డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం. స్మార్ట్ ఫోన్ వాడుక పెరిగాక డిజిటల్ చెల్లింపులు అధికమయ్యాయి.
ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుక విధానం చాల సులభంగా మారింది. కేవల అక్షర జ్ఞానం ఉంటే చాలు స్మార్ట్ ఫోన్ వాడుక చాల తేలిక. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ భాష ప్రాంతీయ భాషలలోకి మార్చుకోవచ్చు.
సాధారణంగా అయితే కరెంట్ బిల్లులు వంటి నెలవారీ చెల్లింపులు క్యూలో నిలబడి కట్టుకునేవారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వలన ఆన్ లైన్ చెల్లింపులు సులభతరం అయ్యాయి. పేమెంట్ వాలేట్స్ అందుకు బాగా సహకరిస్తున్నాయి. ఎవరికైనా మని పంపాలంటే మనియార్డర్ లేదా బ్యాంకు నుండి లావాదేవీలు నిర్వహించవలసి ఉండేది.
అయితే స్మార్ట్ ఫోన్, టాబ్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వాడుక పెరగడంతో బ్యాంకర్లు ఆన్ లైన్ బ్యాంకింగ్ బాగా ప్రోత్సహించడంతో లావాదేవిలు కంప్యూటర్ లేదా ఫోన్ ద్వారా జరుతున్నాయి.
పేమెంట్ వాల్లెట్లు వచ్చాక చెల్లింపులు కేవలం ఫోన్ నెంబర్ ఆధారంగా జరగడం ఎక్కువ అయ్యింది. పేటీయం, ఫోన్ పే, జిపే వంటి పేమెంట్ వాల్లెట్లు ప్రజలు బాగా వాడుతున్నారు.
ఇలా స్మార్ట్ ఫోన్ ద్వారా చెల్లింపులు పెరిగి, నగదు లావాదేవీలు తగ్గుముఖం పడుతున్నాయి.
నగదు లావాదేవీలలో చొర భయం ఉంటుంది.
ఇంకా నగదు లావాదేవిలలో రశీదు కీలకం. నగదు రశీదు వలన నగదు ముట్టినట్టు లేదా ముట్టనట్టుగా పరిగణిస్తారు.
కానీ డిజిటల్ చెల్లింపులు నేరుగా ఖాతాదారుని ఖాతాకు జమ అవ్వడంతో దానికి డిజిటల్ ప్రూఫ్ ఉంటుంది. బౌతికంగా రశీదుతో పని ఉండదు.
అయితే డిజిటల్ చెల్లింపులు చేయడానికి బ్యాంకు ఖాతా తప్పనిసరి. ఏదైనా ఒక బ్యాంకు ఖాతా ఉన్నవారికే డిజిటల్ చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది.
బ్యాంకు ఖాతా లేనివారికి మాత్రం డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ లేద టాబ్ వంటి పరికరాలతో పేమెంట్ చెల్లింపులు చేయలేరు.
ఏదైనా ఒక జాతీయ బ్యాంక్ ఖాతాతో, సులభంగా యూపిఐ ద్వారా పేమెంట్ వాలెట్స్ లో నమోదు చేసుకుంటూ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి.
ఇక ముందు మన దేశంలో కూడా ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ వచ్చే అవకాశం ఉంది.
కనీస అక్షర జ్నానమ్ కలిగినవారు, తమ ఆర్ధిక లావాదేవీలు స్మార్ట్ ఫోన్ ద్వారా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వ డిజిటల్ కరెన్సీ మనదేశంలో అమలు అయితే ఎక్కువమంది డిజిటల్ కరెన్సీ ఉపయోగించే అవకాశం ఉంటుంది.
అప్పుడు నగదు చెల్లింపులు ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది.
డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం వలన పెరుగుతూ నగదు లావాదేవీలను కట్టడి చేశాయని భావిస్తారు.
మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు
విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
0 responses to “డిజిటల్ చెల్లింపులు స్మార్ట్ ఫోన్ వినియోగం తెలుగు వ్యాసం”