వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం

వృద్యాప్యంలో ఉన్నవారికి వారసులు తోడుగా ఉండాలి వ్యాసం. వృద్దులు అనగా అమ్మ గానీ నాన్నగానీ అమ్మగానీ తాతయ్యగానీ ఉంటారు. వీరు కాకుండా వృద్దులు ఉండరు. వ్యక్తికి ఉన్న తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు మరొకరికి మామగారు అవ్వవచ్చును అత్తగారు కావచ్చును. కానీ వారసుడు చుట్టూనే ఈ తల్లిదండ్రుల బంధం పెనవేసుకుని ఉంటుంది.

వ్యక్తికి ఉండే తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారసత్వంగా ఆస్తిని ఆచారాన్ని అందిస్తారు. వారిని వీరు చూస్తున్నంతకాలం వృద్దులకు కూడా కుటుంబంలో పిల్లలవలె అనిపిస్తారు.

పిల్లలను చిన్ననాటి నుండి కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వస్తున్నవారు పిల్లలకు పెళ్ళిచేసి చూసేవరకు శ్రమిస్తునే ఉంటారు. వారే తల్లిదండ్రులు మరియు వారి తల్లిదండ్రులు.

యుక్తవయస్సులోనే వివాహం అయితే తాతయ్య, అమ్మమ్మలు కూడా అవుతారు.

తల్లిదండ్రులకు పిల్లలు అడ్డుకారు… ఆనందమయం అవుతారు. పిల్లలకు సేవ చేయడమే తల్లిదండ్రులు సంతోషంగా భావిస్తారు.

నడుస్తున్న పిల్లలు పడిపోకుండా పట్టుకోవడానికి సిద్దంగా ఉంటారు. పడిపోతే దెబ్బ తగిలిన చోట ఆప్యాయత అనే ఆయింట్ మెంట్ పూస్తారు.

అమ్మ ఒడిలో ఓదార్పు నాన్న ఒడిలో ధైర్యం పొందే పిల్లలు ఎదిగి ఎదిగి తల్లిదండ్రులు వృద్దులైతే అడ్డుగా భావిస్తే, అంతకన్నా బాధాకరమైన విషయం వ్యక్తి జీవితంలో ఉండదని అంటారు.

మలమూత్రములు ఎత్తి పిల్లవానిని శుభ్రపరిచే అమ్మలో ఉండే సేవా దృక్పదం వలననే మనం ఈరోజు ఒక వ్యక్తిగా పరిణితి చెందాము. నాన్న చేసిన కష్టం వలన వచ్చిన కూడు తిని ఈ శరీరం ఇంతటిది అయ్యిందనే ఆలోచన మరిచివారిని కృతఘ్నులుగా చెబతారు.

పుస్తకంలో చదివిన మదర్ థెరిస్సా జీవితం సేవామయం అయితే, అమ్మ మనకు చేసిన సేవ ఏ పుస్తకంలోనూ వ్రాయబడదు… కానీ మన జీవితం అనేది ఒక పుస్తకం అయితే అమ్మ చేసిన సేవ వందమంది మదర్ థెరిస్సాల కంటే ఎక్కువే. అమ్మకు సాయంగా ఒక గ్రూపు ఉండదు. కష్టంలోనూ అమ్మ బిడ్డ సంరక్షణే చూస్తుంది. అమ్మకు ఎవరో గుర్తించాలనే తలంపుతో బిడ్డకు సేవ చేయదు… బిడ్డను రక్షించడమే ధ్యేయంగా సేవ చేస్తుంది.

నాన్న కష్టం అమ్మ సేవే ఈ జీవితం అయితే

నాన్న ఆధారపడి ఉన్న పిల్లల పోషణకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టం చేస్తూ ఉంటాడు. నాన్న గుర్తింపు కోసం ప్రాకులాడడు… పిల్లలలో సంతోషం చూసి లోపల సంతోషిస్తాడు కానీ పొగిడితే పిల్లలు దారి తప్పే అవకాశం ఉంటుందని… పిల్లల వృద్ది చూసి, సంతోషం కూడా బయటకు పొక్కకుండా లోలోపలే సంతోషంతో నిండిపోయే నాన్న హృదయం అర్ధంకానీ తండ్రితత్వమే.

అలా తమ జీవిత పర్యంతము పిల్లల భవిష్యత్తుకోసం పాటుపడినవారు వృద్దులుగా మారితే, వారు కుటుంబంలో ఒదుగుతున్న చంటి పిల్లల మాదిరిగా చూడాల్సినది పోయి వారిని వృద్దాశ్రమములో చేర్చడం అనే ఆలోచన తప్పుగా పరిగణిస్తారు.

నాన్న కష్టం అమ్మ సేవ మన జీవితం అయితే తిరిగి వారికి సేవ చేయడం అంటే అది అదృష్టమనే అంటారు. అలాంటి అదృష్టం దూరం చేసుకోవడం అంటే అజ్ఙానమనే తలుస్తారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు