By | July 3, 2022
ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం అంటారు. అవగాహన లేకపోతే, మాట్లాడటంలో కూడా తడబాటు ఉంటుంది. అవగాహన లేకపోతే వినడంలో కూడా ఆసక్తి ఉండదు. అవగాహన లేకపోతే ఆందోళనతో కూడిన ఆలోచనలకు ఆస్కారం ఉంటుంది. కావునా ఏదైనా అవసరం అయిన విషయంలో అవగాహనా రాహిత్యం ఉండరాదని అంటారు.

జీవితంలో ఏదైనా అవగాహన చేసుకోవడం అవసరం

ప్రయాణం గురించి అవగాహన లేనివారు ఇంకొకరిని అనుసరించవలసిన అవసరం ఏర్పడుతుంది. అలాగే విద్యార్ధికి సబ్జెక్టులో అవగాహన లేకపోతే, స్వయంగా పరీక్షలు విజయవంతం చేయలేడు. అలాగే ఒక చేతివృత్తి పనివానికి, అతని పనిలో పూర్తి అవగాహన లేకపోతే, ఆ వృత్తిలో అతను రాణించలేడు. కాబట్టి అవగాహన చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. పదవ తరగతి పరీక్షలు తర్వాత ఏ చదువులు చదవాలి? అనే ప్రశ్నకు బదులు లభించిన విద్యార్ధి కేవలం తన స్నేహితులు చదువుతున్నారనే ఉద్దేశ్యంతో తన చదువుని కొనసాగించే అవకాశం ఉంటుంది. అదే పది పబ్లిక్ పరీక్షలు వ్రాసిన విద్యార్ధికి, జీవితంలో తన లక్ష్యంపై అవగాహన ఉంటే, ఇంటర్మీడియట్ గ్రూపు ఏమి తీసుకోవాలో? ఎలాంటి గ్రూపులో ఏఏ సబ్జెక్టులు ప్రధానం అని తెలుసుకోవడమే కాకుండా… తన శక్తి సామర్ధ్యముల మేరు ఏ గ్రూపు అయితే తను బాగా రాణించగలడో ఒక అవగాహనను ఏర్పరచుకోగలడు. కావునా ఏ విషయంలోనైనా అవగాహ చేసుకోవడం అవసరం అంటారు.

రాజకీయ నాయకుడుకి సమాజం గురించి అవగాహన ఉండడం

ఒక ప్రాంతంలో ఒక రాజకీయ నాయకుడుకి సమాజం గురించి అవగాహన ఉండడం, ఆ సమాజాన్ని ఎలా అభివృద్ది చేయాలో ఒక ప్రణాళిక ఉంటుంది. తన ప్రణాళిక ప్రకారం సమాజానికి అవసరమైన మేలుని చేయగలుగుతారు. సామాజిక అభివృద్దిలో పాలు పంచుకోగలరు. కానీ ఒక రాజకీయ నాయకునికి అవగాహనా రాహిత్యం ఉంటే, సమాజానికి మేలు జరగదని అంటారు. కుటుంబ పెద్దకు అవగాహన ఉండడం వలన తన కుటుంబ సభ్యులకు ఏది మంచిదో? ఏది మంచిది కాదో? తేల్చి చెప్పగలడు. కుటుంబ సభ్యులకు మార్గదర్శకత్వం చేయగలడు. కావునా ఒక వ్యక్తి చిన్నతనం నుండి విషయాల గురించి అవగాహన ఏర్పరచుకోవడం ప్రధానం అంటారు. వయస్సు పెరిగే కొలది అవగాహనా రాహిత్యం తగ్గాలి. అవగాహన పెరగాలి అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు