ప్రపంచంలో ఉండే అనేక కంపూటర్ల ద్వారా సమాచారం చేరవేయడానికి అనుసంధానం చేసే ఒక వ్యవస్థ. ఇది సమాచారాన్ని పంచుకోవడంలో, వ్యాపారాలు, విద్య, వినోదం మరియు రోజువారి పనుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.​ ఇంటర్నెట్ వలన ఉపయోగాలు దుష్పరిణామాలు ఉన్నాయి.

సమాజంలో ఇంటర్నెట్ వలన ఉపయోగాలు

ఇంటర్నెట్‌ని అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు, ముఖ్యంగా సమాచారం చేరవేయడంలో ఇంటర్నెట్ ప్రయోజనం చాలా ఎక్కువ, సద్వినియోగం చేసుకుంటే, ఇంటర్నెట్ ఒక అద్బుతం:​

ఇంటర్నెట్ వలన ఉపయోగాలు దుష్పరిణామాలు

విద్యలో: విద్యార్థులు ఆన్‌లైన్ పాఠాలు, కోర్సులు, రీసెర్చ్ కోసం ఉపయోగిస్తున్నారు.​

కమ్యూనికేషన్‌లో: మొబైల్ వంటి పరికరాల ద్వారా ఇమెయిల్, వీడియో కాల్స్, సోషల్ మీడియా వంటి మార్గాలతో ప్రపంచవ్యాప్తంగా సులభంగా మాట్లాడవచ్చు.​

వాణిజ్య వ్యాపార రంగంలో: షాపింగ్, బ్యాంకింగ్, బిల్లుల చెల్లింపులు మరియు వ్యాపార లావాదేవీలు చేయవచ్చు.​

వినోదం: వీడియోలు చూడడం, పాటలు వినడం, గేమ్స్ ఆడడం వంటి సేవలు సులభంగా లభిస్తాయి.​

ప్రభుత్వ సేవల్లో: వివిధ పన్నులు, బిల్లులు చెల్లింపులు, పరీక్షా ఫలితాలు, కౌన్సిలింగ్ వంటి సేవలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.​

4జి, 5జి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఇంటర్నెట్ సేవలు బాగా విస్తరించాయి. తద్వారా ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో బాటు సోషల్ మీడియాలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి.

ఇంటర్నెట్ వలన దుష్పరిణామాలు

ఇంటర్నెట్ ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్పరిణామాలు కూడా ఉన్నాయి, ముఖ్యంగా సమాచారం అందించడంలో ఇంటర్నెట్ చాలా కీలకం, దీనిని దుర్వినియోగం చేసుకుంటే, ఇది జీవితం పతనం వైపు వెళుతుంది:​

వ్యక్తిగత గోప్యత కోల్పోవడం: వ్యక్తిగత సమాచారం హ్యాకింగ్ లేదా డేటా లీక్ వంటి ప్రమాదాలకు గురవుతుంది.

పుకార్లు వ్యాప్తి: ఫేక్ న్యూస్ మరియు అపోహలు సామాజిక స్థాయిలో ప్రభావం చూపుతాయి.

వ్యసనం: ఎక్కువగా ఇంటర్నెట్ వాడడం వల్ల మానసిక ఆరోగ్యం, సామాజిక జీవితంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. యువతపై ఎక్కువగా మొబైల్ ఎడిక్సన్ ప్రభావం ఉంటుంది.

ఇంటర్నెట్ వలన ఉపయోగాలు దుష్పరిణామాలు

సైబర్ నేరాలు: ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్, ఐడెంటిటీ చోరీ వంటి ప్రమాదాలు పెరుగుతున్నాయి.

సోషల్ మీడియా ప్రభావం కుటుంబ సంస్కృతీపై బాగా ప్రభావం చూపుతుంది.

ఇంటర్నెట్ వలన ఉపయోగాలు దుష్పరిణామాలు ముగింపు

ఇంటర్నెట్ ఒక అద్భుతమైన సాంకేతిక సాధనం అయినప్పటికీ, దానిని పరిమితంగా, సక్రమంగా ఉపయోగించడం అవసరం. ఇది అప్పుడు మన జీవనశైలిని మెరుగుపరచగలదు, కానీ అజాగ్రత్తగా వాడితే మానసిక, సామాజిక మరియు భద్రతా సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువగా అలవాటు పడితే, ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది.

జీవితంలో క్రమశిక్షణ అవసరం వ్యాసం వ్రాయండి?

రవికాంత్ మార్నింగ్ వాక్ విత్ సోషల్ మీడియా యాప్స్

అంకణము అంటే అర్ధం ఏమిటి?

పునః పునః అంటే అర్ధం ఏమిటి?


కర్ణుడు జీవితం నుండి ఏం గ్రహించాలి?

దీర్ఘకాలిక ప్రణాళికలు అనేది భవిష్యత్ లక్ష్యాలు