By | October 21, 2021

అమ్మ గొప్పతనం గురించి మీమాటలలో వ్రాయండి… అంటే… తెలుగు వ్యాసం. ముందుగా అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే, అమ్మ ప్రేమే చెప్పగలదు… అమ్మ ప్రేమను చవిచూసిన ప్రతి బిడ్డ అమ్మ గురించి గొప్పగా చెప్పగలరు.

ఏదైనా ఒక విషయం గురించి వ్రాయాలంటే, సదరు విషయంలో ఎంతో కొంత పరిజ్ఙానం అవసరం. కానీ అమ్మ విషయంలో మాత్రం ఏదైనా వ్రాయడమంటే, అమ్మ పంచిన ప్రేమను తరిచి చూస్తే చాలు… పదాలు ప్రవహిస్తూ పేరాలుగా ఏర్పడుతూ పేజీలకు పేజీలు పెరుగుతూనే ఉంటాయి. అయినా…

అమ్మ గొప్పతనం మాటలలో చెప్పబడడం అంటే కష్టమే కానీ అమ్మ నన్ను కనడానికి పడ్డ కష్టం కన్నా పెద్ద కష్టం ఏముంటుంది? అవును మనసును మధించి మధించి అమ్మను కాకా పట్టనవసరంలేదు… ”అమ్మా… ”అంటూ ఆర్తిగా పిలవగానే బాబూ… కన్నా… చిట్టి… అంటూ ఏది ఊతపదం అయితే ఆపదంతో అమ్మ పంచే ప్రేమ ముందు సృష్టిలో ఏది నిలవదు. అంత గొప్పతనం అమ్మతనంలో ఉంటే, నన్ను కన్నతల్లి, నన్ను కన్నతల్లిని కన్న తల్లికి ధన్యవాదాలు.

భూదేవికున్న ఓర్పు అమ్మకుంటుంది. అంత ఓర్పు ఉంటుంది కాబట్టే మరణయాతనను అనుభవిస్తూ బిడ్డకు జన్మనిస్తుంది… అమ్మ త్యాగం ఉంటేనే నేను. అమ్మ మృత్యువుతో యుద్దం చేస్తే నేను… అమ్మ సేవ చేస్తేనే నేను… నేను ఈ అకారము పొందిన పలువురిలో సుఖసంతోషాలతో జీవిస్తున్నాను అంటే అందుకు అమ్మ ఇచ్చిన ఈ జన్మే… అంతేకాదు అమ్మ నాకు ఊహ తెలిసేవరకు చేసిన సేవ వలననే నేను ఒక విద్యార్ధిగా సమాజంలో తిరగగలుగుతున్నాను. అమ్మ ఓర్పు భూదేవి ఓర్పు ఒక్కటే…

తను పస్తులుండైనా సరే పిల్లలకు అన్నం పెట్టే అమ్మలెందరో ఉంటారు. పిల్లలను పెంచడంలో పడిన తల్లి తనను తాను నిర్లక్ష్యం చేసుకోవడంలో ముందుంటుంది. పిల్లల శ్రేయస్సుకోసం పాటు పడుతూనే ఉంటుంది. పిల్లల ఎదుగుదల కోసం అమ్మ పడే ఆరాటానికి అలుపు ఉండదు.

ఆలోచిస్తే అమ్మను మించిన దైవం కానరాదు.

భవనాలలో ఉండేవారు అయినా గుడిసెలో వారు అయినా ప్యూన్ అయినా కలెక్టర్ అయినా అమ్మ దగ్గర తప్పటడుగులు వేసినవారే.

అమ్మ పాలు ఇస్తే పెరిగినవారు, అమ్మ అన్నం పెడితే తిన్నవారు… శక్తివంతులం అయ్యాము అంటే అమ్మ పెట్టిన బిక్ష… ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. అటువంటి భాగ్యం అమ్మ దగ్గర నుండే పెరుగుతూ ఉంటుంది.

అయితే విడ్డూరమైన విషయం అమ్మకు సేవచేసే భాగ్యమును పరులపరం చేయడం. లోకంలో వృద్ధాశ్రమములు పెరుగుతున్నాయంటే అమ్మ ఆధారించేవారు కరువు అవుతున్న కొడుకులు కారణమా? లేక కోడల్లు కారణమా? తెలియదు కానీ అలా అమ్మకు సేవ చేసే భాగ్యమునకు దూరం కాకుండా ఉండాలి…

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు