By | November 18, 2021

ఐకమత్యం బలం అంటూ ఐక్యత ఆవశ్యకతను వివరించండి, తెలుగులో వ్యాసం. శక్తివంతమైన మనిషికి మనోబలం సఖ్యతతో ఉండే స్నేహితులు, కదిలి వచ్చే బంధుగణం అయితే సమాజాకి బలం ప్రజల ఐక్యత.

ఎంతమంది ఐకమత్యంగా ఉంటే, అది అక్కడ అంతటి బలం అవుతుంది. ఐకమత్యమే బలం అయితే అనైక్యతే బలహీనత అంటారు. ఐకమత్యం అంటే ఒక విషయంలో గాని, ఒక అంశంలో గానీ అందరూ ఒక్క మాటపై ఉండడం అయితే అనైక్యత అంటే ఒక విషయంలో గాని, ఒక అంశంలో గానీ ఎవరి మాట వారిదిగా ఉండడం. ఎవరి ఇష్టానికి వారు ప్రవర్తించడం అంటారు.

కలసి ఉంటే కలదు సుఖం అన్నారు. కలిసిమెలిసి జీవించడం భారతీయుల ఐక్యతకు నిదర్శనం. కలసి ఉండే భారతీయ తత్వం ప్రజలలో ఉంటే, రాజుల మద్య స్నేహ సంబంధాలు ఉంటే, వాటి మద్యలోకి వచ్చి కుతంత్రముతో ముందు రాజ్యాల మద్య యుద్ద వాతావరణం సృష్టించి రాజుల సఖ్యతను చెడగొట్టినవారిగా వలస వచ్చిన బ్రిటీష్ వారిని చెబుతారు.

ఎంత ప్రయత్నం చేసినా భారతీయ మూలాలు అందరి మనసులలో ఉంటే, మహానుభావుల మది నుండి బహిర్గతమవుతూనే ఉండేవి.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వివిధ భాగాలుగా ఉన్న స్వతంత్ర రాజులను కూడా భారతదేశములో ఐక్యం చేయడానికి ప్రయత్నించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ మహానుభావుడు ఆ పని చేయకపోతే ఇప్పటి స్థితి ఊహకందనిది.

అయిదు వేళ్ళు బిగిస్తే పిడికిలి, పిడికిలి శక్తివంతమైనది. అలాగే అన్నదమ్ములు కలసి ఉంటే, అది ఆ కుటుంబానికి బలం. అలాగే ఒక ఊరిలో కుటుంబాలన్ని కలసి ఉంటే, అది ఆ ఊరికి మేలు చేస్తుంది. అలాగే ఒక జిల్లాలో అన్ని ఊళ్ళు కలసిగట్టుగా ఒక నిర్ణయంపై ఉండగలిగితే అది ఆ జిల్లాకు మేలు చేస్తుంది. అలాగే ఒక రాష్ట్రంలో అన్ని జిల్లాల నిర్ణయం ఒక్కటైనప్పుడు, ఆ నిర్ణయాన్ని ఎదిరించే సాహసం ఎవరూ చేయరు. అలాగే ఒక దేశంలో రాష్ట్రాల మాట ఒక్కటైతే, ఆ మాటకు తిరుగులేదు. ఐక్యత అంటే శక్తిని మరింత ఇనుమడింపజేస్తుంది.

ఐక్యత బలాన్ని మరింత పెంచుతుంది.

మనిషిలో ఆలోచనలన్నీ ఒకే విషయముపై ఉంటే, అతని మనసు ఆ విషయంలో శక్తివంతంగా పనిచేయగలదు. అంటే మనసు ఏకాగ్రతతో ఉండడమూ, అందరూ ఒకే విషయముపై ఒక నిర్ణయానికి వచ్చి ఉండడమూ ఒకే ఫలితం ఇవ్వగలదంటే, ఐక్యత అనేది మరింత బలమును పెంచుతుందని అవగతం అవుతుంది.

ఒక సామాజిక సమస్యంపై ఒకరు ఒక మాట, మరొకరు మరొక మాట మాట్లాడితే వ్యవస్థలు స్పందించవు. అదే ఒక సామాజిక సమస్యపై ఆ ప్రాంత ప్రజలంతా ఏకమైతే మాత్రం దానిపై అన్ని వ్యవస్థలు స్పందిస్తాయి… ఆ సమస్యపై చర్యలకు మార్గములు అన్వేషిస్తాయి. కాబట్టి ఐక్యత అనేది బలాన్ని మరింతగా పెంచుతుంది.

నాయకత్వం ప్రధాన లక్షణం అందరిలో ఐక్యత భావం పెంచడమే

సమాజంలో నాయకత్వం ప్రధాన లక్షణం అందరిలో ఐక్యత భావం పెంచడమే అయితే అటువంటి నాయకుడి వలన ప్రజలకు మరింత ప్రయోజనం ఉంటుంది. కానీ నాయకుడు ప్రజల మద్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రయోజనం పొందితే, ఆ విద్వేషాల మద్య అతని పతనం కూడా ప్రకృతి చేత ప్రభావితం చేయబడుతూ ఉంటుంది.

ఏదైనా ఐక్యత అనేది మరింత బలం అయితే అనైక్యత బలహీనత అవుతుంది. అనైక్యత పతనానికి నాంది అయ్యే పరిస్థితులను కల్పించే అవకాశం ఉంటుంది.


మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు