By | September 7, 2021

ఆధునిక కాలంలో కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం. వ్యక్తి జీవన విధానంలో వేగవంతమైన పోటీ పెరగడానికి కంప్యూటర్ కూడా కారణం కావచ్చు. వివిధ రూపాలలో కంప్యూటర్ లభిస్తుంది. ముఖ్యంగా అద్భుతమైన సదుపాయాలతో ఆకట్టుకునే ఫీచర్లతో వివిధ పరిణామలలో కంప్యూటర్ లభిస్తుంది.

ముఖ్యంగా పనులు వేగవంతం కావడానికి కంప్యూటర్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాంటి కంప్యూటర్ ను వేగంగా ఉపయోగించే నిపుణుల మధ్య పోటీ… అలాంటి కంప్యూటర్ పరికరాలను మరింత శక్తివంతంగా రూపొందించడంలో వ్యవస్థల మధ్య పోటీ… ఇలా సమాజంలో వేగంగా సాగే జీవన విధానం కొనసాగడానికి కంప్యూటర్ కారణం అవుతుంది.

కంప్యూటర్ ముఖ్యంగా వ్యవస్థలలో పనితీరుని వేగవంతం చేసింది. పేపర్ ఉపయోగం తగ్గించింది. చెట్ల నుండి తయారు చేసే పేపర్ వాడకం తగ్గడం తగ్గడం శ్రేయస్కరం అంటారు.

ఇలాంటి ఈ కంప్యూటర్ అంటే ఏమిటి?

కంప్యూటర్ అంటే కంప్యూట్ చేసి చూపించేది? కంప్యూట్ అంటే కాలిక్యులేట్ చేయడం. అయితే ఇది ఏమిటి కంప్యూట్ చేసి చూపుతుంది. కంప్యూటర్ వివిధ పనులను చేసి చూపుతుంది… నిరంతరాయంగా ఎక్కువ కాలంపాటు ఒకే పనిని చేసి పెడుతుంది. ఒక్కసారి చేసిన పనిని పదే పదే పర్ఫెక్ట్ చేయగలదు.

ప్రధానంగా కంప్యూటర్ కి ఇచ్చిన డేటాను ప్రాసెస్ చేసి మరలా తిరిగి ఇస్తుంది. అంటే ఆదేశాలను స్వీకరించి, ఆ ఆదేశాలను అనుసరించి కార్యనిర్వహణ జరిపి మరలా ఆ కార్యమును అతి తక్కువ సమయంలో చూపుతుంది.

అంటే ఇన్ పుట్ టూల్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాలను స్వీకరించి, ప్రొసెసింగ్ టూల్స్ ద్వారా కంప్యూట్ చేసుకుని ఔట్ పుట్ టూల్స్ ద్వారా కంప్యూటర్ చూపవచ్చును… ఇంకా ప్రింట్ చేయవచ్చు… ఇంకా ఆడియోగా అందించగలదు. వీడియోగా అందించ గలదు.

అలా కంప్యూటర్లో ఇన్ పుట్ టూల్స్ అంటే కీబోర్డ్, మౌస్ తదితర టూల్స్ ఉంటాయి. మానిటర్, ప్రింటర్ ప్రధానంగా ఔట్ పుట్ టూల్స్ గా ఉంటాయి. పెన్ డ్రైవ్, డివిడి వంటివి ఇన్ పుట్ మరియు ఔట్ పుట్ టూల్స్ గా ఉపయోగపడతాయి.

కంప్యూటర్ ని నడిపించే సాఫ్ట్ వేర్

కంపుటర్లోని ఇన్ పుట్, ప్రొసెసింగ్ సాధనాలు ఉపయోగిస్తూ… ప్రొసెసింగ్ చేసే ప్రక్రియను నిర్వహించే సాఫ్ట్ వేర్ ఉంటుంది. ఇది కంటికి కనబడదు కానీ దీని పనుల ఫలితం చూడగలుగుతాము… ఎలా అంటే మనిషి మనసు ఎలా మనిషిని నడిపిస్తుందో అలాగే కంప్యూటర్ ని సాఫ్ట్ వేర్ నడిపిస్తుంది.

ఇలా కంప్యూటర్ నడిపించే సాఫ్ట్ వేర్ ను ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు.

ఇందులో వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్ వేర్స్ ఉంటాయి. పర్సనల్ కంప్యూటర్, లాప్ టాప్ వంటి పరికరాలను నడిపించే సాఫ్ట్ వేర్లలో విండోస్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంకా మ్యాక్ ఓఎస్, లైనక్స్… తదితర ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్ వేర్స్ ఉంటాయి.

టాబ్స్ వంటి వాటిలో కూడా లైనక్స్, మ్యాక్, విండోస్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్ వేర్స్ ఉంటాయి.

ఇక స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి లైనక్స్ ఆధారంగా తయారు చేయబడిన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రముఖమైనది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా తయారు చేయబడిన స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువగా ఉంటుంది.

కంప్యూటర్ లో ప్రొసెసింగ్ పార్ట్

కంప్యూటర్ లో ఆదేశాలను ప్రాసెస్ చేసి చూపించే క్రమంలో కంప్యూటర్ ప్రధానమైన పార్ట్ సిపియు… ఇదే సెంట్రల్ ప్రొసెసింగ్ యూనిట్ అంటారు. ఈ సిపియు లో ప్రొసెసింగ్ టూల్స్ ప్రాసెసర్ ప్రధానమైనది అయితే దానికి సహకరించే సాధనాలు వలన అది ప్రొసెసింగ్ కార్యక్రమం నిర్వహించగలుగుతుంది.

సిపియులో ప్రాసెసర్ కి సహకరించే సాధనాలు… మదర్ బోర్డ్, రామ్, హార్డ్ డిస్క్, పవర్ యూనిట్, గ్రాఫిక్ కార్డ్ తదితర పార్ట్శ్ ఉపయోగపడతాయి.

లాప్ టాప్ ఇన్ పుట్ ఔట్ పుట్ సాధనాలు కలిపి ఉండే కంప్యూటర్

ఇలా ఒక కంప్యూటర్ వ్యక్తిగతంగా ఉపయోగించడానికి ఇన్ పుట్ సాధనాలు, ఔట్ పుట్ సాధనాలు ప్రొసెసింగ్ యూనిట్ కలిగి ఉంటే, దానిని పర్సనల్ కంప్యూటర్ అంటారు. వ్యవస్థలలో ఎక్కువగా ఉద్యోగులు ఉపయోగించేవి ఇవే ఉంటాయి. ఈ పర్సనల్ కంప్యూటర్ ఎక్కడికైనా తీసుకువెళ్లే విధంగా ఉండేలాగా అందుకు అనుగుణంగా తయారు చేయబడేది… లాప్ టాప్ ఇందులో ఇన్ పుట్ ఔట్ పుట్ పరికరాలు, ప్రొసెసింగ్ యూనిట్ ఒక తెరిచి చూసుకునే దీర్ఘ చతురస్రాకార డబ్బా మాదిరి ఉంటుంది.

ఈ కంప్యూటర్ పరిణామం లాప్ టాప్ కన్నా చిన్న పరిణామంలో టాబ్ గా రూపాంతరం చెందింది… ఇది తేలికగా ఉండి, ఎక్కడికైనా తీసుకువెళ్లవచ్చు. అయితే ఇందులో ఇన్ పుట్ సాధనం అంటే ప్రధానంగా టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇదే దీనిలో ఇన్ పుట్ మరియు ఔట్ పుట్ సాధనం.

అంటే టచ్ చేస్తూ ఇన్ పుట్ ఆదేశం ఇస్తే, అది లోపల ప్రాసెస్ చేసుకుని అదే టచ్ స్క్రీనుపై ఔట్ పుట్ ప్రెజెంట్ చేస్తుంది. ఇంకా ఇన్ పుట్ – ఔట్ పుట్ సాధనం ఇయర్ ఫోన్ లేదా హెడ్ ఫోన్ సెట్స్ ఉంటాయి.

టాబ్ కన్నా చిన్న పరిణామం గల స్మార్ట్ ఫోన్ చాలా శక్తివంతంగా అకారర్షణీయంగా ఉంటూ నేటి సమాజంలో అందరి చేతిలో లోకాన్ని చూపుతుంది. మరొక డిజిటల్ ప్రపంచం ప్రతి వ్యక్తికి ఏర్పడే విధంగా స్మార్ట్ ఫోన్ ప్రభావం చూపుతుంది.

వ్యవస్థలలో మార్పుకు కంప్యూటర్ కారణం అయితే, వ్యక్తిలో మార్పుకు స్మార్ట్ ఫోన్ ప్రభావం ఉంటుంది.

కంప్యూటర్ వలన పనులు వేగంగా అవుతాయి

ఒక ఆర్టికల్ వ్రాయడానికి నిర్ధిస్థ పద్దతిలో కీ బోర్డ్ ద్వారా అక్షరాలను టైప్ చేస్తే, ఆ అక్షరాలను ఒక పేపర్ పై ప్రింట్ చేసే విధంగా స్క్రీనుపై చూపుతుంది. అయితే ఇదే పని టైప్ మెషిన్ కూడా చేస్తుంది. కానీ టైప్ మెషిన్ ఆధారంగా పేపర్ పై ఒక ఆర్టికల్ ఒకసారి ప్రింట్ చేసిన తర్వాత మరలా అదే ఆర్టికల్ మరలా పేపర్ పై ప్రింట్ చేయాలంటే మరలా టైప్ చేయాలి అలా అదే ఆర్టికల్ వంద కాపీలు కావాలంటే మార్పులు లేకుండా అయితే జిరాక్స్ తీసుకోవచ్చు కానీ మార్పులు చేయాలంటే మరలా టైప్ చేయాలి. కానీ కంప్యూటర్ నందు ఒకసారి ఒక ఆర్టికల్ టైప్ చేసి బధ్రపరిస్తే, మరలా మరలా మార్పులు చేసి నిమిషాలలో అనేక ప్రింట్స్ చేయవచ్చు.

కంప్యూటర్ ద్వారా అనేక పనులు సులభంగా చేయవచ్చు. అయితే దానిని వినియోగించే విధానంపై సరైన అవగాహన ఉండాలి. లేకపోతే సాదారణ సమయం బట్టే పనులు కూడా చాలా కాలం వృధా అవుతాయి. ఈ సమస్య మనకు కొన్ని చోట్ల ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. వేగంగా టైప్ చేయలేని వ్యక్తికి ఆర్టికల్ ప్రింట్ చేయమని పని అప్పగిస్తే, నిమిషాలలో జరగవలసిన పని గంటల సమయం సాగే అవకాశం ఎక్కువ.

కంప్యూటర్ వలన మాన్యుఫ్యాక్చరింగ్ వ్యవస్థలో పనివేగం పెరిగింది. ఒక వస్తువుని తయారు చేసే మెషిన్ ఆపరేటింగ్ కంప్యూటర్ ద్వారా నిర్వహించడం వలన ఆ మెషిన్ నిర్ధిస్థ సమయంలో ప్రాడెక్ట్స్ రెడీ చేయగలగుతాయి.

ఇలా కాలాన్ని కంప్యూటర్ కాలంగా మార్చేసిన కంప్యూటర్ వివిధ రూపాలలో వ్యక్తి జీవన విధానంలో భాగమై, వ్యక్తిని ప్రభావితం చేస్తుంది.

కంప్యూటర్ గురించి తెలుగులో వ్యాసం కేవలం కంప్యూటర్ గురించిన ఉపయోగం లేక దాని ప్రభావం గురించి వివరించే ప్రయత్నం అయితే పూర్తి కంప్యూటర్ పై అవగాహన కొరకు కంప్యూటర్ పార్ట్శ్, మరియు సాఫ్ట్ వేర్ అప్లికేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంటుంది.

ఈనాటి కాలంలో మొబైల్ యాప్స్ ఎక్కువగా ఉంటున్నాయి. వాటిలో విజ్ఞానం అందించేవి ఉంటే వినోదం అందించేవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.


మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు