అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగువ్యాసం. సమాజంలో అంటువ్యాధులు ప్రభలితే, వాటి ప్రభావం అందరి ఆరోగ్యంపైనా పడుతుంది. దీని గురించి అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో వ్యాసం.
అంటువ్యాధి అంటేనే ఒకరి నుండి మరొకరికి పాకే గుణం కలిగి ఉంటుంది. సహజమైన వాతావరణంలో మనిషి సహజంగా తోటివారితో కలిగి జీవిస్తాడు. తద్ఫలితంగా అంటువ్యాధి వ్యాప్తి చెంది, నష్టం కలిగించే అవకాశాలు ఎక్కువ.
మనిషి సంఘజీవి, సమాజంలో కొందరితో కలిసి జీవించే మనిషి తనకంటూ ఒక కుటుంబం ఏర్పరచుకుని జేవిస్తూ ఉంటాడు. ఇంకా సమాజంలో పలువురితో కలిసి పని చేస్తూ, లేక చేయిస్తూ జేవిస్తూ ఉంటాడు. అలా మనిషి నిత్యం సమాజంలో కొందరితో కలిసి మెలసి, కొందరితో కలుస్తూ జీవనం కొన సాగిస్తూ ఉంటాడు.
అటువంటి మనిషికి ఒకరినొకరు కలవడం వలన సాంగత్యం ఏర్పడుతుంది. ఆ సాంగత్యం మనసుపైనా, శరీరం పైన ప్రభావం చూపుతుంది. అలా ఉండే మానవ జీవనంలో సహజమైన వాతావరణం మంచి స్థితిని అందిస్తే, అసహజమైన వాతావరణం చెడు ఫలితాలను అందిస్తుంది.
సహజమైన వాతావరణం అంటే పరిసరాల పరిశుభ్రతతో ఉండడం. ఇంకా పర్యావరణ సమతుల్యతతో కొనసాగడం జరుగుతుంది.
అపరిశుభ్రత వలన కలిగే అంటువ్యాధులు అపారనష్టం గురించి
అసహజమైన వాతావరణం అంటే పరిసరాలు అపరిశుభ్రతతో ఉండడం. పర్యావరణం కాలుష్యం అవ్వడం వంటివి జరుగుతాయి. ఇలా సమాజంలో వాతావరణం అసహజంగా మారడం వలన అనేక అంటువ్యాధులు ప్రభలుతాయి. సంఘజీవి అయిన మనిషి నిత్యం పరిచయస్తులతో కలుస్తూ, ఉండడం వలన వ్యాధులు ఒకరి నుండి ఒకరికి వ్యాపించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
ఇలా అంటువ్యాధులు సమాజంలో ప్రమాదకరంగా మారితే, అవి సమాజానికి అపారనష్టం కలిగిస్తాయి. సమాజానికి అపార నష్టం అంటే, ఆర్ధికంగా, నైతికంగా మనుషులు ఆందోళనను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సహజమైన పరిస్థితులలో మనిషి మనుగడ చాలా బాగుంటుంది. దైనందిన జీవనం కొనసాగుతూ, ఆర్ధికంగా ఎదుగుతూ, తోటివారికి సాయం చేస్తూ ఉంటాడు.
అదే అసహజమైన పరిస్థితులు పెరిగి, అంటువ్యాధులు ప్రభలితే, అదే మనిషి సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన ఆర్ధిక వనరులు కోల్పోయే అవకాశం ఎక్కువ. ఇంకా అనారోగ్యం ఎక్కువ అవుతుంది. తనకు సోకినా వ్యాధిని మరొకరికి వ్యాప్తి చెందడానికి కారకుడు కూడా కావచ్చును.
వ్యాధి గుణం ఒకరి నుండి మరొకరికి, ఆ మరొకరి నుండి ఇంకొకరికి ఆ ఇంకొకరి నుండి వేరొకరికి ఇలా ఒకరి నుండి రెండవ వారికి….మూడవవారికి… పదవవారికి… ఇరవైవారికి… అనేకమందికి పాకే గుణం వ్యాధికి ఉంటుంది. అటువంటి అంటువ్యాధులు చాలా ప్రమాదకరం.
కొన్ని రకాల అంటువ్యాధులు ప్రాణాంతకంగా మారతాయి. అటువంటి అంటువ్యాధులు మరింత ప్రమాదకరం.. వీటి వలన అనేకమంది ప్రాణాలు కోల్పోతారు.
మానవ మనుగడ అంతా ఒకరికొకరు సాయం వలననే సాగుతుంది. అటువంటి మనుషుల మద్య అంటువ్యాదులు తీవ్రత పెరిగితే, మానవ సంభందాలు ప్రభావితం అవుతాయి. కొందరు మనోధైర్యం కోల్పోయే అవకాశం కూడా అంటువ్యాధులు వలన ఏర్పడవచ్చు.
కావున అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా మనిషి చుట్టూ ఉండే సహజమైన వాతావరణం, సహజంగానే ఉండే విధంగా మనిషి కృషి చేయాలి. వ్యవస్థలు కూడా పరిసరాల పరిశుభ్రత విషయంలో పాటుపడాలి.
అంటువ్యాధులు నివారణ చర్యలు
ఎప్పుడైనా అంటువ్యాధి సమాజంలో వ్యాప్తి చెందుతూ ఉంటే, ముందుగా సంభందిత సామజిక వ్యవస్థలు మేల్కోవాలి.
- వృద్ది చెందుతున్న అంటువ్యాధి లక్షణాలు గురించి పూర్తీ సమాచారం సేకరించాలి.
- పెరుగుతున్న వ్యాధి గురించి సరైన అవగాహనా సమాజంలో కలగజేయాలి.
- అంటువ్యాధి యొక్క సహజ లక్షణాలు గురించి అర్ధవంతంగా సంబందిత సమాజంలో తెలియజేయాలి
- వ్యాధి లక్షణాలపై అపోహలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
- అంటువ్యాధి గురించి పుకారు వార్తలను సమాజంలో పాకకుండా జాగ్రత్త తీసుకోవాలి
- అంటువ్యాధి నివారణ చర్యలు అందరికి తెలియజేయాలి
- అంటువ్యాధి నివారణకు టీకా అందరికి అందే ఏర్పాట్లు ప్రభుత్వమే చేయాలి
- ముఖ్యంగా అంటువ్యాధి వ్యాపించకుండా సామజిక దూరం గురించి ప్రజలకు ప్రేరణ కలిగించాలి
- అంటువ్యాధి నివారణకు ప్రాధమిక జాగ్రత్తలు ప్రాముఖ్యతను పదే పదే ప్రచారం కల్పించాలి
ఈ విధంగా ప్రాధమికంగా అంటువ్యాధి నివారణ చర్యలను, తగు వైద్య సూచనలు తెలియజేస్తూ సమాజంలో విస్తరింప జేస్తూ ప్రజల ద్వారానే ప్రజలలో వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా చూడాలి. ఆపై పెరుగుతున్న అంటువ్యాధి నివారణకు వైద్యపరమైన మార్గాలు అన్వేషించాలి.
తగిన సమయంలో సత్వర నిర్ణయాలు తెసుకునే వారి నాయకత్వంలో అంటువ్యాధి నివారణ గురించిన బాద్యతలు ఉంచాలి.
అంటువ్యాధి సమాజంలో ఒకసారి వ్యాపిస్తే, మరలా ఆ సమాజంలో వచ్చే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. కావునా అంటువ్యాధికి టీకా సిద్దం చేయాలి. ఆ టీకా సమాజంలో ప్రజలందరికి వేయించాలి. ఇందుకోసం యుద్దప్రాతిపదికన చర్యలు అవసరం అని నిపుణులు అంటారు.
సమాజంలో ప్రమాదకరమైన అంటువ్యాధులు పెరిగితే, అవి సమాజంలో భారీ నష్టాన్ని అందిస్తాయి. కాబట్టి వాటిని వీలైనంత తక్కువ సమయంలో నివారించాలి.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “అంటువ్యాధులు అపారనష్టం గురించి తెలుగులో”