ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యంగా ఉండడమే పెద్ద ఆస్తి అన్నారు.
ఆరోగ్య నియమాలు ప్రక్కన పెట్టి, జీవితం అంతా కష్టపడి పాతిక లక్షలు సంపాదించి, చివరలో ఒక 20 లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవలసి వస్తే, జీవితాంతం పడ్డ కష్ట ఫలితం?
సరిగ్గా తినక, తినడంలో సమయ పాలన పాటించకుండా, మనసు పాడు చేసుకుని, శరీరాన్నిఇబ్బందికి గురిచేసి, అనారోగ్యంపాలు చేయడం వలన, వారిని నమ్ముకుని ఉండేవారికి కూడా ఇబ్బందే.
అదే ఆరోగ్య నియమాలు పాటించి, జీవితాంతం మొత్తం పదిలక్షలు కూడబెట్టినా, ఆ డబ్బు నమ్ముకున్నవారికి ఉపయోగం. ఇంకా ఆరోగ్యంగా జీవితం ఉంటుంది.
అనుభవజ్నులు అయిన వైద్యుల సలహాలు పాటిస్తూ జీవనం సాగాలని వైద్య నిపుణులు అంటారు. ఎందుకంటే నేటి సమాజంలో ఆహారం పైనా ఇంకా పర్యావరణం పైన కాలుష్య ప్రభావం పడుతుంది.
నిజమైన సంపద అంటే ఆరోగ్యంగా ఉండడమే అంటారు.
అసలైన సంపద ఆరోగ్యంగా ఉండడమే అని అంటారు. ప్రశాంత చిత్తం కలిగిన వారు సుఖ నిద్ర పొందుతారు. అంతకన్నా ఆస్తి ఏమి ఉంటుంది?
ఇంకా పరుగులు పెడుతున్న సంపాదనా మార్గాలు మనిషిని ఒత్తిడిలోకి నెట్టే అవకాశాలు కూడా ఎక్కువ అంటారు. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఆహార నియమాలు పాటించాల్సిందేనని అంటారు.
ఆరోగ్యంగా ఉంటే కష్టపడి పనిచేసి ఆర్ధిక ప్రగతి సాధించవచ్చు. అనారోగ్యం పాలైతే, సంపాదన హరించుకుపోతుంది. సంపాదన తగ్గుతుంది.
ఆరోగ్యవంతమైన శరీరధారి లక్షణాలు
వ్యక్తి వయస్సు మరియు వ్యక్తి ఎత్తును బట్టి సరైన బరువు కలిగి ఉంటారు.
శరీరంలో ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది.
ఆరోగ్యవంతుల గుండె లయబద్దంగా కొట్టుకుంటుంది.
అలాగే ఆరోగ్యంతో ఉండేవారి నాడీ కూడా లయబద్దంగా కొట్టుకుంటుంది.
శరీరంలో రక్త ప్రవాహం తగినంతగా సాగుతుంది.
అరుగుదల సక్రమంగా ఉంటుంది.
మల విసర్జనలో, మూత్ర విసర్జనలో సమస్యలు ఉండవు… తదితర విషయాలలో శరీర పనితీరు చక్కగా ఉంటుంది.
ఆరోగ్యం గురించి శ్రద్దగా పాటించవలసినవి
పౌష్టకాహారం
ఆహారం తీసుకునే విషయంలో సమయ పాలన
మంచినీరు తగినంతగా త్రాగుట
శరీరానికి నిర్ధిష్ట సమయంలో వ్యాయామం అవసరం
అలాగే నిర్ధిష్ట సమయంలో మనసుకు వ్యాయామం ఉండాలి.
నిత్యం నిర్ణీత సమయంలో ధ్యానం చేయడం తదితర నియమాలు చెబుతారు.
అద్బుతమైన పరికరాలను అపురూపంగా చూసుకుంటూ ఉంటే, మరి శరీరం కన్నా అద్బుతమైన సాధనం ఈ సృష్టిలో మరొకటి లేదని అంటారు.
పరికరాలను మనిషి సృష్టించగలడు, కానీ శరీరమును కాదు. ఇది మాతృగర్భంలో జరిగే ప్రక్రియ…. కాబట్టి వెలకట్టలేని శరీరాన్ని ఆరోగ్యవంతంగా కాపాడుకోవడం వ్యక్తి యొక్క కర్తవ్యం.
బలమైన మనసును నియంత్రణలో ఉంచుకోవడం అంటే తనని తను జయించడం అంటారు.
ఆరోగ్యం విషయంలో మనసు చాలా కీలకం. నియమాలు పాటించాలన్నా, విడిచిపెట్టాలన్నా మనసే ప్రధాన పాత్ర పోషిస్తుంది.
కాబట్టి శరీరం, జీవితం విలువ తెలియజేసే రచనలు, పెద్దల మాటలు వలన మాటవినని మనసు కూడా నియమాలు పాటించడానికి సిద్ద పడుతుంది.
ఆరోగ్యం కన్నా గొప్ప ఆస్తి లేదు. అనారోగ్యంగా కన్నా పెద్ద శత్రువు లేడు. మనసు మద్యలో కీలకమైన పాత్రను పోషిస్తుంది. దానిని నియంత్రించడమే ప్రధానం అంటారు.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “ఆరోగ్యం గురించి వ్యాసం తెలుగులో ఆరోగ్యమే మహాభాగ్యం”