చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు మేలు కలుగుతుంది. చెట్లనుండి విడుదల అయ్యే ఆక్సిజన్ మనకు ప్రాణవాయువు… అంటే కొన్ని నిమిషాలపాటు ఊపిరి తీయకపోతే, ప్రాణం నిలవదు… అటువంటి మన ప్రాణాలకు ఆధారం ఆక్సిజన్, అటువంటి ఆక్సిజన్ చెట్ల వలన సమృద్దిగా లభిస్తుంది.
చేసిన మేలు మరిచేవాడిని కృతఘ్నుడు అంటాము… కృతఘ్నుడికి క్షమా బిక్షలేదని అంటారు. మరి చెట్టు మానవజాతి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి… కాబట్టి చెట్లకు నీరు అందించి వాటిని సంరక్షించాలి. చెట్లను తొలగించడము అంటే, మన ముప్పుకు మనమే కారణం అవుతున్నట్టేనని అంటారు.
చెట్లను రక్షించుకుంటూ మన భవిష్యత్తు తరానికి ఆహ్లాదకరమైన ప్రకృతిని అందించడానికి మనమంతా కృషి చేయాలి…. లేకపోతే మనకు మనమే ద్రోహం చేసుకున్నవారమవుతాము…
ఎదిగిన కొడుకు ఎలా చేతికందివస్తాడో… అలాగే పెద్ద పెద్ద వృక్షాల వలన ప్రకృతికి మేలు చేస్తూ, మనకు శ్రేయస్సు చేయగలవు… కావునా చెట్లను తొలగించడంలో తొందరపాటు పనికిరాదు.
ఒకవేళ మానవాళి ప్రయోజనాల దృష్ట్యా ఒక చెట్టును తొలగించాల్సిన ఆగత్యం ఏర్పడితే, ఆ చెట్టు ఉన్న ప్రాంతంలో కొన్ని మొక్కలను పెంచి, పోషించే బాద్యతను తీసుకోవాలి… అవి మొక్కగా బ్రతికి, ఎదగడానికి అనువుగా ఉన్నప్పుడు చెట్టును తొలగిస్తే, కొంతకాలానికి ఆదే ప్రాంతంలో నాటిన మొక్కలు మరి కొన్ని చెట్లుగా అవతరించవచ్చును… తద్వారా ప్రకృతి పర్యావరణం బాగుంంటుంది.
అంతేకానీ మన సౌకర్యం కోసం చెట్లను తొలగించడమే లక్ష్యంగా పనిచేస్తే, ఒకనాటికి మానవాళికి అవసరమయ్యే ఆక్సిజన్ అందుబాటులో లేకపోతే, అది మానవాళి మనుగడకు తీవ్ర అంతరాయం….
చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు ఎంతో మేలు జరుగుతుందని తెలుసుకోవాలి… తెలియజేయాలి… చెట్ల వలన మనిషి పొందుతున్న ప్రయోజనాలు ఏమిటో అందరికీ తెలియజేయాలి… చెట్లను కాపాడుకోవాలనే కాంక్ష అందరిలోనూ పుట్టే విధంగా చెట్ల సంరక్షణకు పూనుకోవాలి.
లోకంలో అనుసరించే గుణం ఉంటే, మంచి పనులను ఎక్కువమంది చేస్తే, తక్కినవారు మంచిపనులే చేయడానికి పూనుకుంటారు… మనకు చెట్లను కాపాడుకోవడం వలన పర్యావరణం రక్షించుకొన్నవారమవుతాం… కావునా ”చెట్లను కాపాడండి” అనునది నినాదం కావాలి…
మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులువిద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “చెట్లను కాపాడండి చెట్ల వలన మనకు”