ఒకడే ఒక్కడు మొనగాడు హిట్ మ్యాన్

ఒకడే ఒక్కడు మొనగాడు
ముంబై మెచ్చిన ఆటగాడు
ఓటమికి తలొంచడు ఏనాడు…. ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెనుగా రోహిత్ శర్మ విషయంలో ఈ పాట బాగా సరిపోతుంది. ఏకంగా 2013 సం.లో, 2015 సం.లో, 2017 సం.లో ఐపిఎల్ క్రికెట్ కప్పులు అందుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ వరుసగా 2019, 2020 సంవత్సరాలలో కూడా ఐపిఎల్ క్రికెట్ కప్పులను అందుకున్నాడు. కెప్టెన్ గా ఇంతటి ఘన విజయాలు అందుకున్న మరో ఐపిఎల్ కెప్టెన్ లేరు.

ఐపిఎల్ ప్రారంభంలో డెక్కన్ చార్జర్స్ తరపున ఆకట్టుకుఏ ప్రదర్శన కనబరిచిన, రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ ఆటగాడిగా తీసుకుంది. సచిన్ తర్వాత కెప్టెన్ ను చేసింది. రోహత్ శర్మ హిట్ మ్యాన్ గా మారాడు. ముంబై ఇండియన్స్ ఐపిఎల్ విజేతగా అవతరిస్తూ రావడం మొదలు పెట్టింది.

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, సమర్ధులైన ఆటగాళ్ళకు నాయకత్వం వహిస్తూ, ఆటగాడిగా రాణిస్తూ, ఐపిఎల్ ముంబై ఇండియన్స్ జట్టును తిరుగులేని స్థానంలో నిలబెట్టాడు. కెప్టెన్ గా 116 మ్యాచుల ఆడిన రోహత్ శర్మ, విజయాలు 70, ఓటములు 46 అయితే అందుకున్న కప్పులు 6…

ఐపిఎల్ ఆటగాడిగా 200 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ 5230 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ముఫ్పై తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరుసార్లు చాంపియన్ జట్టులో సభ్యుడి ఉన్న ఘనత హిట్ మ్యాన్ రోహిత్ శర్మకే దక్కింది. మరే ఐపిల్ క్రికెటరుకు ఈ ఘనత లేదు.

కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతం…

రోహిత్ సారధ్యంలో అయిదు సార్లు కప్ సాధించిన జట్టు, పాయింట్ల పట్టికలో ఎక్కువగా అగ్ర స్థానంలోనే ఉంది. 2013 ఐపిఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ టీమ్ పాయింట్ల పట్టికలో రెండవస్థానంలో ఉంది.

2015 సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు కూడా రెండవ స్థానంలో ఉంది. ఆ తర్వాత 2017, 2019 మరియు 2020 ఐపిఎల్ సీజన్లలో ముంబై జట్టు అగ్రస్థానంలోనే ఉండి, ఐపిఎల్ కప్ అందుకుంది. అంటే ముంబై జట్టు ఫెరాపెర్మెన్స్ ఏస్థాయిలో ఉందో తెలుస్తుంది.

ఐపిఎల్ కప్పు ముంబై అందుకున్న సంవత్సరములలో రోహిత్ శర్మ చేసిన పరుగులు…

2013 సంలో 538 పరుగులు, 2015 సంలో 482 పరుగులు, 2017 సంలో 333 పరుగులు, 2019 సంలో 405 పరుగులు, 2020 ఈ సంలో 332 పరుగులు సాధించాడు. మూడు సార్లు నాటౌట్ గా నిలిచాడు.

ఐపిఎల్ మొత్తంగా ఒక ఆటగాడిగా రోహిత్ శర్మ స్ట్రైక్ రేట్ 130.61 గా ఉంది. 458 ఫోర్స్, 213 సిక్సర్స్ ఐపిఎల్ సీజన్లలో రోహిత్ శర్మ సాధించాడు. వ్యక్తిగతంగా హైస్కోర్ 109 నాటౌట్ గా ఉంటే, కెప్టెన్ గా రోహిత్ అత్యదిక స్కోర్ 98 నాటౌట్ గా ఉన్నాడు.

ఒకడే ఒక్కడు మొనగాడు హిట్ మ్యాన్
ఒకడే ఒక్కడు మొనగాడు హిట్ మ్యాన్

ఆటగాడిగా పరుగులు సాధిస్తూ, నాయకుడిగా ముంబై జట్టును, తన సహచరుల సహాయంతో, ఇతర ఐపిఎల్ జట్లకు అందనంత ఎత్తులో నిలిపాడు… హిట్ మ్యాన్ రోహిత్ శర్మ…

ధన్యవాదాలు… తెలుగురీడ్స్