By | February 22, 2022

సివి రామన్ గురించి ఆర్టికల్ చరిత్రలో ఒక రోజు రామన్ రోజుగా లిఖితమయ్యింది. అదే జాతీయ సైన్స్ దినోత్సవం. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర వేంకట రామన్ సైన్సులో ఒక ఎఫెక్ట్ అది రామన్ ఎఫెక్ట్ గా ప్రఖ్యాతి గాంచినది. వైజ్ఙానికరంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన మహనీయుడు. భారతరత్న ఇచ్చి భారత ప్రభుత్వం ఈయనను సత్కరించింది.

బౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ 1888 సంవత్సరంలో నవంబర్ ఏడవ తేదిన తిరుచినాపల్లి దగ్గరలో గల అయ్యన్ పెటాయ్ అను గ్రామములో జన్మించారు. ఈయన కుటుంబం వ్యవసాయ కుటుంబం. ఈయన తల్లిదండ్రులు పార్వతి అమ్మాళ్, చంద్రశేఖర్ అయ్యర్… ఈయన తండ్రి ఏవీఎన్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేసేవారు. తత్కారణంగా రామన్ బాల్యం విశాఖపట్నంలోనే సాగింది. విద్యాభ్యాసం కూడా అక్కడే.

1904వ సంవత్సరంలో ఈయన ప్రెసిడెన్సీ కాలేజిలో బంగారు పతకం సాధించారు. 1907వ సంవత్సరంలో ఎం.ఏ. డిగ్రీ పట్టా పొందారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రభుత్వ ఆర్ధికశాఖలో డిప్యూటి ఎక్కౌంటెంట్ జనరల్ గా జాయిన్ అయ్యారు. పరిశోధనాత్మక దృష్టిగల రామన్ తన పరిశోధనలు కొనసాగించారు. తీరిక సమయాన్ని అంతా పరిశోధనలతోనే సాగించారు. వేకువజామునే ఐసిఎస్ కు వెళ్తూ ఉండేవారు. ఆ తరువాత చేస్తున్న పనిని వదిలి, తనకు ప్రీతికరమైన యూనివర్సిటిలో ఫిజిక్స్ ప్రొపెసర్ గా జాయిన్ అయ్యారు.

పరిశోధనాత్మక దృష్టి ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోయగలదు. సివి రామన్ పరిశోధనా… సముద్రంలోని నీరు నీలిరంగులోనే ఎందుకుంటుంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నపై సాగితే, అలా సివి రామన్ పరిశోధనల ఫలితంగా పుట్టిన ప్రయోగ ఫలితమే రామన్ ఎఫెక్ట్ గా పిలవబడుతుంది.

సముద్రపు నీరు నీలిరంగులో కనబడడానికి కారణం ఈయన తన పరిశోధన ద్వారా తెలియజేశారు. సముద్రజలపు అణువులు సూర్యకాంతిని వివిధ వర్ణాలుగా విభజిస్తాయని…. వివిధ దశలలో వివిధ వర్ణాలుగా వెదజల్లుతాయని ఇంకా నీలి రంగు కిరణాలు మరింత లోతుకు చొచ్చుకు పోతాయని నిరూపితం అయింది. ఈ నీలి రంగు కిరణాల ప్రభావం చేత, సముద్రపు నీరు నీలి రంగులోనే ఉంటుందని చెబుతారు.

కాంతి పరావర్తనం విషయంలో రామన్ ప్రభావం వలన అణువుల నిర్మాణ పరిశీలన చేయడానికి మార్గం సుగమమైంది. తత్ఫలితంగా పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాల పరిశీలనకు సాద్యమైంది. వైద్య రంగంలో అవసరమయ్యే మందుల విశ్లేషణకు ఉపయుక్తం అయ్యింది.

కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. అను మాటలకు సివి రామన్ కృషి సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికీ చరిత్రలో ఒకరోజును రామన్ రోజుగా చెప్పుకుంటున్నాము. మనదేశంలో జాతీయ సైన్స్ దినోత్సం అంటే రామన్ కనిపెట్టిన ఎఫెక్ట్ పుట్టిన రోజే. రామన్ ఎఫెక్ట్ కాంతి ధర్మాలు

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు