పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం వ్రాయమంటే, ఆర్ధికపరమైన పొదుపు గురించి, నీటి పొదుపు గురించి, విద్యుత్ వాడుకలో పొదుపు గురించి, మోటారు వాహన వాడుకలో పొదుపు గురించి ఇలా వివిధ అంశములలో పొదుపు గురించి తెలుసుకోవడం వలన ఆర్ధిక ప్రయోజనాలు మరియు సామాజిక ప్రయోజనలు ఉంటాయని అంటారు.
ముందుగా పొదుపు అంటే ఏమిటి అంటే, తగు పాళ్ళల్లో వాడుక. తగినంతగా ఉపయోగించుట. తగు సమయంలో ముగించుట… అంటే డబ్బు విషయానికొస్తే, ధనం విరవిగా ఖర్చు చేయకుండా ఎంత అవసరమో అంతే ధనం ఖర్యు చేయుట. అలాగే ఏదైనా వస్తువు వాడుకలో కూడా ఎంతసేపు వస్తువును ఎలా వాడాలో అలా సరైన పద్దతిలో వాడుట. అలాగే విద్యుత్ వినియోగంలో కూడా వృధాగా విద్యుత్ వాడకుండా తగినంత సమయం మాత్రమే విద్యుత్తును వినియోగించడం పొదుపు అంటారు.
ఎంత పొదుపుగా ఉంటే ఆ కుటుంబం ఆంత వృద్దిలోకి వస్తుందని పెద్దలు అంటారు. ఒక వస్తువు వాడకులోగాని, నీటిని వాడడంలో గాని, అగ్నిని ఉపయోగించడంలో గాని, ధనమును ఖర్చు చేయడంలో గాని ఇష్టానుసారం కాకుండా అవసరం మేరకు మాత్రమే ఖర్చు చేయడమే పొదుపు అవుతుందని అంటారు.
అదే పనిగా పట్ట పగలు కూడా విద్యుద్దీపాలు వెలిగించడం విరివిగా విద్యుత్ వాడడమే అవుతుంది. అలా కాకుండా చీకటిలో మాత్రమే వెలుగు అవసరం అయినప్పుడు మాత్రమే విద్యుద్దీపాలు వాడుట పొదుపు అవుతుంది.
అతి అన్నింటిలోనూ అనర్ధమే అంటే, పనిలో పొదుపు ప్రధానమంటారు.
పని చేసేటప్పుడే కాలం ఖర్చు చేయడంతో బాటు వస్తువును వాడటం గాని ప్రకృతి వనరులను ఉపయోగించడంగానీ చేస్తూ ఉంటాము. కాబట్టి పనిలో పొదుపుపై అవగాహన ఉంటే ఖర్చు అయ్యే కాలం కూడా కలసి వస్తుంది.
పనిచేసేటప్పుడు పొదుపుగా పని చేయడం అది ఒక రకంగా సామాజిక బాధ్యత కూడా అవుతుంది. విద్యుత్ వినియోగం పొదుపుగా చేస్తే, మరికొంతసేపు విద్యుత్ సరఫరా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే నీటిని పొదుపుగా వాడడం వలనే నీరు మరింతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకరు పొదుపుగా ఉండడం వలన మరొకరికి లాభం కలుగుతుంటే, మరి పొదుపుగా పనిచేయడం సామాజికి సేవ కూడా అవుతుంది కదా…?
కుటుంబంలోని పెద్ద ఆర్ధిక అవసరాలలో పొదుపు పాటిస్తే, మిగులు ధనం కుటుంబ సభ్యులకు ఉపయోగపడుతుంది. అలాగే సమాజంలో వ్యక్తులు పొదుపు పాటిస్తూ ఉంటే, ఆ పొదుపు వలన మరొక వ్యక్తికి నష్టం జరగకుండా ఉండవచ్చును.
తాము పొదుపు చేసిన సొమ్మును ఎక్కువమంది బ్యాంకులలో భద్రపరచుకోవడం వలన, సదరు బ్యాంకుద్వారా రుణాలు మంజూరు ఎక్కువగా జరిగి వ్యాపారస్తుల వ్యాపార అవసరాలు తీరవచ్చును. వ్యాపారం ద్వారా సేవలను అందుబాటులోకి రావచ్చును. సేవలు సౌకర్యాలు ఎక్కువగా అందుబాటులోకి రావడం వలన కొందరికి ఉపాధి పెరగవచ్చును…. ఇలా పొదుపు అనేది ఒకరి నుండి మరొకరికి లాభమే అవుతుంది. అయితే తాను తినకుండా, తనని నమ్మినవారిని పోషించకుండా పొదుపు చేస్తే అది మొదటికే మోసం అవుతుంది.
కాబట్టి పొదుపు అంటే అవసరాల మేరకు తగినంతమేరకు చూసి ఖర్చు చేయడమే అవుతుంది కానీ అసలు ఖర్చు చేయకుండా ఉండుట పొదుపు అనరు…. పిసినారితనం అంటారు.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “పొదుపు ప్రయోజనాలు తెలుగులో వ్యాసం”