By | October 21, 2021

చిన్న కుటుంబం లాభ నష్టాలు తెలుగు వ్యాసం. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండేవని అంటూ ఉంటారు. ఇప్పుడు పెద్ద కుటుంబాలు తక్కువగానే ఉంటున్నాయని అంటూ ఉంటారు. సాదారణంగా చిన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటున్నాయని అంటారు. కారణం పెద్ద కుటుంబాల వలన పెత్తనం ఉండే పెద్దవారి చాదస్తంతో చిన్నవారు ఇబ్బందులు ఎదర్కొంటున్నారనేది ఒక సమస్యగా ఏర్పడడంతో ఇటువంటి అభిప్రాయం కలిగి ఉండవచ్చును. ఇంకా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ నినాదం కూడా పుట్టడానికి కారణం తక్కువమంది సభ్యులతో ఆర్ధికంగా లాభపడవచ్చును అని కూడా భావన ఉండవచ్చును.

కానీ కారణం ఏదైనా చిన్న కుటుంబంలో భార్యభర్తలిద్దరికీ ఏకాంత కాలం ఎక్కువగా ఉంటే, పెద్ద కుటుంబాలలో అటువంటి కాలం చాలా తక్కువగానే ఉండవచ్చును. చిన్న కుటుంబంలో స్వేచ్చా జీవనం ఏర్పడే అవకాశం కూడా ఎక్కువనే అంటారు. కారణం కుటుంబంలో నిర్ణయం ఇద్దరి మద్యే ఉంటుంది. భార్యభర్తల ఇద్దరి మద్యే ఉంటుంది. అదే పెద్ద కుటుంబంలో అయితే పెద్దవారి పర్మిషన్ తప్పని సరి.

చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే నినాదం ఎందుకు పుట్టింది…?

భారతదేశంలో పెద్ద కుటుంబాలలో అయితే భార్యభర్తలకు భర్తతరపు తల్లిదండ్రులు, భర్తతరపు తండ్రి సోదరులు వారి భార్యలు, భర్తతరపు భర్తగారి సోదరులు, వారి భార్యలు ఇంకా భర్తతరపు నానమ్మ, తాతయ్యలు కలిపి ఒక కుటుంబంలో పదిమందికి పైగా పెద్దవారు ఉండడం సహజంగా ఉంటే, పెద్దవారి పట్టు పద్దతి చిన్నవారిపై పడుతుంది. ఇంకా ఎక్కువమంది పెద్దవారు ఉండడం వలన ఏదైనా ఒక అంశంలో ఏకాభిప్రాయానికి సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. మనస్పర్ధలు పుట్టడానికి కారణం అయ్యే అవకాశం కూడా ఉంది.

అదే చిన్న కుటుంబంలో అయితే కేవలం భార్యభర్తలిద్దరిలో ఒకరి అభిప్రాయం ఒకరు గౌరవించుకుంటే సరి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనే నినాదము కుటుంబ నియంత్రణ పధకం అమలుకు ప్రధాన నినాదం అయి ఉండవచ్చు. కారణం కుటుంబ నియంత్రణ పాటించకుండా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండే కుటుంబాలు గతంలో మనదేశంలో ఎక్కువ… కాబట్టి జనాభా నియంత్రణకు కుటుంబ నియంత్రణ సాయపడుతుంది కాబట్టి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఒక నినాదం అయ్యింది.

అవును జనాభా నియంత్రణ ఒక సమస్యగా పరిణిమించిన నేపధ్యంలో కుటుంబ నియంత్రణ అమలుకు శ్రీకారం జరిగితే చిన్న కుటుంబం సుఖవంతమైన కుటుంబం అంటున్న నేపధ్యంలో పెద్దవారి మంచి మాటలు చిన్నవారికి చాదస్తంగా అనిపిస్తే, పెద్ద కుటుంబంలో మనస్పర్ధలు పెరగడానికి ఆస్కారం… ఏదో ఒత్తిడితో అందరితో కలిసి ఉండడం కన్నా ఎవరి జీవితం వారిది అన్నట్టుగా చిన్న చిన్న కుటుంబంగా విడిపోయే ఆలోచనలు కూడా భార్యభర్తలలో కలగడానికి ప్రేరణ కావచ్చును.

చిన్న కుటుంబంలో లాభాలు

అంటే చిన్న కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరూ ఇంకా వారి పిల్లలు ఉండడం చేత, కుటుంబ నిర్ణయాలకు పెద్ద చర్చలు ఉండవు.

ఇంకా చిన్న కుటుంబంలో ప్రధానంగా ఇద్దరి మద్యే ఏదైనా చర్చ కాబట్టి ఎక్కువ మనస్పర్ధలు అవకాశం ఉండదు.

ఇక ఆర్ధికంగా చిన్న కుటుంబం అయితే మేలు అనడానికి కారణం… భార్యభర్తలు కలసి ఇద్దరు పిల్లలతో ఉంటే, వారు ఆర్ధికంగా కొంచెం సొమ్ములు కూడబెట్టగలరు. అదే భార్యభర్తలు నలుగురైదుగురు పిల్లలతో ఉంటే, వారి సంపాధన కేవలం పిల్లల పెంపకం వరకే పరిమితం కాబట్టి… ఆర్ధికంగా నిలబడడానికి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఉండవచ్చును. ఆర్ధికంగా అయితే ఇద్దరి పిల్లలతో జీవించే భార్యభర్తల చిన్న కుటుంబం లాభదాయకమే అంటారు.

ఇలా చిన్న కుటుంబం వలన భార్యభర్తలిద్దరి మద్య మరింత ఏకాంత సమయం ఏర్పడుతుందనే ఇతరత్రా ఆలోచనలు అనేకం ఉండవచ్చును.

చిన్న కుటుంబంలో ఇప్పుడు సమస్యలు ఉన్నాయా?

మన సమాజంలో పెద్ద కుటుంబాలు ఉన్నప్పుడు వృద్ధాశ్రమములు తక్కువనే అంటారు. చిన్న కుటుంబాలు పెరిగా వృద్ధాశ్రమాలు పెరిగాయని అంటారు. అంటే చిన్న కుటుంబాలు పెరిగే కొలది కుటుంబంలో వృద్దులకు ఆసరా కరువైందనే భావన బలపడుతుంది.

పెళ్ళైన కొత్తల్లో చిన్న కుటుంబం చాలా స్వర్గదాయకంగా అనిపిస్తే, కాలం గడిచే కొలది అదే వెలితిగా కూడా మారుతుంది. పెద్ద కుటుంబంలో పెద్దల మద్య పెరిగే పిల్లలకు పద్దతులు చాలా బాగుండేవి… కారణం పిల్లలు ఎక్కువగా తాతయ్యలు, అమ్మమ్మల మద్య పెరిగేవారు… ఇప్పుడు అయితే భార్యభర్తలు ఇద్దరూ సంపాధనపరులు అయితే పిల్లలు ఆయాలకు చేరువ అవుతుండడం గమనార్హం.

చిన్న కుటుంబంలో ఎదుగుతున్న పిల్లలకు నాన్నే హీరో… అమ్మే హీరోయిన్…. అయితే కుటుంబంలో నిత్యం పరిశీలిస్తూ, చూసి నేర్చుకునే స్వభావానికి పెద్దలు మెరుగులు దిద్దే అవకాశం పెద్ద కుటుంబంలో ఉన్నంతగా చిన్న కుటుంబంలో ఉండదు. ఇంకా ఆయాల దగ్గర పెరిగే పిల్లలు అయితే, ఆయాకు ఎటువంటి స్వభావం ఉంటుందో, అటువంటి స్వాభావిక పద్దతులు నేర్చుకునే అవకాశం కూడా లేకపోలేదు.

జీవితమంటే ఏదో ఒక సమస్య ఉంటుంది. సమస్య వచ్చినప్సుడు సమస్యకు పరిష్కారం ఆలోచిస్తే, కుటుంబంలో శాంతి. అదే ఆ సమస్యకు కారణం ఎవరు? అనే ప్రశ్నతో పీక్కుంటే అదే అశాంతి. పెద్ద కుటుంబాలలో సమస్యకు పరిష్కారం చూసే దోరణి నుండి సమస్యకు కారణం ఎవరు అనే కోణం అలజడులే సృష్టించేవని అంటారు.

ఒంటరితనం పిల్లలలో పెరిగే అవకాశం చిన్న కుటుంబాలలో ఎక్కువగా ఉంటే, పెద్ద కుటుంబాలలో పెద్దల సంరక్షణ ఒంటరితనం దూరం చేస్తుంది.

ఇంకా చిన్నకుటుంబంలో ఇద్దరి నిర్ణయం త్వరగానే అంగీకరించబడుతుంది… అది ఎటువంటి నిర్ణయమైనా…

చిన్న కుటుంబం వ్యతిరేకం పెద్ద కుటుంబం అనుకూలం అని ఆలోచించడం కన్న ఉన్న స్థితిలో అవగాహనతో మెసులుకోవడం అవగాహన కల్పిస్తూ ముందుకు సాగడం కుటుంబ జీవనం అయితే నమ్మకం ప్రధాన పాత్ర పోసిస్తుంది. ఒకరిపై ఒకరు నమ్మకంతో మనస్పర్ధలు తావివ్వకుండా జీవించడమే ప్రధానంగా కుటుంబ శాంతి ఆధారపడుతుంది. అటువంటి శాంతియుత కుటుంబ వాతావరణమే పిల్లల ఎదుగుదలపై మంచి ప్రభావం చూపుతుంది.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు