By | January 23, 2022

తల్లిదండ్రుల కష్ట సమయంలో ఉన్నప్పుడు పిల్లలు ఏమి చేయాలి. వారి కష్టాలలో పాలుపంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కష్టపడుతున్న తల్లిదండ్రుల ఆర్దిక ప్రయత్నాలలో తమవంతుగా వారికి సాయంగా ఉండాలి.

అమ్మానాన్నలు ఇద్దరూ కూడా పిల్లల భవిష్యత్తుకోసం కష్టపడుతూ ఉంటారు. కొందరికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పాస్టులుంటాయి… కొందరికి అటువంటి ఆస్తి ఉండదు… కానీ పిల్లల భవిష్యత్తుకోసం పాటుపడుతూ ఉంటారు…

కొందరు జీవితం గురించి కలలు కంటారు. కానీ కాలంలో తాము కన్న కలలు నెరవేరవని తెలుసుకుని వాటిని విరమించుకుంటారు. ఎందుకంటే, వారికున్న అవగాహనారాహిత్యం వలన నెరవేరని ఆశలు పెంచుకున్నామని తెలియబడుతుంది… కానీ

తమ పిల్లల భవిష్యత్తుకోసం, పిల్లలు బాగుండాలనే కలలు కనే తల్లిదండ్రులు వాటి సాకారం కోసం కృషి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అప్పటికే జీవితం గురించి అవగాహన, తమ ఆర్దిక స్థితి గురించి సరైన అవగాహన ఉండి ఉండడం వలన పిల్లల జీవితం విషయంలో సరైన దృక్పధంతో తల్లిదండ్రుల దార్శినికత ఉంటుంది.

కాబట్టి ప్రతి తండ్రి తన పిల్లల కోసం కష్టపడుతూ కుటుంబ పోషణకు కృషి చేస్తూ ఉంటాడు. అలాగే తల్లి తమ పిల్లలను సంరక్షిస్తూ… పెంచుతుంది… అటువంటి తల్లిదండ్రుల తమ పిల్లలకు తమ తమ కష్టాల గురించి తెలియకుండా జాగ్రత్తపడుతూ ఉంటారు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటే, ఎలా ఉంటుందో? అలజడిగా ఉంటే ఎలా ఉంటుందో? వారికి బాగా తెలుసు… కాబట్టి తమ పిల్లల ప్రశాంతతకు భంగం కలిగించరు…

తల్లిదండ్రుల ఆర్ధిక స్థితి మరియు వారి కష్టాలు గ్రహించే అవగాహన

అయితే తల్లిదండ్రుల ఆర్ధిక స్థితి మరియు వారి కష్టాలు గ్రహించే అవగాహన ఎదిగిన పిల్లల ఉంటుంది. అలాంటి సమయంలో తల్లిదండ్రుల కష్టాల గురించి తెలుసుకుని తాము చేయగలిగిన సహాయం చేయాలి… ఎదిగిన పిల్లలుగా అది వారి కర్తవ్యంగా ఉంటుంది.

ఉదాహరణకు తండ్రి ఒక మోటార సైకిల్ మెకానిక్ అయితే…. ఎదిగిన కొడుకు విద్యాలయం నుండి ఇంటికొచ్చాక… తండ్రికి సహాయపడడం వలన, అది ఆ కుటుంబానికి మేలు చేస్తుంది.

అలాగే తండ్రి కిరాణ షాపు అయితే, ప్రతిరోజు… రోజువారి చదువు పూర్తిచేసుకుని… తండ్రికి సాయంగా ఉండడం వలన, అది వారి కుటుంబానికి సహాయపడుతుంది…

ప్రతి తండ్రికి కొడుకు వలన లభించే సహకారం, అది ఆ తండ్రికి మరింతగా మనోబలంగా మారుతుంది…. అలా కాకుండా మాట వినని కొడుకు అయితే మాత్రం అదే మనోవేదనగా మారుతుంది…

ఇంకా కొందరు అయితే ఎదిగిన పిల్లల భవిష్యత్తుకోసం ప్రయత్నించి… అలసి, వయస్సుమీరి ఉండవచ్చును… అటువంటి తల్లిదండ్రులను సంరక్షించుకోవలసిన అవసరం పిల్లలపై ఉంటుంది.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు

ధన్యవాదాలు – తెలుగురీడ్స్