By | July 10, 2024

మంచి ఒక చెట్టునే పండిన మామిడి పండు ఐతే,

చెట్టున ముగ్గిన మామిడిపండు రుచియే… రుచి!

మంచి మనసు ఉన్నవారే… ఉన్నవారు!

చెట్టునే పండిన మామిడి పండు ఆత్మీయులకే అందిస్తే,

మంచివ్యక్తికి మేలు జరగాలని మనసారా ప్రార్దిస్తాం…!

మేలు కోసమో? మంచి అనిపించుకోవడం కోసమో?

మంచితనం కలిగి ఉండడం కాదు వారికి 

సహజంగానే మంచి మనసు ఉంటుంది.

మామిడిపండు రుచులలో చెట్టునపండిన పండు

రుచి, దానిని ఆరగించినవారికే తెలియును… అలాగే

మంచి వారితో స్నేహం చేసినప్పుడే మంచివలన 

కలిగే విలువ తెలియబడుతుంది.

ఏ మామిడికాయకు ఉండదు చెట్టునే ముగ్గాలని,

కానీ గాలికో, రాయికొ రాలిపోతాయి లేక చిక్కానికి చిక్కుతాయ్!

ఎవరికి ఉండదు మంచి అనిపించుకోవాలని, కానీ కష్టానికో,

అవసరానికో పరిస్థితులు పరాభవించవచ్చు కానీ మనిషిలో

మంచి మరుగున పడదు…. అవకాశం వస్తే ఆకాశమంతా

మంచితనం పంచె హృదయం మనిషిలోనే ఉంటది.

కానీ కష్టంలో ఇష్టంగా మంచివైపు మక్కువతో ఉంటూ,

చెట్టున ముగ్గిన పండువలె అందరిచేత మన్నన పొందే కొందరు

చాలామందికి ఆదర్శం అయితే, అటువంటి వారిని లోకం ఆదరిస్తుంది.

రసాలు వేరైనా చిన్నరసం రుచి మేలు, చెట్టునే పండిన ఆ పండు రుచియే రుచి…

గుణాలు ఏవైనా మంచి మనసు చెడు గుణాలకు దూరంగా ఉంటుంది…

మరొకరికి ఆదర్శంగా ఉంటుంది… ఆచరించమని చెప్పే ఆదర్శం మామిడికాయ అయితే

ఆచరిస్తూ ఆదర్శంగా నిలవడం అంటే చెట్టునే పండిన మామిడి పండు వంటిది…

భలే మామిడి పండు భాగు భాగు మా మంచి మనిషి… మేలైన మనిషి!