రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. మనదేశంలో వ్యవసాయం ఆధారంగా అనేక పంటలు రైతే పండిస్తాడు. దేశ ప్రజల తినే ఆహారం అంతా, దేశంలో రైతులు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది.
మనిషి బ్రతకడానికి శక్తి కావాలి. శక్తి ఆహార పదార్ధాలు ఆరగించడం ద్వారా లభిస్తుంది. శక్తి వలననే మనిషి పని కొనసాగించగలడు. అందుకు అవసరమైన ఆహారం దేశంలో రైతు పండించే పంటలపై ఆధారపడి ఉంటుంది.
వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి కీలకమైన అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి చాల ప్రధాన పాత్ర పోషిస్తుంది.
రైతు గొప్పతనం గురించి ఇన్ తెలుగు
తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంలో ప్రపంచములోని శ్రామికులలో 42% మంది వ్యవసాయ రంగములో పనిచేస్తున్నారు.
పంటలు పండించేవారిని మాత్రమే కాకుండా, మామిడి, కొబ్బరి, ద్రాక్ష వంటి తోటల పెంపకం, పాడి పశువుల పెంపకం, కోళ్ళ పెంపకం, చేపలు, రొయ్యల పెంపకం తదితర పనులు చేపట్టిన వారిని కూడా రైతులు అనే అంటారు.
మనదేశంలో రైతు మూడు విధాలుగా పంటలు పండిస్తాడు. ఖరిప్, రబీ, జైద్ కాలాలుగా విభజించి, ఆయా కాలాల్లో తగు పంటలు రైతు పండిస్తాడు.
భూమిని నమ్ముకుని రైతు జీవనం సాగిస్తాడు. భూమిని సాగు చేస్తూ ఆహార పదార్ధాలుగా మారే ముడి పంటలను రైతే పండిస్తాడు. ఎక్కువమందికి భూమి సొంతంగానే ఉంటుంది. కొందరు ఇతరుల భూమిని బాడుగకు తీసుకుని సాగు చేస్తూ ఉంటారు.
ఎక్కువ భూమి ఉన్న రైతు కూలీల ద్వారా వ్యవసాయపు పనులు చేయిస్తూ ఉంటాడు. రైతు కాయకష్టం పైన మనదేశంలో ఆహార పదార్ధాలు ఉత్పత్తి జరుగుతూ ఉంటాయి. ఇంకా రైతు కూలీల శ్రమ వ్యవసాయం అభివృద్దికి తోడ్పడుతుంది.
జీవించే రైతే దేశానికి వెన్నుముక
భారత దేశ౦ వ్యవసాయక దేశం .ప్రప౦చ౦లో అత్యధిక జనాభా గల దేశాలలో రె౦డవదిగా ఉంది. ఇంకా ఇందులో ఎక్కువ శాతం ప్రజలు గ్రామీణ వాసులు ఉంటారు. వ్యవసాయ పనులలో పురుషులు, స్త్రీలు కూడా పాల్గొంటారు.
సమాజంలో పని చేయించేవారు, పని చేసేవారు, పని కల్పించేవారు మొదలైనవారిపై సమాజిక ఆర్ధిక ప్రగతి ఆధారపడి ఉంటుంది. వీరందరికీ అవరసరమైన ఆహార ఉత్పత్తులు మాత్రం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. కావున ఏ దేశానికైనా వ్యవసాయం ప్రధానం. దానిని నమ్ముకుని జీవించే రైతే ఆ దేశానికి వెన్నుముకగా మారతాడు.
ప్రపంచంలో వ్యవసాయ భూమి ఉన్న దేశాలలో మొదటిది అమెరికా అయితే, రెండవది భారతదేశం. కానీ దిగుబడిలో మాత్రం ఆ దేశం వెనకబడి ఉండడం గమనించవలసిన విషయం.
రైతే మానవ మనుగడకు ప్రధానమైతే, అటువంటి రైతు ఇబ్బందులు ప్రక్రుతి పరంగా ఉంటాయి. అకాల వర్షం రైతుకు నష్టం తీసుకురావచ్చు. వర్షాభావం కూడా రైతుకు నష్టమే... అటువంటి ప్రక్రుతి ప్రభావాలలో మార్పులు రాకుండా ఉండాలంటే పర్యావరణ పరిరక్షణలో కఠిన చర్యలు అవసరం.
దేశంలో రైతు ఆధారిత భూములకు తగినంత నీటి సదుపాయం కల్పించాల్సిన భాద్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఆహార పదార్ధాలు ఉత్పత్తి చేసే రైతు సాగుకు నష్టం కలగకుండా పర్యావరణ పరిరక్షణ అందరి సామజిక బాద్యత… వ్యవసాయ ఆధారిత దేశంలో రైతు గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “రైతు దేశానికి వెన్నుముక తెలుగులో వ్యాసం”