By | January 11, 2022

ఆశావాదం నిరాశావాదం మీ మాటలలో రాయండి. భవిష్యత్తు గురించి విశ్వాసంతో ఉంటూ, సానుకూల దృక్పధంతో సానుకూల ఆలోచనలు చేయడం అయితే దీనికి విరుద్ధంగా నిరాశావాదం ఉంటుందని అంటారు. ఆశావాదం వ్యక్తికి పాజిటివ్ అయితే, నిరాశావాదం వ్యక్తికి నెగిటివ్ అంటారు.

ఆశతో జీవిస్తూ, ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ జీవితం సాగించాలి కానీ ఆశాభంగం జరిగినప్పుడు నిరాశ, నిస్పృహలకు లోను కాకుడదని ప్రధానం పెద్దలు చెబుతూ ఉంటారు.

ఆశావాదం అంటే మంచి ఫలితం వస్తుందనే ఆశతో పనులు చేయడం. అయితే ఆశావాదంతో పనులు చేయడం ప్రారంభించడం చేత, మనసులో పాజిటివ్ థింకింగ్ డవలప్ అవుతుందని అంటారు.

ఇప్పుడు ప్రారంభిస్తున్న పని, భవిష్యత్తులో మంచి ఫలితం ఇస్తుందనే ఆశాభావం వ్యక్తం చేయడం ప్రధానమైన విషయం. ఇటువంటి ఆశావాదం తన చుట్టూ ఉన్నవారిలో కూడా ఆశాభావం పెంపొందించగలదు. ఈ విధంగా చూస్తే సంస్థలయందు ఆశావాదంతో పని చేసేవారు, చేయించేవారు కీలక పాత్రను పోషించగలరు.

అంటే ఆశావాద దృక్పదం అభివృద్దికి సహాయపడుతుంది. ఇంకా ఈ ఆశావాద దృక్పధం ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూల ఆలోచనలను పెంపొందిచగలదు.

నిరాశావాదంతో నైరాశ్యంలోకి వెళ్ళకూడదనే

చూసే దృష్టిని బట్టి లోకం తీరు కనబడుతుందని అంటారు. కాబట్టి ఎప్పుడూ నిరాశావాదంతో నైరాశ్యంలోకి వెళ్ళకూడదనే పెద్దలు సూచనలు చేస్తూ ఉంటారు.

మనిషి మనసులో సహజంగా ఆశలు పుడుతూ ఉంటాయి… నెరవేరుతూ ఉంటాయి. ఆశలు నెరవేరుతున్నకొలది ఆశలు పుడుతూ ఉండడం ఉంటే, ఆశలు నిరాశలు అయినప్పుడు వ్యతిరేక భావనలు మొదలవ్వడం జరుగుతుంది. అయితే ఈ వ్యతిరేక భావనలు నిరాశావాదం వైపు మరలకుండా మరలా మనసు ఆశాభావంతో నింపేయడం ప్రధానమంటారు.

పెద్ద పెద్ద దీర్ఘకాలిక ప్రణాళికలలో ప్రతికూల ఆలోచనలకు కూడా ప్రభావితం చూపుతూ ఉంటాయి. కానీ అవి దీర్ఘకాలిక ప్రణాళికలో దోషాలను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి నిరాశావాదంలో పుట్టే ప్రతికూల ఆలోచనలు దోషనివారణ కొరకు ఉపయోగించడం విజ్ఙుల పనిగా చెబుతారు.

ఆశ నిరాశ మద్య పనులు సాగుతూనే ఉంటాయి. అనుకూల ఫలితం మనసుకు బలం అయితే ప్రతికూల ఫలితం మనసుకు బలహీనత అవుతుంది. అయితే ప్రతికూల ఫలితం పొందినప్పుడు నిరాశావాదంతో నైరాశ్యంలోకి జారిపోకుండా, ప్రతికూల ఫలితానికి కారణం అన్వేశించాలని అంటారు.

కాబట్టి నిరాశావాదంలో పుట్టే ప్రతికూల ఆలోచనలను కార్యభంగానికి కారణాలు వెతకడానికికే కానీ నిరాశావాదంతో మమేకం కావడానికి కాదని గుర్తెరగాలి.

ప్రతికూల ఫలితం వెలువడినప్పుడు ఆశావాద దృక్పదంతోనే మరలా పున:ప్రయత్నం చేయడానికి సానుకూల ఆలోచన చేయడం ఆశావాదం వలన కలిగే ప్రధాన ప్రయోజనం అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు