By | July 10, 2024

కంగనా కంగుమనిపించే కామెట్ 1947లో స్వాతంత్ర్యం కాదు భిక్ష అని… ఈ క్రింది లింకును క్లిక్ చేసి, న్యూస్ పేపరులో వచ్చిన న్యూస్ ఆర్టికల్ చదవండి… అందులో కంగనా రనౌత్ స్టేట్ మెంట్ మరియు ప్రతి కామెంట్స్ వ్రాయబడి ఉంది.

కంగనా కంగుమనిపించే కామెంట్ 1947లో వచ్చింది.

కానీ ఇప్పుడు ఎవరు ఏమి కామెంట్ చేసిన మన పూర్వికులంతా కలసి సాధించిన విజయంగా 1947 ఆగష్టు పదిహేను నుండి స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించుకుంటున్నాము. తర్వాతి కాలంలో పరిపాలన అందుబాటులోకి వచ్చిన రోజుగా జనవరి 26 వ తేదీ నుండి గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. అంటే మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాము.

1947కు ముందు ఏమన్నా నష్టం జరిగిందంటే అందులో బ్రిటీష్ అధికారుల నిర్ణయాలు అలాగే ఏమైనా మేలు పనులు చేసినా బ్రిటీష్ వారు పరిపాలనా సౌలభ్యం కోసం చేసుకున్న ప్రయత్నాలు అంటారు. ఏమైతేనేం వారు పరిపాలించారు. మనం పరిపాలించబడ్డాము. తిరగబడ్డారు. స్వాతంత్ర్యం పోరాటం చేశారు. స్వాతంత్ర్యం తీసుకువచ్చారు.

అప్పుడు స్వాతంత్ర్యం వచ్చిందంటే బ్రిటీష్ వారు మన స్వాతంత్ర్య పోరాట యోధులను చూసి ఆశ్చర్య పడడం, పోరాట స్పూర్తిని చూసి నివ్వెరపోయిన సందర్భాలు అనేకమని పెద్దలు చెబుతారు. చరిత్రలో ఎంతో మంది భారతీయుల పోరాటపటిమ గురించి ఉందని అంటారు. మన స్వాతంత్ర్య యోధుల పోరాట పటిమను చూసి బ్రిటీష్ వారు ఆశ్చర్య పడడం అంటే వారి దగ్గర అంత పోరాడే పటిమ లేనట్టుగానే భావింపబడుతుంది.

బ్రిటీష్ వారు భారత్ లోకి వ్యాపారం గురించి వచ్చినట్టుగా వచ్చి

ఇక్కడ బ్రిటీష్ వారు భారత్ లోకి వ్యాపారం గురించి వచ్చినట్టుగా వచ్చి, ఆ తర్వాత మనకు తెలియని కుళ్ళు రాజకీయాలు చేసి, రాజుల ఐక్యతను దెబ్బతీసి, రాజుల మద్య చిచ్చు పెట్టి ఇద్దరి రాజుల మద్య యుద్దవాతావరణం సృష్టించి, ఆ యుద్ద మరణమృదంగం నుండి అధికారాన్ని చేజిక్కుంచుకున్న నీచ రాజకీయం అప్పటి బ్రిటీష్ వారికే చెల్లిందని చరిత్ర చెబుతున్నది. అలాంటి వారిపై పోరాటం చేయడం కాదు వ్యతిరేకించడం… వారిని తరిమికొట్టడం అయితే… మనలో మనకు సంపూర్ణ ఐక్యత రావడానికి ఏళ్ళ తరబడి కాలం పట్టింది కాబట్టి వారు దేశం విడిచి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది.

దొంగ దెబ్బ తీసేవారిని యోధులుగా పరిగణించారు. అలాంటిది యోధులను వేధించి, వేదించి ఉద్యమం నీరుగార్చే ప్రయత్నం చేసిన బ్రిటీష్ వారు చేసింది పోరాటం కాదు.. అరాచకం… అటువంటి అరాచకం దేశం నుండి తొలగించే ప్రక్రియలో ఎంతోమంది వీరులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ఏదైన దొడ్డిదారిన దేశానికొచ్చి నీచ రాజకీయాలతో అధికారం చేజిక్కుంచుకుని దేశాన్ని వారుకు నచ్చినట్టుగా పరిపాలించిన ప్రభుత్వం ప్రజలనుండి ఎదురైన తీవ్రవ్యతిరేకత కారణంగా మరలా పలాయనం బాట పట్టారు. అలా వారు వెళ్ళాక మనల్ని మనమే పాలించుకున్నాము.

అయితే చాలామంది అప్పటి బ్రిటీష్ పాలన యంత్రాంగ ప్రభావం చాలాకాలం కొనసాగిందనే అభిప్రాయం వస్తూ ఉంటుంది.

అటువంటి ప్రభావం ఏమిటనేది? పరిపాలించినవారికి అప్పటి పరిస్థితులు గమనించినవారికే తెలియాలి.

ఒకవేళ అలా ఏదైనా పరిపాలన కొనసాగి ఉంటే, అందులో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న మనకు బాధ్యత ఉంటుంది. ఎప్పుడో జరిగిపోయిన ఘటనలను తలచుకుని ఇప్పుడు ఆలోచన చేయడం కన్నా దేశంలో ఎదురౌతున్న అనేక సామాజిక సమస్యలపై దృష్టి సారించడం మేలైన పని.

ఇంకా అప్పటి కాలంలో గతించిన చాలామంది మహానుభావుల జీవిత త్యాగాలను తక్కువ చేసి చూడడం ఏమాత్రం సబబు కాదు… కానీ అప్పటి నుండి ఎవరైనా తప్పును కంటిన్యూ చేసి ఉంటే మాత్రం అది వారు తెలిసి చేసి ఉంటే అందుకు నిదర్శనంగా వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే ప్రజలు చాలాకాలం నాయకులను భరిస్తూ ఉంటారు. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు నాయకుడు మంచినే చేయడానికి ప్రయత్నించి సఫలీకృతులౌతారని…