అంతరంగం తెలుగు పద భావన చూద్దాం. అంతరంగం అంటే ఆంతర్యంలో ఉండే ఆలోచన విధానం కావచ్చు లేదా మనసులో ఉండే భావన.
మన పెద్దలు లోదృష్టి అంటూ ఉంటారు. అంటే పైకి చెప్పే మాటలు కాకుండా లోపల ఎటువంటి భావన కలిగి ఉంటారు. ఎటువంటి ఆలోచనా విధానం సాగుతూ ఉంటుంది. ఇలాంటి లోదృష్టిని అంతరంగం అంటారు.
సముద్రంలో తరంగం వస్తూ, పోతూ ఉంటుంది. అలాగే మనిషి మనసులో ఆలోచన తరంగం మాదిరి పుడుతూ ఉంటుంది… పోతూ ఉంటుంది. సముద్ర తరంగం బాహాటంగా కనబడుతుంది. కానీ మనిషి లోదృష్టి అతనికే తెలియాలి. అంతరంలో ఆలోచననే అంతరంగం అంటూ ఉంటారు.
అంటే అంతరంగం తెలుగు పద భావన మనిషి మనసులోనే ఉండే భావన…. అయితే ఇది అన్నిసార్లు ఖచ్చితంగా బహిర్గతం కాకపోవచ్చు… కానీ ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. అప్పుడు లోకానికి అతని అంతరంగం ఇదీ అని ప్రస్పుటం అటువుతుంది.
అలాంటప్పుడు అంతరంగం అనే పదం అర్ధం అంటే… మనిషి లోపల దాచిపెట్టే భావనల సమాహారం కావచ్చు.
తనలోని భావముని పైకి కనబడనీయకుండా వ్యక్తి మాట్లాడే మాటల్లో ఆంతర్యం ఉంటుంది కానీ ప్రస్పుటం కాదు… ఆలోచన చేస్తేనే ఆ మాటలలో ఆంతర్యం అర్ధం అవుతుంది.
అంటే అంతరంగం తెలుగు పద భావన చెప్పీ చెప్పక చెప్పే మాటలలోని సారం కూడా అవ్వవచ్చు.
అంతరంగంలో ఆలోచనల అలలు పుడుతూ ఉంటాయి. ఆ ఆలోచనల అలజడిని నియంత్రిస్తూ మాట్లాడడమే మనిషి గొప్పతనం దాగి ఉంటుంది.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?