By | October 2, 2021

అధిక్షేప వ్యాసం అంటే ఏమిటి? అధిక్షేపం ఆక్షేపించడం అంటారు. అంటే ఒక విషయంలో ఉన్న లోపామును అర్ధవంతంగా వివరణగా విశదీకరించడం అంటారు.

పరిపాలనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సమాజంలో ఉన్న మేధావులకు ఆ చట్టాలు లోపభూయిష్టంగా అనిపిస్తే, వాటిపై ఆక్షేపణలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఆ చట్టం యొక్క ఉద్దేశం, ఆ చట్టం యొక్క ప్రభావం, ఆ చట్టం అమలు అయితే వచ్చే దుష్ఫలితలను తెలియజేస్తూ విశ్లేషణలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అలాంటి విశ్లేషణలు మన టి‌విలలో చూస్తూ ఉంటాము.

అధిక్షేప ప్రసంగము వచన రూపములోకి మారితే, అది అధిక్షేప వ్యాసం అవ్వవచ్చు. అంటే ఉదాహరణకు ఒక ప్రభుత్వం ఒక చట్టం చేస్తే, ఆ చట్టంలో ఉండే లోపాలను ఎత్తి చూపుతూ విశేషణలు చేయడం. ఆ చట్టంలో ఉన్న లొసుగులను వివరించే ప్రయత్నం చేయడం. సమాజంపై ఆ చట్టం చూపే వ్యతిరేక ఫలితమును విశ్లేషించే ప్రయత్నం చేస్తూ వ్యాసం రాయడాన్ని అధిక్షేప వ్యాసం అనవచ్చు. ఇలాంటి అధిక్షేప వ్యాసాలు పత్రికలలో కధనాలుగా చూడవచ్చు.

అలాగే ఒక ప్రసిద్ద కంపెనీ సమాజంలో ఏదైనా వినూత్న వస్తువు తీసుకువస్తే, ఆ వస్తువు సమాజంపై భవిష్యత్తులో దుష్ప్రభావం చూపే అవకాశాలు సామాజిక శ్రేయోభిలాషులకు అనిపిస్తే, వారు సదరు వస్తువుపై ఆక్షేపణ తెలియజేస్తూ ఉంటారు. ఇవి టి‌విలలో విశ్లేషణలుగా పత్రికలలో కధనాలుగా వస్తూ ఉంటాయి.

ఎక్కువగా సమాజంపై దుష్ప్రభావం చూపించే నిర్ణయాలను కానీ వస్తువులను కానీ సేవలను కానీ మేధావులు విమర్శిస్తూ చేసే వ్యాఖ్యలు కూడా అధిక్షేపణగా ఉండవచ్చు. అటువంటి కార్యక్రమములు చూస్తే ఇటువంటి అధిక్షేపణ వ్యాసం ఎలా రాయాలో అర్ధం అవుతుంది.

సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ సమాజంపై వర్తమానంలో దుష్ప్రభావం చూపించే అంశంపైన కానీ భవిష్యత్తులో సమాజంపై దుష్ప్రభావం చూపించబోయే అంశంపైన కానీ వ్యాస రాస్తూ అందులోనూ లోపాలను ఎత్తి చూపుతూ విమర్శనాత్మకంగా రచన చేయడం అధిక్షేప వ్యాసం అనవచ్చు. అధిక్షేపణ కూడా సామాజిక శ్రేయస్సు కాంక్షించాలే కానీ తప్పుడు ప్రచారం కల్పించే విధంగా వ్యాసం ఉండరాదని పండితులు అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు