By | November 12, 2021

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి. వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు? వృక్షములు వలన మానవాళికి జరుగుతున్న మేలు ఏమిటి? ఇలా పలు ప్రశ్నలు వేసుకునేముందు చెట్లనేవి లేకపోతే జరిగే తీవ్రనష్టాలు తెలుసుకుంటే చెట్ల ఆవశ్యకత ఎంత ఉంటుందో అర్ధం అవుతుంది. అలా నష్టమేమిటో చూస్తే, మనిషి భూమిపై బ్రతకలేడు అని చెప్పవచ్చును.

ఎందుకు భూమిపై చెట్లు అనేవి లేకపోతే మనిషి జీవించలేడు?

కారణం మనిషి ఆక్సిజన్ లేకుండా బ్రతకలేడు. ఇంకా నీరు లేకుండా జీవన సాగించలేడు. మనిషి ఆక్సిజన్ పీల్చుకుని బొగ్గుపులుసు వాయువును బయటకు వదులుతాడు. అలా మనిషి వదిలిన బొగ్గుపులుసు వాయువును చెట్టు పీల్చుకుని, అవి మరలా మనిషికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉంటాయి. అందువలన భూమిపై చెట్లు లేకపోతే ఇక మనిషి భూమిపై బ్రతకలేడు.

ఇంకొక కారణం వృక్షాల వలన ప్రకృతిలో పర్యావరణ సమతుల్యతకు ఎంతగానో సహాయపడతాయని అంటారు. పర్యావరణ సమతుల్యత వలన సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి. వర్షాల వలన నదులలో నీరు చక్కగా ఉంటుంది. ఎప్పుడూ ప్రవహించే నదులలో నీరు ఉండడం వలన వ్యవసాయానికి కాలువల ద్వారా నీరు అందుతుంది. తత్పలితంగా మనిషి తినడానికి అవసరమైన ఆహారం వృద్ది చెందుతుంది.

ఇంకా వర్షాల వలన కురిసే వర్షపు నీరు భూమిలోకి ఇంకడం వలన భూమిలో జలనవరులు తగ్గిపోకుండా ఉంటాయి. అందువలన భూమి నుండి పైకి బోరుల ద్వారా నీరు తెచ్చుకుంటున్న మనిషికి నీరు లోటు లేకుండా ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే మనిషికి గాలి సెకను సెకనుకు అసరం అయితే నీరు గంట గంటకు అవసరం అవుతుంది.

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

గాలి నీరు భూమిపై ఉండే చెట్ల ఆధారంగా ప్రకృతిలో సహజంగా ఉండగలవు. ప్రకృతిని సహజ సిద్దంగా ఉంచడంలో చెట్లు లేదా వృక్షాల పాత్ర అమోఘమైనది… అదో అద్భుతమైన ప్రక్రియ… ప్రకృతి ప్రకోపాలు భూమిపై పెరుగుతున్నాయంటే, భూమిపై చెట్లను ఎక్కువగా తొలగిస్తూ, అడవులను నశింపజేయడమే ప్రధాన కారణమని అభిప్రాయపడుతూ ఉంటారు.

అతి పెద్ద వృక్షాలు లేక అతి పెద్ద చెట్లు నీడనిస్తాయి.

రహదారికి ఇరువైపులా ఉండే చెట్లు గాలిలో ఆక్సిజన్ శాతం పెంచేవిధంగా చేయగలవని అంటారు. అతి పెద్ద వృక్షాలు లేక అతి పెద్ద చెట్లు రహదారికి ఇరువైపులా ఉండడం వలన ప్రయాణికులకు ఎండ నుండి రక్షణ ఉంటుంది. కాసేపు చెట్ల నీడ నుండి మనిషికి రక్షణ ఏర్పరచగలవు. ఇంకా జోరున వర్షం పడుతున్నా, కాసేపు పెద్ద చెట్ల క్రింద తడవకుండా జాగ్రత్తపడవచ్చును. అదే రోడ్డు ప్రక్కన ఒక బిల్డింగ్ ఉంటే, ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం మరొక మనిషి అవసరం ఉంటుంది. అదే రోడ్డు ప్రక్కన అతి పెద్ద వృక్షాలు లేక అతి పెద్ద చెట్లు మెయింటెనెన్స్ కోసం మనిషి అవసరం లేదు… ఇంకా అవే ప్రకృతిలో సమతుల్యతను మెయింటనెన్స్ చేయగలవు.

వృక్షాలను వృక్ష సంపదగా ఎందుకు పరిగణిస్తారు?

పైన చెప్పుకున్నట్టుగా రోడ్ ప్రక్కన పెద్ద పెద్ద వృక్షాలు ఉంటే, నిజంగా అవి మనకు అతి పెద్ద ఆస్తులే అవుతాయి. కారణం అవి ఇప్పటికే పెద్ద పెద్ద చెట్లు కావడం వలన ప్రత్యేకంగా నీరు ప్రతిరోజూ అందించనవసరం లేదు. సహజ సిద్దంగా కురిసే వాన నీరు వాటికి చాలు. ఇంకా అవి ప్రకృతిలో సమతుల్యతను పాటించడంలో ఒక తల్లి వంటి పాత్రను పోషిస్తాయి. ఆస్తులా ? అమ్మా ? అంటే అమ్మే అనేవారు ఎందరో ఉంటారు. మరి చెట్లు కూడా మనకు అంత మేలు ప్రకృతి రూపంలో చేస్తున్నప్పుడు వృక్షాలను పూజించడంలోనూ తప్పులేదనే భావనే బలపడుతుంది.

చెట్లు వలన ఉపయోగాలు వివరించండి
చెట్లు వలన ఉపయోగాలు వివరించండి

ఇంకా కొన్ని రకాల వృక్షాల వలన మనకు గృహోపకరణాలు తయారు చేస్తారు.

కొన్ని రకాల చెట్లతో పేపర్ తయారు అవుతుంది.

మరి కొన్ని రకాల చెట్ల ఆకులు వైద్యంలో ఉపయోగిస్తారు.

వైద్య రంగంలో మూలికలు కూడా కొన్ని రకాల చెట్ల ఏరుల నుండి సేకరిస్తారు.

ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగపడే చెట్లు మానవాళికి ఎంతగానో మేలు చేసే ప్రకృతి పరమైన ఆస్తులు అందుకే వాటిని వృక్షాలను వృక్ష సంపదగా పరిగణిస్తారు. అలాంటి వృక్ష సంపదను రక్షించుకుని తర్వాతి తరానికి మేలు సమాజాన్ని అందించడంలో మనవంతు పాత్రను మనం పోషించాలి.

మనిషి జీవనంలో సెల్ ఫోన్ బాగం అయింది కానీ వృక్ష సంపద వృద్ది భాగస్వామ్యం కావాలి.

ఇప్పుడు నిత్య జీవితంలో చేతిలో స్మార్ట్ ఫోన్ దానిని చూస్తూ గంటల తరబడి గడిపేయడం. దాని వలన మనిషికి మనిషికి మద్య గ్యాప్ పెరుగుతుంది. దాని వలన అదొక వ్యసనంగా మారుతుంది. దాని వలన డ్రైవింగ్ లో ప్రమాదం. దాని వలన సెల్పీ తీసుకుంటూ మరణించినవారు ఉన్నారు. ఇంకా దాని వలన మనిషి మెదడుకు ఇబ్బందే… ఇన్ని రకాల ఇబ్బందులు మనిషికి కలిగిస్తున్న స్మార్ట్ ఫోన్ ఆదరించే మహానుభావులు వృక్షాలను ఆదరిస్తే, రానున్న కాలంలో మరింత ఆక్సిజన్ కలిగిన ప్రకృతిని వృద్ది చేసినవారమవుతాము.

ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు. అటువంటి మహాభాగ్యము సహజ సిద్దమైన ప్రకృతి వలననే కలిగితే అటువంటి సహజ సిద్ద ప్రకృతిని అందించడంలో చెట్లు లేక వృక్షాల పాత్ర అమోఘమైనది. కాబట్టి చెట్ల పెంపకం వృక్ష సంపద పరిరక్షణ అందరి బాద్యతగా అందరూ గుర్తించాలి. ఇది ఒక ప్రభుత్వానిదో లేక ఒక వ్యవస్థకో బాధ్యత కాదు. అందరికీ చెట్ల పెంపకం గురించి అవగాహన ఉండాలి. చెట్లను పెంచాలి. జీవితంలో ఒక మొక్కను మానుగా మార్చాలనే సంకల్పం మనిషికి ఏర్పడితేనే అతను సామాజిక పరమైన కనీస బాద్యతను నెరవేర్చినట్టు అవుతుంది.

ఒక చెట్టు భూమిపై నుండి తొలగించే ముందు ఆ చెట్టు తాలుకా పది మొక్కల పెంపకం మొదలు పెట్టి, ఆపై ఆ చెట్టుని తొలగించాలనే ఆలోచన ప్రతివారిలోనూ మెదలాలి.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు