పెద్దలు చెప్పిన పెద్ద మాట,

అనుమానం పెనుభూతం.

మనిషి శాంతికి భంగం కలిగించే

అంశంలో అనుమానం ముందు

ఉంటుంది. అనుమానం

అవతరించకముందు, మనిషి

ప్రశాంతంగా ఉంటాడు. అనుమానం

వస్తే, తన చుట్టూ ఉండే, అందరి

ప్రశాంతతను పాడు చేస్తాడు.

కాబట్టి అనుమానం పెనుభూతం

అన్నారు. మనిషి మనసు ఎప్పుడూ

ఆలోచనలు చేస్తూ ఉంటుంది.

అవి మంచి ఆలోచనలు అయితే,

మనసు ప్రశాంతతో ఉంటుంది.

కాబటి మంచి ఆలోచనలు మంచి

పుస్తకాలు చదవడం లేదా మంచి

మాటలు వినడం మంచిది అంటారు.