By | January 11, 2021

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? తెలుగులో వ్యాసం చదవండి.

అర్జునుడికి భగవంతుడు బోధించిన బోధ కాబట్టి భగవద్గీత అన్నారు. అటువంటి భగవద్గీత పరమ పవిత్రమైనది. కోర్టులలో కూడా సాక్ష్యం తీసుకునేటప్పడు భగవద్గీతపైనే ప్రమాణం చేయిస్తారు. ఆత్మసాక్షాత్కరం, జ్ఙాన మార్గం, కర్మయోగం, భక్తి మార్గం అంటూ భగవానుడి బోధ కనబడుతుంది. నిత్య జీవితంలో భగవద్గీత ఎందుకు చదవాలి? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి మనసుకు వారికే తెలియాలి. ఎందుకంటే? భగవద్గీత చదవాల్సిన అవసరం ఉందా? లేదా? అనేది వారి మనస్సాక్షికే ఎరుక.

తన కర్తవ్యం తాను చేసుకుంటూ, రాగధ్వేషాలకు అతీతంగా జీవించేవారు కర్మయోగి అంటారు. అలాంటివారికి ఏ గీతాపాఠం అవసరంలేదు… జీవితాన్ని వారు సాధించుకుంటారని అంటారు.

వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి. ఎందుకంటే ఒక వ్యక్తి చుట్టూ ఏర్పడిన సామాజిక పరిస్థితులు, అతనికి పరిచయమై ఉన్న వ్యక్తులు, అతనిపై ప్రభావం చూపగలుగుతాయి. కారణం అతను కూడా తనచుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేసి ఉంటాడు. ప్రకృతిలో చర్యకు ప్రతిచర్య ఉంటుంది… కదా.

అలా ఒక వ్యక్తి తన దరిదాపులలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి. తనపై ఆధారపడినవారికి అనుగుణంగా నడుచుకోవాలి.. తనపై పెత్తనం చెలాయించేవారి మాటను మీర కూడదు… ఇలా ఒక వ్యక్తికి బంధనాలు ఏర్పడి ఉంటాయి..

తన ఇష్టంతో ప్రమేయం లేకుండా ఒక వ్యక్తి పనులు చేయవలసి ఉంటే, అది అతని మనసుకు ఇబ్బందికరమే. ఇలాంటి పరిస్థితులు మానసికమైతే…

శారీరక రుగ్మతలు, శారీరక గాయాలు ఏవైనా మరలా మనిషి మనసును బాధించవచ్చును. ఇంకా కుటుంబ జీవనంలో తనతోటి వారి ఆరోగ్యం వ్యక్తి కష్టంగా మారవచ్చును. వ్యక్తి తన చుట్టూ ఉన్నవారిచేత ప్రభావితం కాబడతాడు.

అంతర్లీనంగా మనసు చేసే బోధకు బుద్ది వశం అయితే

అలాంటప్పుడు అంతర్లీనంగా మనసు చేసే బోధకు బుద్ది వశం అయితే, తప్పులు చేసే అవకాశం ఉంటుంది. వ్యక్తి బుద్ది ఎప్పుడూ కర్తవ్యతా దీక్షతో ఉండాలని అంటారు. కానీ మనసు మాత్ర కలత చెందితే, అది బుద్దిపైనే ప్రభావం చూపుతుంది.

మనసు బుద్దిని లోబరుచుకోవాలని చూస్తుంటుంది. మనసు ఆలోచనలు చేస్తూ, తనకు తాను మేలు చేసుకోవగలదు… తనకు తానే చేటు చేసుకోగలదు.

వ్యక్తి మనసు దృఢంగా ఉంటే, వ్యక్తి బలమైన సంకల్పంతో మంచి మంచి విజయాలు అందుకోగలడు. కానీ మనసు చంచలంగా ఉంటే మాత్రం వ్యక్తి ఆశయ సాధనలో వెనకబడతాడు.

ఒక వ్యక్తికి కష్టం కాలంలో తన చుట్టూ ఉన్నావారి వలన కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితుల వలన కానీ కలగవచ్చును. కానీ కష్టంలో కూడా ఓర్పుతో ఉండి, బుద్దిని మనసుకు లొంగకుండా చూసుకున్నవారే విజేతలు అంటారు.

మనసు మనిషిపై ప్రభావం చూపుతూ బుద్దిని ప్రభావితం చేయగలదు. అటువంటి మనసుకు మందు భగవద్గీత అంటారు.

ఎందుకంటే ఏదైనా పురాణం చదివితే భక్తి భావన బలపడుతుంది. భగవద్గీత చదివితే, తనపై తనకు పరిశీలన ఏర్పడుతుందని అంటారు. భగవద్గీత చదవడం వలన సమాజంలో తన మనోప్రవృత్తి ఎలా ఉందో వ్యక్తికి అంతర్లీనంగా అవగతమవుతుందని అంటారు.

బుద్ది బ్రంశం చెందకుండా ఉండడానికి మనసుపై మనసు యుద్దం చేయడానికి భగవద్గీత పఠనం ఉపయోగపడుతుందని అంటారు.

భగవద్గీతలో భక్తితో బాటు మనోవిజ్ఙానం ఉంటుంది.

మనిషికి దారి తెలిస్తే, చేరవలసిన గమ్యానికి చేరుకుంటాడు. అలా మనిషిలో దారి తెలిసేది ఎవరికి? దారి తెలుసుకోవాలనే సంకల్పం చేసేదెవరు? ఎలా వెళ్ళాలి? అని ప్రశ్నించుకునేది, ఎవరు? ఇలాంటి ప్రశ్నలకు సమాదాణం మనసు అంటారు.

మనసు మనసునే ప్రశ్నించడమే అంతరంగంలో సంఘర్షణ అంటారు.

ఒక వస్తువు ఎలా వాడాలి? ఒక వస్తువు ఉపయోగించే విధానం ఏమిటి? ఒక వస్తువు వలన కలిగే ప్రయోజం ఏమిటి?… వ్యక్తి ఒక వస్తువును ఉపయోగించాలనుకున్నప్పుడు, ఇలాంటి ప్రశ్నలు ఎక్కడ పుడతాయో అదే అంతరంగం.

అలాంటి అంతరంగంలో సంకల్ప వికల్పాలతో దోబూచులాడేదే మనసు అంటారు.

అంటే గమ్యం చేరడానికి దారి తెలిస్తే, వ్యక్తిని గమ్యం వైపు అడుగులు వేసే వ్యక్తిలో ఉండేది మనసే.

అలాగే వస్తువు వాడుక విధానం తెలిసిన వ్యక్తిలో వస్తువును ఉపయోగించాలనే తలంపులు తట్టి లేపేది… మనసే.

ఇలా తెలిసిన విధానంతో పనులు చేయించగలిగే మనసుకు, తన గురించి తనకే తెలిస్తే…

ముందు తనను తాను పరిశీలన చేసుకుంటుంది.

తన తప్పులను గుర్తిస్తుంది

తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది…

అలా తనపై తనకు పరిశీలన చేసుకునే శక్తి సత్సంగం వలన కలుగుతుందని అంటారు. అలాంటి సత్సంగంలో బాగమే భగవద్గీత…

భగవద్గీత చదివితే మనోవికాసం ఏర్పడుతుందని అంటారు. మనసుపై బుద్దికి పట్టు ఉంటుందని అంటారు.

క్లిష్ట సమయాలల స్పందించాల్సిన మనసుకు మంచి మార్గం చూపించగలిగే శక్తి భగవద్గీతలో ఉందని అంటారు. అందుకే భగవద్గీతను చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటారు.

అర్జునుడి విషాదం కలిగినప్పుడే భగవద్గీత పుట్టింది… మనిషికి విషాదం కలిగనప్పుడే కృంగిపోతాడు… కానీ భగవద్గీత పఠనం మనిషి మనసుకు బలాన్ని అందిస్తుందని అంటారు.

శ్రీమద్ భగవద్గీత ఎందుకు చదవాలి? అను శీర్షికకు వ్యాసం పూర్తయింది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు