By | November 3, 2021

తెలుగు నాట దీపావళి పండుగ చక్కగా జరుపుకుంటారు. నరకుడిని సత్యభామ సంహరించిన తర్వాత నరకపీడ వదిలిందని లోకంలోని జనులంతా సంతోషంతో దీపాలు వెలిగించి తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేసిన సందర్భంగా దీపావళి పండుగ ప్రారంభం అయినట్టుగా పురాణ గాధలు చెబుతూ ఉంటాయి.

ఇంతకీ నరకుడు ఎవరు అంటే భూదేవి పుత్రుడని అంటారు. కానీ ద్వాపరయుగంలో భూదేవి సత్యభామగా అవతారం స్వీకరించింది. కృష్ణుడికి ఆమె భార్య అయ్యింది.

వరప్రసాదం వలన నరకుడు తనకన్నా శక్తివంతుడు లేడని లోకంలో సాధు జనుల దగ్గర నుండి అందరినీ పీడించే పనిలో పడ్డాడు. పడతులను సైతం పీడించడం వలన అతని దుష్ట కార్యముల గురించి విన్న శ్రీకృష్ణుడు, భక్తుల మొరమేరకు నరకవధ చేయడానికి సంకల్పించడంతో, శ్రీకృష్ణుడితోబాటు యుద్దరంగానికి సత్యభామ కూడా రావడం విశేషం.

రణరంగంలో కృష్ణుడు తన మాయచేత తాను మూర్ఛపోయినట్టు నటించగా, సత్యభామ నరకునితో యుద్దం చేసి నరకుడిని మట్టుబెట్టినట్టుగా పురాణ ప్రశస్థ్యం.

దుష్టుడు, లోక కంఠకుడు అయిన వారిని కన్నతల్లి సైతం సహించదని ఈ నరకుని వధ తెలియజేయబడుతుంది. దుష్టభావనలకు తావివ్వకుండా, అజ్ఙానం మనసుని ఆవరించకుండా అంత:దృష్ఠిలో జ్ఙానదీపం నిత్యం వెలుగుతూ ఉండాలని అంటారు.

నరకుడి మరణానంతరం లోకమంతా సంతోషించిందంటే అర్ధం చేసుకోవచ్చు… నరకుడి దురాగాతాలు ఏమేరకు ప్రజలను పట్టి పీడించాయో… తెలియబడుతుంది. ఏనాడు అయినా ప్రజలను పీడించినవాడు ఎంతటి శక్తివంతుడు అయినా సరే అతనికి వినాశనం తప్పదని దీపావళి పందర్భంగా చెప్పే గాధలో తెలియబడుతుంది.

మన తెలుగు నాట దీపావళి పండుగ జరుపుకునే రోజున లక్ష్మీపూజ చేస్తారు. దీపారాధన ప్రారంభిస్తారు. కార్తీకమాస పుణ్యదినాలు ఈ దీపావళి రోజునుండే ప్రారంభం అవుతాయి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు