పుట్టిన సమయములో ఏ నక్షత్రము మరియు ఆ నక్షత్రములో పాదము ప్రధానంగా చూస్తారు. నక్షత్రము యొక్క పాదమును బట్టి మొదటి అక్షరమును పేరుకు సూచిస్తారు.
మనకు నక్షత్రము చాలా ప్రధానమైనది. ఒక్కొక్కరి ప్రవర్తనను బట్టి ”వీరు ఏ నక్షత్రంలో పుట్టారు, ఇంత మొండితనం అంటారు” అంటే మనిషి గుణములు పుట్టిన నక్షత్రము మరియు లగ్నం బట్టి ముందుగానే ఎంచే అవకాశం జ్యోతిష్య శాస్త్రములో ఉంటుందనే భావన బలపడుతుంది.
నక్షత్రము యొక్క పాదమును బట్టి రాశి, రాశిలో గ్రహసంచారం, గ్రహభావములు, గ్రహ దోషములు మొదలైన విషయాలలో పండితులు జాతకమును తెలియజేస్తూ ఉంటారు. దేనికైనా పుట్టిన సమయంలో నక్షత్రము మరియు పాదము చాలా ముఖ్యమైతే, ఇంకా లగ్నము మరియు ఇతర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు.
27 నక్షత్రములు, ఆయా నక్షత్రములకు అధిదేవతలు, ఆయా నక్షత్రముల యొక్క గణము, జాతి, నక్షత్రముననుసరించి చెప్పబడే జంతువు, పక్షి, వృక్షము, రత్నం, నాడి మరియు రాశి పట్టిక ఈ క్రిందగా గమనించగలరు.
నక్షత్రం | నక్షత్రాధిపతి | అధిదేవత | గణము | జాతి | జంతువు | పక్షి | వృక్షము | రత్నం | నాడి | రాశి |
అశ్విని | కేతువు | అశ్వినీదేవతలు | దేవగణము | పురుష | గుర్రము | గరుడము | అడ్డసరం,విషముష్టి,జీడిమామిడి | వైడూర్యం | ఆదినాడి | 4మేషము |
భరణి | శుక్రుడు | యముడు | మానవగణము | స్త్రీ | ఏనుగు | పింగళ | దేవదారు,ఉసిరిక | వజ్రము | మధ్యనాడి | 4మేషరాశి |
కృత్తిక | సూర్యుడు | సూర్యుడు | రాక్షసగణము | పురుష | మేక | కాకము | బెదంబర,అత్తి | కెంపు | అంత్యనాడి | 1మేషము-2-4వృషభం |
రోహిణి | చంద్రుడు | బ్రహ్మ | మానవగణము | పురుష | సర్పం | కుకుటము | జంబు, (నేరేడు ) | ముత్యం | అంత్యనాడి | 4వృషభం |
మృగశిర | కుజుడు | దేవగణం | ఉభయ | సర్పం | మయూరము | చండ్ర,మారేడు | పగడం | మధ్యనాడి | 2వృషభం2మిధునం | |
ఆరుద్ర | రాహువు | రుద్రుడు | మానవగణం | పురుష | శునకం | గరుడము | రేల,చింత | గోమేధికం | ఆదినాడి | 4మిధునం |
పునర్వసు | గురువు | అధితి | దేవగణం | పురుష | మార్జాలం (పిల్లి) | పింగళ | వెదురు,గన్నేరు | కనక పుష్యరాగం | ఆదినాడి | 1-3మిధునం4కర్కాటకం |
పుష్యమి | శనిగ్రహం | బృహస్పతి | దేవగణం | పురుష | మేక | కాకము | పిప్పిలి | నీలం | మధ్యనాడి | 4కర్కాటకం |
ఆశ్లేష | బుధుడు జ్యోతిషం | సర్పము | రాక్షసగణం | స్త్రీ | మార్జాలం | కుకుటము | నాగకేసరి,సంపంగి,చంపక | పచ్చ | అంత్యనాడి | 4కర్కాటకం |
మఖ | కేతువు | పితృదేవతలు | రాక్షసగణం | పురుష | మూషికం | మయూరము | మర్రి | వైడూర్యం | అంత్యనాడి | 4సింహరాశి |
పూర్వఫల్గుణి | శుక్రుడు | భర్గుడు | మానవసగణం | స్త్రీ | మూషికం | గరుడము | మోదుగ | వజ్రం | మధ్యనాడి | 4సింహం |
ఉత్తర | సూర్యుడు | ఆర్యముడు | మానవగణము | స్త్రీ | గోవు | పింగళ | జువ్వి | కెంపు | ఆదినాడి | 1సింహం3-4కన్య |
హస్త | చంద్రుడు | సూర్యుడు | దేవగణం | పురుష | మహిషము | కాకము | కుంకుడు,జాజి | ముత్యం | ఆదినాడి | 4కన్య |
చిత్త | కుజుడు | త్వష్ట్ర | రాక్షసగణం | వ్యాఘ్రం (పులి) | కుకుటము | తాటిచెట్టు,మారేడు | పగడం | మధ్యనాడి | 2కన్య2తుల | |
స్వాతి | రాహువు | వాయు దేవుడు | దేవగణం | మహిషి | మయూరము | మద్ది | గోమేధికం | అంత్యనాడి | 4తుల | |
విశాఖ | గురువు | ఇంద్రుడు,అగ్ని | రాక్షసగణం | స్త్రీ | వ్యాఘ్రము (పులి) | గరుడము | నాగకేసరి,వెలగ,మొగలి | కనక పుష్యరాగం | అంత్యనాడి | 1-3తుల4వృశ్చికం |
అనూరాధ | శని | సూర్యుడు | దేవగణం | పురుష | జింక | పింగళ | పొగడ | నీలం | మధ్యనాడి | 4వృశ్చికం |
జ్యేష్ట | బుధుడు | ఇంద్రుడు | రాక్షసగణం | … | లేడి | కాకము | విష్టి | పచ్చ | ఆదినాడి | 4వృశ్చికం |
మూల | కేతువు | నిరుతి | రాక్షసగణం | ఉభయ | శునకం | కుకుటము | వేగిస | వైడూర్యం | ఆదినాడి | 4ధనస్సు |
పూర్వాఆషాఢ | శుక్రుడు | గంగ | మానవగణం | స్త్రీ | వానరం | మయూరము | నిమ్మ,అశోక | వజ్రం | మధ్యనాడి | 4ధనస్సు |
ఉత్తరాషాఢ | సూర్యుడు | విశ్వేదేవతలు | మానవగణం | స్త్రీ | ముంగిస | గరుడము | పనస | కెంపు | అంత్యనాడి | 1ధనస్సు2-4మకరం |
శ్రవణము | చంద్రుడు | మహావిష్ణువు | దేవగణం | పురుష | వానరం | పింగళ | జిల్లేడు | ముత్యం | అంత్యనాడి | 4మకరం |
ధనిష్ట | కుజుడు | అష్టవసుడు | రాక్షసగణం | స్త్రీ | సింహము | కాకము | జమ్మి | పగడం | మధ్యనాడి | 2మకరం2కుంభం |
శతభిష | రాహువు జ్యోతిషం | వరుణుడు | రాక్షసగణం | ఉభయ | అశ్వం (గుర్రం)Kకుకుటము | అరటి,కడిమి | గోమేధికం | ఆదినాడి | 4కుంభం | |
పూర్వాభద్ర | గురువు | అజైకపాదుడు | మానవగణం | పురుష | సింహం | మయూరము | మామిడి | కనక పుష్యరాగం | ఆదినాడి | 3కుంభం1మీనం |
ఉత్తరాభద్ర | శని | అహిర్పద్యువుడు | మానవగణం | పురుష | గోవు | మయూరము | వేప | నీలం | మధ్యనాడి | 4మీనం |
రేవతి | బుధుడు | పూషణుడు | దేవగణం | స్త్రీ | ఏనుగు | మయూరము | విప్ప | పచ్చ | అంత్యనాడి | 4మీనం |