By | July 24, 2022
హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి! సీతాన్వేషణలో భాగంగా వానర సైన్యంలో కొంతమంది దక్షిణ దిక్కుగా ప్రయాణం చేశారు. అయితే వారికి పెద్ద ఆటంకం వచ్చింది. అదే సముద్రం. సముద్రం దాటితే, సీతమ్మ జాడ కనిపెట్టే అవకాశం ఉంది. అయితే అంత పెద్ద సముద్రం దాటి వెళ్లేవారు ఎవరు?

హనుమంతుణ్ణి గురించి మీ సొంతమాటల్లో రాయండి

వానరలు సముద్రం దగ్గరకొచ్చి, సముద్రం దాటడానికి తమ తమ శక్తి సామర్ధ్యాలను అంచనా వేసుకుంటున్నారు. అందులో ఉన్న హనుమంతుడు మాత్రం మౌనంగానే ఉన్నాడు. అంతా తమ వల్లకాదని తేల్చుకుని, హనుమంతుడే ఈ పని చేయగలడని అందరూ భావిస్తారు. అప్పుడు హనుమంతుణ్ణి వారు సముద్రం దాటాలని సూచిస్తారు. వారంతా హనుమంతుడి శక్తి సామర్ద్యాలను కీర్తిస్తారు. కొందరికి తమ గురించి తమకు తక్కువ అంచనా లేకపోయినా, తమ శక్తి ఏమిటో తము గ్రహించి ఉండకపోవచ్చునని హనుమంతుడిని చూస్తే అర్ధం అవుతుంది. అలాంటివారికి వారి శక్తి గురించి, వారికి తెలియజేయడం వలన కార్యములను సాధించుకోవచ్చని తెలుస్తుంది. తమ తోటివారి ప్రార్ధన మేరకు తన శక్తి ఏమిటో తెలుసుకున్న హనుమంతుడు సముద్రం దాటడానికి పూనుకుంటాడు. అక్కడే ఉన్న పెద్ద కొండపై హనుమంతుడు నిలబడతాడు. తనకు ఈ అవకాశం రావడానికి కారణమైనవారందరిని హనముంతడు స్మరిస్తాడు. దేవతలందరికీ నమస్కరించి, హనుమ తన లక్ష్యం గురించి దృష్టి పెడతాడు. ఇక్కడ హనుమంతుడిని చూడడం వలన ఏదైనా కార్యం తలపెడుతున్నప్పుడు… అందరి అంగీకారం తీసుకుని, దానికి కారణం అయినవారిని స్మరిస్తూ, తనకు శక్తియుక్తులను ప్రసాదించినవారికి నమస్కరించాలని తెలుస్తుంది. కొండపై నిలబడి ఉన్న హనుమ దృష్టి లంకలోకి చేరింది. అంతే ”హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులు రిక్కించి, వంగి, చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను అణగదొక్కి పైకి ఎగిరాడు.”

లక్ష్యం చేధించేవారి మనసు, లక్ష్యమును ముందుగానే చేరుతుందని, హనుమంతుడి గురించి ఆలోచిస్తే అర్ధం

గమనిస్తే… హనుమంతడు సముద్రానికి ఇటువైపున ఉండగానే, హనుమ మనసు సముద్రం అటువైపున ఉన్న లంకానగరంలోకి ప్రయాణం చేసింది. అంటే హనుమ మనసు ముందుగానే లక్ష్యం చేరుకుంది. అలాగే కార్యసాధకుడి మనసు ముందుగానే లక్ష్యం గురించి అవగాహన ఉండాలి. సముద్రంపై ఎగురుతూ వెళుతున్న హనుమంతుడికి ఆతిధ్యం ఇస్తామని ఆహ్వానం అందింది…. సున్నితంగా తిరస్కరించారు. కేవలం లక్ష్యం చేరడానికి రామబాణం మాదిరి హనుమ లంకలోకి అడుగుపెడతాడు. లక్షలమంది వానరలు సీతాన్వేషణకు బయలుదేరితే, హనుమంతుడిపైన మాత్రమే సుగ్రీవుడికి గురి… రాముడికి నమ్మకం కలిగాయి. తనపై నమ్మకం కోల్పోకుండా హనుమంతుడు తన రాజు దగ్గర నడుచుకున్నాడని అర్ధం అవుతుంది. సేవ చేయడంలో హనుమంతుడి కన్నా స్ఫూర్తివంతమైనవారు కానరారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం? జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు? దానం గురించి దానం గొప్పతనం సన్మాన పత్రం ఇన్ తెలుగు వేచి ఉండడాన్ని నిర్వచించండి పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి? పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి? అవతారం అర్థం ఏమిటి తెలుగులో తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు లీడర్ అంటే ఎలా ఉండాలి ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి? ప్రేరణ తెలుగు పదము అర్ధము గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి? నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు