సహచరుల సంఘీభావం పొందిన వ్యక్తి, సాధనలో ముందుంటాడు. లక్ష్యం చేధించడంలో ముందుకు సాగుతాడు. అటువంటి సంఘీభావమునకు తోడు, మనోబలం కూడా తోడైతే, ఇక ఆవ్యక్తి ప్రణాళికకు పరాజయం ఉండదు. అటువంటి భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలం.
సత్సంకల్పం చేయడం ప్రధానంగా మన భారతీయుల చరిత్రలో చదివి ఉంటాం. ధృఢ సంకల్పం మన భారతీయ పురాణ, చారిత్రక పుస్తకాలలో చదివి ఉంటాం. ఏదైనా సాధనకు మంచి పునాది పడితే, సాధకుడు మంచి ఫలితాలను సాధించడం జరుగుతుంది.
చరిత్ర ఘనమే, ప్రస్తుతం కష్టకాలం ఇప్పటి మన స్థితి. ఇంతకు పూర్వం వరకు మన చరిత్ర గురించి గొప్పగా చదువుకున్న వ్యక్తులుగానో, చదువుకుంటున్న విద్యార్ధులుగానో ఉండి ఉంటాం. కానీ ఈ కరోనా కాలం స్థితి రూపును పూర్తిగా మార్చింది.
మారిన స్థితి, పరిస్థితులను మంచి భవిష్యత్తుకు పునాదిగా మారుస్తుంది. ఈ మారుతున్న స్థితిలో అవకాశం పట్టుకుని, భవిష్యత్తును సాధించడమే లక్ష్యం అయితే, ఆ లక్ష్యం మరింతమందికి భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, గడుస్తున్న కష్టకాలం గమనిస్తే, అవకాశం అందివస్తుంది. ఇదే విధానం క్రిందినుండి పైస్థాయికి ఎదిగిన వ్యాపారులలో కనబడుతుంది.
అవకాశం అందరికీ పేపరుపై, లేకా స్మార్ట్ ఫోన్ స్క్రీనుపై కనబడదు. అవకాశం ఆలోచనలో ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితులను, కాలగతిని గమనించే ఆలోచనలో అవకాశం దాగి ఉంటుంది. పాఠ్యపుస్తకంలో ప్రశ్నకు సమాధానం ఉన్నట్టుగా….
ఆలోచన ఉండే మనసులో కొంత గందరగోళం ఉండవచ్చును. నీటిచెరువులో రాయి పడి చెదిరిన తరంగాలు, మరలా కుదురుకున్నట్టుగా… ఆలోచనలతో సతమతమయ్యే మనసు కూడా కుదురుకుంటే, ప్రశాంతతో ఉంటుంది. ప్రశాంత చిత్తంలో సరైన ఆలోచన ఉంటుంది. ఉపాయం వస్తుంది.
భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలము
భారతీయుడి మనోబలానికి సత్సంకల్పమే మరింత బలము తోడవుతుంది. మంచి సంకల్పము వలన, మంచి వ్యక్తితో బాటు, వ్యక్తి ఉన్న సమాజానికి మేలు చేస్తుంది.
సాధారణ పరిస్థితులలో మార్పు చాలా నిదానంగా ఉంటే, కష్టకాలంలో మార్పు చాలా బలంగా ఉంటుంది. ఈ కరోన కష్టకాలంలో ఆరోగ్యమును కాపాడుకోవడం చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే అంటురోగం మనకు రాకుండా ఉంటే, మనతోబాటు ఉన్నవారికి కూడా రానట్టే… ప్రభుత్వాలు లాక్ డౌన్ ద్వారా కరోనా కట్టడికి ప్రయత్నించినా కేసులు పెరిగాయి.
కరోనా కాలంలో కావాల్సింది సంయమనమే పాఠించడమే. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్త వ్యవహరించడం ప్రధానం. స్వీయ నియంత్రణ కలిగి సామాజిక దూరం పాటించడం చాలా ప్రధానం. కరోన మనకు సోకకుండా ఉంటే, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం రక్షించినట్టే.
వ్యవస్థలకు కొన్ని రోజులపాటు బ్రేక్ వేసిన కరోనా, మరలా వ్యవస్థలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే సమయానికి అవి మార్పులకు గురి అవుతాయి. కాలం తెచ్చే మార్పులో ఒకరికి అవకాశం ఉంటే, మరొకరికి అవరోధంగా ఉంటుంది.
జీవించవలసిన సమాజం బాగుంటేనే, నేటి బాలల రేపటి భవిష్యత్తు
మన ఆరోగ్యం కాపాడుకుంటూ మన జీవన పోరాటం చేయడం ఇప్పుడు మనందరి ముందున్న మంచి సంకల్పం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఇప్పుడు మన ఆరోగ్యమే మన సామాజిక శ్రేయస్సు… వారసులకు ఆస్తిగా మన సంపాధన ఉంటుంది. కానీ సంపద ఉన్నా జీవించవలసిన సమాజం బాగుంటేనే, నేటి బాలల రేపటి భవిష్యత్తు బాగుంటుంది.
మనం జీవిస్తున్న సమాజంలోనో లేక మన బంధుమిత్రులు జీవిస్తున్న సమాజంలోనో మన వారసులు వారి స్వంత జీవనం మొదలు పెడతారు. అటువంటి రేపటి పౌరులకు ఆరోగ్యకరమైన సమాజం ఇవ్వడంలో మనవంతు పాత్రత మనం పోషించి ఉండాలి.
కరోనా బారినపడకుండా మన వంతు ప్రయత్నం మన చేయడమే… నేటి మన సత్సంకల్పం.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
నాయకత్వం నాయకత్వ లక్షణాలు తెలుగు వ్యాసం
తెలుగు భాష గొప్పతనం గురించి వ్యాసం
రామాయణం ప్రాశస్త్యాన్ని వివరిస్తూ తెలుగు వ్యాసం
మాట తీరు ప్రాముఖ్యత గురించి తెలుగులో వ్యాసం
రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం
గ్రంధాలయాలు గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి.
నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం
మన పరిసరాల పరిశుభ్రత మన ఆరోగ్య రక్షణ
ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకం నేస్తంగా ఉంటుంది
పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం
గొప్పవాళ్ళే లోకహితమైన కార్యాలు ఎందుకు చేస్తారో
అందమైన పల్లెటూరు గురించి తెలుగులో వ్యాసం
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు
సంకల్పం బలమైనది అయితే మనల్ని ఎవరూ ఆపలేరు!
డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో
మాతృభాషలో విద్య మీరు సమర్థిస్తారా?
కుటుంబ వ్యవస్థ బాగా కొనసాగాలంటే మనమేం చేయాలి
వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం
వార్తా పత్రికలు గురించి తెలుగులో వ్యాసం
నేటి రాజకీయాల పై మీ అభిప్రాయం మీ మాటల్లో వివరించండి
చెప్పుడు మాటలు చేటుకు కారణం తెలుగులో వ్యాసం
వ్యవస్థ అంటే ఏమిటి వ్యవస్థల ప్రభావం తెలుగు వ్యాసం
నీటి పొదుపు ఆవశ్యకతను తెలియజేస్తూ వ్యాసం రాయండి
నగర జీవితం పట్ల ప్రజలు ఆకర్శితులు కావడానికి కారణాలు
పదవులు సంపదలు శరీరాలు శాశ్వతం కాదు తెలుగువ్యాసం
వాక్కు మనిషికి నిజమైన అలంకారమని ఎలా చెప్పగలవు
ఆత్మ విశ్వాసం గురించి వ్రాయండి
అవినీతి నిర్మూలనతో సమాజం ప్రగతిపధం తెలుగులో వ్యాసం
దీర్ఘ వైర వృత్తి మంచిది కాదు అర్థం
దీర్ఘకాల విరోధము మంచిది కాదు తెలుగు వ్యాసం
పోరు నష్టం పొందు లాభం తెలుగులో వ్యాసం
శతక పద్యాలలోని నీతులు నిత్యజీవితంలో ఎట్లా
రామాయణం ఎందుకు చదవాలి వ్యాసంలో వివరించండి.
గుణపాఠం గురించి తెలుగులో వ్యాసం వ్రాయండి
రేడియో గురించి తెలుగులో వ్యాసం రాయండి
పావురం గురించి తెలుగులో వ్యాసం
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
విద్యార్థులు క్రమశిక్షణ తెలుగులో వ్యాసం వ్రాయండి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
దూరదర్శిని టివి గురించి తెలుగులో వ్యాసం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు
నగర జీవనం అనుకూల అంశాలు ఆర్ధిక ప్రయోజనలు
మీకు తెలిసిన మంచి గుణాలు కలిగిన ఒకరిని గురించి అభినందన వ్యాసం
పండుగలు ప్రాముఖ్యత గురించి వ్యాసం అవి ఎలాంటి ప్రభావం చూపుతాయి
ప్రముఖ ప్రసిద్ధ దేవాలయాలు విశిష్టమైనవి, దేవాలయాల గురించి తెలుగులో