By | October 12, 2021

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంతో అంటే చాలా సులభం అంటారు. వ్యాసం రాయడం ద్వారా ఒక విషయం గురించి సవివరంగా తెలియజేయవచ్చు. ఒక వస్తువు వాడుక విధానం వ్యాస రూపంలో అందించవచ్చు. ఒక సేవ యొక్క లక్ష్యం వ్యాసం ద్వారా తెలియజేయవచ్చు. ఇలా వ్యాసం రాయడం ద్వారా కూడా డబ్బు సంపాదన చేయవచ్చు. ఇంకా ఇతర భాషలలో కూడా వ్యాసం (ఆర్టికల్) వ్రాయగలిగితే మరింత ఆదాయం గడించవచ్చు.

నేటి రోజులలో అనేక విషయాల గురించి ప్రచారం అవసరం అవుతుంది. ఒక కొత్త వస్తువు వస్తే, దాని వాడుక విధానం తెలిపే వ్యాసాలు అవసరం అవుతాయి.

ఒక కొత్త సినిమా విడుదల అయితే ఆ సినిమా గురించి విశ్లేషణను కూడా ఒక వ్యాసం ద్వారా వివరించవచ్చు.

రాజకీయ నాయకుడి గుణగణాలు, వారి సేవానిరతి గురించి ప్రజలకు తెలియడానికి కూడా వ్యాసం ఉపయోగపడుతుంది.

సేవా సంస్థల గురించి, వాటి కార్యకలాపాల గురించి విపులంగా తెలియజేయడానికి వ్యాసం అవసరం అవుతుంది.

సామజిక సమస్యల గురించి వ్యాసాల ద్వారా ప్రజలలో ప్రచారం కల్పించవచ్చు. ప్రజలలో సామజిక స్పృహ పెరిగేలా వ్యాసాల ద్వారా ప్రజలలో అవగాహనా తీసుకురావచ్చు…

సామజిక అసమానతలు ఉంటె, వాటిపై విశ్లేషణలతో వ్యాసం ద్వారా వివరించవచ్చు.. ఇలా వ్యాసాలు వివిధ అంశాలలో వివిధ రంగాలలో వివిధ విషయాల గురించి విశ్లేషిస్తూ అర్ధవంతంగా తెలియజేయడానికి ఉపయోగపడతాయి…

అలా అర్ధవంతమైన వ్యాస రచన చేయగలిగినవారికి ఆర్ధిక సంపాదన కూడా ఉంటుంది.

ఎలా వ్యాసాలు ద్వారా డబ్బు సంపాదన

ప్రసిద్ది చెందిన వార్త పత్రికలకు కధనాలు వ్రాస్తూ సంపాదించవచ్చు.

టీవీ చానల్స్ లో కధనాలు వ్రాయవచ్చు.

ఏదైనా ప్రసిద్ది చెందిన వెబ్ సైట్ కు వ్యాసాలు రాస్తూ డబ్బు సంపాదించవచ్చు.

లేదా మీకు మీరే ఒక బ్లాగు సృష్టించుకుని అందులో వ్యాసాలు వ్రాస్తూ ఉండవచ్చు…

ఇలా వ్యాసం రాయడం బాగా వస్తే, మంచి మంచి వ్యాసాలు వ్రాస్తూ కీర్తి గడించవచ్చు.

అయితే ఇలాంటి వ్యాసాలు వ్రాసేటప్పుడు వాస్తవికతకు దూరంగా కల్పన ఉండకూడదు.

వాస్తవికతను ప్రస్తావిస్తూ ఊహాత్మక విశ్లేషణ వ్యాసంలో అవసరం అంటారు.

పుస్తకాలూ చదివే సమయంలోనే మనసుకు ఊహాశక్తి అలవరుతుంది. ఊహాశక్తికి అక్షరరూపం ఇస్తూ అది అర్ధవంతంగా చెప్పగలిగితే అది వ్యాసం అవుతుందని అంటారు. అయితే అది విపులంగా విశ్లేషణతో ఉండాలి.

ఇంకా కల్పిత కదల బ్లాగు సృష్టించుకుని చక్కటి కధలు ఆకట్టుకునే విధంగా వ్రాయగలిగితే, అటువంటి బ్లాగు కూడా సంపదను తీసుకువచ్చే అవకాశం ఉంటుంది.

అనుకరణ వ్యాసం కన్నా అలోచించి విషయాన్నీ సరిగ్గా విశ్లేషించగలగాలి.

డబ్బు సంపాదన మార్గాలు వ్యాసం రాయడంలో అర్ధవంతమైన విశ్లేషణ ఆలోచింపజేస్తే, అది ఎక్కువమందికి చేరితే, అటువంటి బ్లాగు విజయవంతంగా కాగలదు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు