By | December 28, 2022
నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి! వ్యక్తి జీవనోపాధి కొరకు పలు మార్గములు అనుసరిస్తారు. అందులో ప్రధానంగా వృత్తి, వ్యాపారం, ఉద్యోగం మొదలైనవి. చేతి వృత్తుల పనులకు డిమాండ్ ఉన్నంతకాలం, ఆయా వృత్తులవారికి తగినంత ఆదాయం ఉంటుంది. ఏదైనా ఒక సంస్థంలో పనిచేస్తూ నెలవారీ జీతం ఇచ్చే ఉద్యోగాలు, రోజువారీ జీతం చెల్లించే ఉద్యోగాలు ఉంటాయి. సమాజంలో వ్యక్తి జీవనోపాధి కోసం తగు ఉద్యోగం లేకపోవడం నిరుద్యోగం చెబుతారు. ఒక ప్రాంతంలో ఏ పని లేకుండా ఎక్కువమంది ఉండడం వలన, ఆ ప్రాంతంలో ఆర్ధిక పరమైన ఇబ్బంది ఉంటుంది. వారు తమ పోషణ కొరకు కుటుంబ సభ్యులపై ఆధారపడి ఉండాలి. ఇలా దేశంలో ఎక్కువమందికి ఉద్యోగాలు లేకుండా ఉండడాన్ని నిరుద్యోగ సమస్యగా చెబుతారు. కొందరు ప్రభుత్వద్యోగం కోసం వేచి చూడడం వలన కూడా నిరుద్యోగసమస్య మరింతగా ఉంటుంది. అర్హతకు తగిన ఉద్యోగం చూపించలేకపోడం కూడా నిరుద్యోగ సమస్యగా చెబుతారు. మనకు స్వాతంత్ర్యం లభించిన తొలిరోజులలో ప్రభుత్వాలు అనేక పాఠశాలలను, కళాశాలలను స్థాపించాయి. వాటిలో చదివి ఉత్తీర్ణులైనవారిక ఉద్యోగాలు చూపించడం ఒక సమస్యగా తయారైంది. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వేచి ఉండే యువత నానాటికి పెరగడం పెద్ద సమస్యగా మారుతుంది. ఉద్యోగం లభించకపోవడంతో యువకులకు నిరాశానిస్పృహలు లోనవ్వడం జరుగుతుంది. అర్హతకు తగిన ఉద్యోగం కోసం వేచి చూడడంతో, చేతి పని చేయడానికి ఆసక్తి లేకపోవడం కూడా వ్యవస్థలో అభివృద్ది కుంటుబడడానికి కారణం కాగలదు. చదువులు పూర్తి చేసుకున్న యువత ఎక్కువ కాలం ఖాళీగా ఉండడం వలన యువశక్తి నిరుపయోగంగా మారుతుంది. ఇలా యువతలో నిరాశభావన పెరుగుతుంది.

నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి ! నిరుద్యోగ సమస్యకు నివారణ చర్యలు

మనదేశంలో నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రభుత్వం విద్యావిధానంలో తగు మార్పులు జరగాలి. వృత్తి విద్యా విధానానికి పోత్రాహమివ్వాలి. చదువుకు తగిన ఉద్యోగం కోసం వేచి చూస్తూనే, ఖాళీగా ఉండకుండా, తమకు తెలిసిన పని ద్వారా ఆదాయ మార్గమును అనుసరించే విధంగా యువతలో స్పూర్తిని నింపాలి. ఉద్యోగాలు అందించే కొత్త ఉత్పాదక, వ్యాపార సంస్థల స్థాపనకు కృషి చేయాలి. నిరుద్యోగ సమస్యకు నివారణ చర్యలు ప్రభుత్వ, ప్రవేటు వ్యవస్థలు కృషి చేయాలి.

స్వీయ ఉపాధిపై అవగాహన ఏర్పరచాలి

ఉద్యోగం ఉంటేనే జీవితం కాదు. జీవితంలో ఆదాయం ప్రధానం కాబట్టి తెలిసిన చేతి వృత్తి ద్వారా కానీ శారీరక శ్రమ ద్వారా కానీ మొదట ఆదాయమును పెంచుకోవాలనే విషయమును యువతకు తెలియజేయాలి. ఉదాహరణకు బికాం పూర్తి చేసిన విద్యార్ధి ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం కోసమే వేచి చూడకుండా ప్రవేటు సంస్థలలో కూడా పనిచేయడానికి శ్రద్ద చూపితే, అతనికి నెల నెలా జీతం వస్తుంది. ఇంకా కాలం వృధా కాకుండా ఎక్కౌంటింగులో ఎక్స్పీరీయన్స్ పెరుగుతుంది. తర్వాత బ్యాంకు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవచ్చును లేదా ప్రవేటు కంపెనీలలోనే ఎక్కువ జీతానికి మారవచ్చును. కావునా చదువు పూర్తయ్యాక ఖాళీగా ఉండడం కన్నా అందిన అవకాశంతో ఉద్యోగం చేస్తూ, కావాల్సిన తర్వాత ఉన్నతికి ప్రయత్నం చేయాలని అంటారు. డ్రైవింగ్ తెలిసిన వ్యక్తి ప్రభుత్వ కొలువులోనే డ్రైవరు ఉద్యోగం కోసమే వేచి చూడడం కన్నా, తనకు తెలిసిన డ్రైవింగుతో ప్రవేటు సంస్థలలో కూడా పనిచేయడానికి పూనుకోవడం వలన అతనికి నెల నెలా ఆదాయం వస్తుంది. అలా చేస్తూ కూడా ప్రభుత్వ కొలువులో డ్రైవరు ఉద్యోగానికి ప్రయత్నం చేయవచ్చును. లేదా డ్రైవింగ్ తెలుసుకాబట్టి బ్యాంకు రుణం ద్వారా కారు కానీ ఆటో కానీ తీసుకుని, వాటి ద్వారా కూడా ఆదాయం పొందవచ్చును.

నిరుద్యోగులలో నిరుత్సాహం లేకుండా చూడాలి.

స్వీయ ఉపాధికి కృషి చేసే విధంగా నిరుద్యోగులకు ప్రేరణ కల్పించే ప్రయత్నం జరగాలి. అందుకు తగిన ఆర్ధిక సాయం బ్యాంకుల ద్వారా అందించే ప్రయత్నం జరగాలి. నిరుద్యోగ సమస్య నివారణోపాయం తెలియజేయండి! నిరుద్యోగులు సంఖ్య నానాటికీ పెరగడం సమాజంలో ఆర్ధికాభివృద్ది కుంటుబడడానికి కారణం కాగలదు. కావునా ఈ సమస్య గురించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. యువశక్తి వృధా కాకుండా, కాలం వృధాకాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు