By | July 17, 2022
బంధాలు బలపడడానికి ఏం చేయాలి? అక్రమ సంబంధాలను లోకం పసి గడుతుంది. అక్రమ సంబంధాల వలన జరిగిన నష్టానికి తగిన శిక్షను చట్టాలు కూడా అమలు చేస్తాయి. దీని వలన అక్రమ సంబంధం తాత్కాలికమే ఇంకా లోకం వారిని పరువును తీసేస్తుంది. ఇక సక్రమంగా ఏర్పడిన బంధాలు జీవిత కాలం కొనసాగడానికి ఏం చేయాలి?

బంధాలు బలపడడానికి ఏం చేయాలి?

జీవితం చాలా విలువైనది! అందరికీ తెలిసిన విలువైన మాట కూడా ఇదే! అందరూ అశ్రద్ధ చేసే విషయం కూడా ఇదేనని అంటారు. ఎందుకంటే ఎక్కువగా నీరు లభించే చోట, నీటిని ఎలా పడితే అలా వాడినట్టుగా, ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉండేవారితో ప్రవర్తన కూడా అలానే ఉంటుందని అంటారు. నీటి కరువు ఉన్న చోట, నీటిని చాలా పొదుపుగా వాడుతారు. నీరు సమృద్దిగా ఉన్న చోట, నీటిలో పడి స్నానం చేసేస్తూ ఉంటారు. అరుదుగా లభించేవాటిని అపురూపంగా చూడడం. విరివిగా లభించేవాటిని విచ్చలవిడిగా వాడడం అలవాటుగా ఉంటే, ప్రమాదం అంచనా వేయకుండా, అది పొంచుకొచ్చి జీవితాన్ని పాడు చేస్తుందని అంటారు. కావునా వెంట తోడు ఉండే బంధాల విలువ ఏమిటో తెలుసుకోవాలి.

సక్రమ సంబంధాలు బలపడడానికి ఏం చేయాలి?

ప్రేమ వివాహం కానీ నిశ్చయ వివాహం కానీ పెద్దల సమక్షంలో జరిగిన వివాహ క్రతువుతో భార్యాభర్తలు అన్యోన్యంగా జీవించడం ప్రధానం. ఎందుకు భార్యభర్తలు కలిసి జీవిస్తే కుటుంబానికి ఒరిగిదేమిటి? వారికి కలిగే సంతానం విషయంలో మేలు కలుగుతుంది. భార్యభర్తల ఇద్దరూ ఒకే మాటపై ఉండడం చేత కలసి మెలసి ఉంటే, ఎంతో బాగుంటుందనే భావన ఉంటుంది. అమ్మా-నాన్న కీచులాడుకుంటూ ఉంటే, పిల్లల మనసులలో భయందోళనలే అధికంగా ఉంటాయి. భార్య భర్తలు ఇద్దరూ ఒక్కటిగా ఉండడం చేత, వారు పిల్లల సంరక్షణలో మమేకం కాగలరు. అందువలన అజ్ఙానంలో ఉండే పిల్లల సక్రమమైన పద్దతిలో ఎదిగే అవకాశాలు ఎక్కువ. అలా కాకుండా అమ్మా నాన్న ఎడమొఖం, పెడమొఖంగా ఉంటే, వారి సంరక్షణలో పిల్లల జీవితం ఎటు మరలుతుందో? ఎవరు ఊహించగలరు? కాబట్టి ఉత్తమ సామాజిక భవిష్యత్తు మంచి పౌరులను తయారు చేయడానికి ఉత్తమ దాంపత్య జీవితం అవసరం కాబట్టి ప్రేమ వివాహం అయినా నిశ్చయ వివాహం అయినా ఏర్పడిన బంధం ఎంతో ప్రధానమైనది అని మరొకరి జీవితాన్ని శాసించే స్థాయిలో దాంపత్యం ఉంటుందని గ్రహించాలి. అప్పుడే భార్యాభర్తలు కలిసేది… సామాజిక ప్రయోజనంతో పాటు వ్యక్తిగత జీవన పారమార్ధిక అంశం దాగుందని అర్ధం అవుతుంది.

సక్రమ సంబంధాలు బలపడడానికి ఏం చేయాలి?

పెద్లల సమక్షంలో ప్రేమ పెళ్ళి జరిగినా? నిశ్చయించుకున్న పెళ్ళి జరిగినా పెళ్ళంటే నూరేళ్ళ పంట అంటారు. ప్రతి సంవత్సరం వచ్చే పంట వలన ఒక కుటుంబం తిని బ్రతకడమే కాకుండా, ఆ ధాన్యం కొనుగోలు చేసినవారు కూడా జీవిస్తారు. అలాగే వివాహం ద్వారా ఏర్పడిన బంధం బలంగా ఉండడం వలన ఆ బంధంతో ఏర్పడే బంధాలు కూడా సక్రమమైన పద్దతిలో పెరిగి క్రమశిక్షణతో కూడిన ప్రవర్తనను కలిగి ఉంటారు. కాబట్టి వివాహ బంధం చాలా చాలా ప్రధానమైనది. విలువైన జీవితాన్ని శాసించేదని గ్రహించాలి కానీ ఇష్టానుసారం ప్రవరించేది కాదని గ్రహించాలి. వివాహ బంధం, పెళ్ళి బంధం.. ఏదైనా దాంపత్యం అంటే కేవలం సెక్స్ కాదు… సామాజికి, పారమార్ధిక ప్రయోజనాలు అని గమనిస్తే, బంధంపై గౌరవం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామిపై గౌరవం పెరుగుతుంది.

బంధాలు బలపడడానికి ఏం చేయాలి? చెప్పుడు మాటలకు తావు ఇవ్వకూడదు.

చూసి ఓర్వలేనివారికి చక్కనైన జంట కంటగింపుగానే కనబడతారు. కాబట్టి మీ చుట్టూ అటువంటివారు ఉంటే, వారితో మితంగా మాట్లాడడమే అసలైన మందు అంటారు. ఇరువురి మద్య ఏర్పడిన బంధం ఒక నమ్మకంతో పెరుగుతుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇరువురు కలసిమెలసి నడుచుకోవడం ప్రధానం.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు