By | February 1, 2022

ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. ఆ దీపమే చదువుకుని ఉంటే, జ్ఙానం పిల్లల్లోకి ప్రసరిస్తుంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు సొంతమాటల్లో రాయండి.

ఇంటిలో పనులు ఇల్లాలు మాత్రమే చక్కని తీరుగా చక్కబెట్టగలదు అంటారు. అలా ఇంటిపనిలో అదనపు పని పిల్లలతో హోమ్ వర్క్ చేయించడం. పిల్లలకు చక్కని నీతి కధలు బోధించడం. పిల్లలకు మంచి మాటలు చెప్పడం. పిల్లలకు గొప్పవారి గురించి చెబుతూ, వారి మనసులో గొప్పవారు కావాలనే కాంక్షను పుట్టించడం.. ఇలా ఇంటిలో ఇల్లాలు పిల్లల మనసును మంచి దారిలో పెట్టగలదు. కాబట్టి చదువుకున్న ఇల్లాలు మరింత మంచి ఫలితం పిల్లల యందు తీసుకుని రాగలదు అంటారు. కావునా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు.

ఇంటివద్ద అమ్మ చెప్పే మాటలు పిల్లల మనసులో నాటుకు పోతాయి. చాలాకాలం ఆ మాటలు మనసులో ఉంటాయి. కొందరి మాటలు అయితే, ఉత్తమ లక్ష్యం వైపు పిల్లలను నడిపించేవిధంగా ఉంటాయి. అటువంటి అమ్మ ఉన్నత చదువులు చదువుకుని ఉంటే, ఆ అమ్మకొడుకు చదువులో సందేహాలకు అమ్మ దగ్గర సమాధానం లభిస్తుంది. అమ్మే పాఠాలకు సందేహాలు చెబుతుంటే, పిల్లలకు మరింత ఉత్సాహం ఉంటుంది.

ఇంట్లోనే ఉండే ఇల్లాలు చదువుకుని లేకపోతే, కేవలం పిల్లలకు తనకు తెలిసిన నాలుగు మంచి మాత్రమే చెప్పగలదు. ఇంకా ఏదైనా పాఠ్యాంశాలకు సంబంధించిన సందేహాలకు సమాధానం అమ్మ వద్ద లభించదు. ఇక చదువుకున్న నాన్న బయటినుండి ఇంటికి వచ్చేటప్పటికి అలసి ఉండవచ్చును. లేక లేటుగా ఇంటికి రావచ్చును. లేక ఏదైనా ఒత్తిడితో ఉండవచ్చును… కానీ ఇంట్లో ఇల్లాలికి సహనం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇల్లాలు చదువుకుని ఉంటే, ఆ ఇంట పిల్లలకు అది వరమే అవుతుంది.

అమ్మకొడుకు అమ్మ దగ్గర ప్రేమగా వినే పాఠ్యాంశాలు మైండులో బలంగా నాటుకుంటాయి. అమ్మ చెప్పే పురాణ కధలు గుర్తుకు ఉన్నట్టే, అమ్మ చెప్పే పాఠాలు కూడా గుర్తుకు ఉంటాయి… పరీక్షలప్పుడు అమ్మ మరింతగా పిల్లలకు సహాయపడి, వారు బాగా చదువుకోవడానికి కారణం కాగలదు. కావునా ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు‘ అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు