచనలు, సాంఘిక, తెలుగు సామాజిక రచనలు, తెలుగులో చారిత్రక శాస్త్రాలు ఉచితంగా ఆన్ లైన్ ద్వారా లభించడం నిజంగా మనకు అదృష్టమే. పురాణ పుస్తకాలు, ఇతిహాస రచనలు, గీతాసారాంశాలు, ప్రవచనాలు, కవిత్వాలు ఇలా వేలకొలది పుస్తకాలు మనకు నెట్లో తెలుగులో రీడ్ చేయడానికి అనువుగా ఉచితంగా పొందవచ్చును.

జీవనం ఎటువైపు వెళ్తుందో అన్న ఆందోళన కలిగినప్పుడు ఆదుకునేది మంచి స్నేహితుడు లేక మంచి పుస్తకమే అంటారు. మంచి స్నేహంతో బాటు, మంచి పుస్తకాల పఠనం ఒక అలవాటుగా ఉంటే, చాలా గొప్ప విషయంగా పెద్దలు చెబుతారు. రీడింగ్ గుడ్ హాబిట్ అయితే తెలుగుబుక్స్ రీడ్ చేయడం మరింత మంచివిషయంగా చెబుతారు.

అయితే ఆన్ లైన్ ద్వారా లభిస్తున్న అనేక పుస్తకాలలో కొన్ని పుస్తకాలు గురించి అతి క్లుప్తంగా తెలియజేస్తూ వాటి యొక్క లింకులను ఆన్ లైన్లో అందుబాటులో ఉంచితే, అది అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఈ తెలుగురీడ్స్.కామ్ లో పుస్తకం పేజి జతచేయడం జరిగింది.

తెలుగులో రీడ్ చేయడానికి అనుకూలంగా గతంలో తెలుగు రచయితచే వ్రాయబడిన తెలుగు బుక్స్ అనేకంగా ఉంటాయి. తెలుగులో భాషలో ఉండే బుక్స్ రీడ్ చేయడం వలన తెలుగు భాషపై పట్టు కూడా వస్తుంది. ఇప్పటి రోజులలో కొంతమంది పిల్లలకు తెలుగులో కొన్ని కష్టమైన పదాలు కూడా అప్పటి పాతవారికి చాలా తేలికైన పదాలుగా ఉంటాయి అంటే చూడండి. తెలుగుపై ఇప్పటి పిల్లలకు ఎంత పట్టు ఉందో అంచనా వేయవచ్చును.

అందరికీ ఆంగ్లం అవసరం కానీ మన సాహిత్యం, మన సంస్కృతి ఇవన్ని తెలుగు భాషా పండితులు రచించిన రచనలలో ఉపయుక్తమైన, సమాజానికి మేలైన విషయాలు పొందుపరిచి ఉంటాయాని అంటారు. కాబట్టి తెలుగులో రీడ్ చేయడానికి తెలుగు సాహిత్యం రీడ్ చేయడం, తెలుగు పౌరాణిక పుస్తకాలను రీడ్ చేయడం ప్రారంభిస్తే, అది ఒక మంచి అలవాటుగా ఉంటుంది.

ప్రాచీన తెలుగు సాహిత్యంలో ఎక్కువగా సమాజ హితమును కోరుతూ, మనసుకు శాంతిని చేకూర్చే రచనలు ఎన్నో ఉంటాయి అంటారు. ఏదైనా మనసుకు అంతిమ లక్ష్యం శాంతి అయితే, అటువంటి శాంతి తెలుగు పౌరాణిక, భక్తి పుస్తకములు రీడ్ చేయడం ద్వారా వస్తుంది అంటారు.

వికాసం గురించిన తెలుగరీడ్స్ పోస్టుని రీడ్ చేయడానికి ఇక్కడ ఈ అక్షరాలను తాకండి లేక ఈ అక్షరాలను మౌస్ తో నొక్కండి.

బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్ పోస్టుని రీడ్ చేయడానికి ఇక్కడ ఈ అక్షరాలను తాకండి లేక ఈ అక్షరాలను మౌస్ తో నొక్కండి.

విజ్ఙానం బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్ పోస్టుని రీడ్ చేయడానికి ఇక్కడ ఈ అక్షరాలను తాకండి లేక ఈ అక్షరాలను మౌస్ తో నొక్కండి.

చారిత్రాత్మక బుక్స్ తెలుగురీడ్స్ బుక్ రీడింగ్ గుడ్ హ్యాబిట్ పోస్టుని రీడ్ చేయడానికి ఇక్కడ ఈ అక్షరాలను తాకండి లేక ఈ అక్షరాలను మౌస్ తో నొక్కండి.

ధన్యవాదాలు – తెలుగురీడ్స్

Enable Notifications    Ok No thanks