By | November 23, 2022
విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం. విద్యార్ధులకు తొలి కర్తవ్యం ఏమిటంటే చదువు. ఇది అక్షర సత్యం. అయితే చదువుతో బాటు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, వారికి సామాజిక అవగాహన అంతే ముఖ్యం. ఎందుకంటే వారు సంఘంలో భావి పౌరులుగా జీవించాలి. కాబట్టి సంఘంతో ఎలా మసలుకోవాలో అవగాహన ఉండాలి. అందుకు చదువుతో బాటు అప్పుడప్పుడు సాంఘిక కార్యక్రమంలో భాగంగా వారు కూడా సంఘసేవలో పాల్గొనడం చేత, వారికి సంఘంపై అవగాహన ఉంటుంది. ఇంకా ఆయా విద్యార్ధులపై సంఘంలో సద్భావన ఏర్పడుతుంది. స్వార్ధము మనిషికి పరిచయం చేయనవసరం లేదు. అదే మనసును పట్టుకుని ఉంటుందని అంటారు. కాబట్టి స్వార్ధ రహిత పనులు చేయడం వలన నిస్వార్ధము యొక్క గొప్పతనం కూడా విద్యార్దులకు పరిచయం అవుతుంది. కాబట్టి విద్యార్ధి దశలోనే సంఘంలో సేవా పనులు చేయడానికి ప్రయత్నించాలని అంటారు. అపకారికి ఉపకారం చేయి అని అన్నారు. అపకారికి కూడా ఉపకారం చేసేటంత ఓర్పు రావడానికి మొదటి మెట్టు స్వార్ధరహిత పనులలో శ్రద్ద పెట్టడడమేనని అంటారు. ఇతరులకు సాయపడాలనే సద్భావన మంది మనసులలో పెరగడం వలన సమాజంలో సృహృద్భాన పెరుగుతుంది. నేటి బాలలే రేపటి పౌరులు కావునా మంచి సమాజ నిర్మాణం కోసం, విద్యార్ధి దశలో సంఘసేవ చేయడం కూడా అలవాటు చేయాలని అంటారు.

ఎటువంటి కార్యక్రమములు ప్రధానంగా సంఘసేవగా చెబుతున్నారు?

  • ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు తమవంతు సాయం చేయడానికి కృషి చేయడం
  • ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించడం.
  • మొక్కలు నాటడం
  • ముసలివారికి సాయంగా ఉండడం.
  • దివ్యాంగులకు సాయం చేయడం.
  • అవసరం ఎరిగి, దానం చేయడం
  • సాంస్కృతిక కార్యక్రమములలో పాల్గొనడం
  • తమ చుట్టూ ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయడం.
  • పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం
తదితర కార్యక్రమములు సామాజికపరంగా మేలుని చేస్తాయి. ఇంకా ఆయా విద్యార్ధులపై సంఘంలో సద్భావన పెరగడానికి తోడ్పడతాయి. ఎవరైనా సంఘసేవ చేయడానికి పదవులు అవసరం లేదు. సేవచేయాలనే సేవాతత్పరత ఉంటే చాలు… అందుకు తగిన మార్గము గోచరిస్తుందని అంటారు. కావునా విద్యార్ధులకు సంఘసేవ ఆవశ్యకతను తెలియజేయలి. సంఘసేవ వలన సంఘంలో ఏర్పడే సద్భావన గురించి తెలియజేయాలి. వివిధ సంఘసంస్కర్తల గురించి వివరించాలి. లోకంతో ఎలా మెసులుకోవాలో? విద్యార్ధులకు తెలియాలంటే, వారితో సంఘసేవను చేయించడం వలన వారికి లోకంతో ఎలా ఉండాలో ఒక అవగాహన వస్తుందని అంటారు. సంఘంలో సంఘజీవిగా ఉండేవారు సంఘంతో మమేకం కావడానికి సాంఘిక కార్యక్రమములలో పాల్గొడనమే ప్రధానం. విద్యార్థులు సంఘసేవ తెలుగు వ్యాసం.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు