By | December 12, 2021

ఇష్టపడి కష్టపడితే శ్రమకు ఫలితం ఉంటుందని అంటారు! ఎంతవరకు ఏమిటి అని విశ్లేషిస్తే…

బాగా కష్టపడి చదివినవారు పరీక్ష వ్రాస్తారు. బాగా చదవకుండా కూడా పరీక్ష వ్రాస్తారు. కష్టపడి చదివి పరీక్ష వ్రాసినా, కాఫీ కొట్టి పరీక్ష వ్రాసినా, సరైన సమాధానములకు మార్కులు వస్తాయి. ఆ రీతిలో పరీక్షలో ఇద్దరూ ఉత్తీర్ణులవుతారు. చదివి, చదవనివారు కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటే, మరి కష్టపడి చదవడం ఎందుకు?

కష్టపడి చదివి పరీక్ష వ్రాసిన విద్యార్ధి, తనకు ఫలితం వలన ఆనందంగా మరొక చదువుకు పూనుకుంటాడు… కానీ కాఫీ కొట్టి వ్రాసిన విద్యార్ధి, తనకు లభించిన ఫలితం కేవలం నామమాత్రపు ఫలితంగానే భావిస్తాడు. కేవలం ఒక తరగతి నుండి మరొక తరగతికి మారడానికి ఒకప్పుడు హాజరు నమోదు చేసుకున్నట్టుగానే పరీక్షలో కూడా ప్రశ్నలకు సమాధానములు ఎలాగోలాగా వ్రాసాను అనే భావన మాత్రమే మిగులుతంది. ఈ భావన ఉత్తమ విద్యార్ధి లక్షణంగా పరిగణింపబడదు.

కాబట్టి కష్టపడితే వచ్చే ఫలితం కష్టపడకుండా సాధించేవారితో సమానంగా ఉన్నాసరే తను కష్టపడి సాధించిన ఫలితంగా కష్టపడ్డ వ్యక్తి భావిస్తే, యాధాలాఫంగా ఫలితం పొందానని కష్టపడకుండా ఫలితం పొందిన వ్యక్తి భావన ఉండిపోతుంది. ఈ భావన తృప్తికరంగా ఉండదని అంటారు.

సరే కష్టపడి చదివి బాగా పరీక్షలు వ్రాయగలిగితే, మంచి మార్కుల శాతంతో పరీక్షలు ఉత్తీర్ణులవుతారు. లేదా కష్టపడి పనిచేస్తే తగిన ఫలితం పొందవచ్చును. మరి ఇష్టపడి కష్టపడడం ఏమిటి?

ఇష్టపడి కష్టపడితే ఫలితం?

కొందరు అయిష్టంగానైనా చదివేసి, పరీక్షలు వ్రాసేసి, తర్వాత ఇతర పనులలో నిమగ్నం అవుతారు. చదివిన చదువుకు, చేస్తున్న పనికి సంబంధం లేకుండా ఉంటుంది. అందువలన తను చదివిన చదువు చేస్తున్న వృత్తిలో ఉన్నత స్థితికి మద్దతుగా నిలబడదు. ఆ కారణం చేత, తను చేస్తున్న పనిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వృత్తి ఉండే అవకాశం ఉంటుంది.

అదే ఇష్టపడి కష్టపడి చదివితే, ఆ చదువులో మనసు పరిశీలనాత్మక దృష్టితో ఉంటుంది. ఇంకా మనసుకు చదువు అనే అంశము తేలికగానే ఉంటుంది కానీ చదువు మనసుకు భారంగా ఉండదు. తత్కారణం తాను ప్రత్యేకించి చదువుతున్న అంశములో తగినంత నైపుణ్యమును సముపార్జించగలడు. తత్కారణంగా చదువుకు తగిన వృత్తిలో నిమగ్నం కాగలడు. చేస్తున్న వృత్తిలో ఉన్నత స్థితికి చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇష్టపడి కష్టపడి చదవమని పెద్దలంటారు.

ఇంకా చెప్పాలంటే ఇష్టమున్న అంశముపై మనసు ప్రత్యేక శ్రద్దను పెట్టగలదు. అదెలాగ అంటే?

ఒకరికి సినిమా అంటే ఇష్టం. సినిమాలు చూస్తూ ఉంటారు. సినిమాలు అంటే ఇష్టమున్నతని మనసు రాబోయే సినిమాలు ఏమేమిటి? అనే ప్రశ్నకు సమాధానం వెతకడం ప్రారంభిస్తారు. రాబోయే సినిమాలు ఏమిటో తెలిశాక… అందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలా సినిమా, సినిమాకు సంబంధించిన వార్తలు, విశేషాలు చదువుతూ సినిమా పరిజ్ఙానం పెంపొందించుకోవడం మనసు తపించి, శ్రద్దను పెంచుకుంటుంది…. అంటే మనసు ఇష్టపడితే, కష్టం కూడా ఇష్టంగానే భావిస్తుంది… కాబట్టి మన మనసుకు మంచి విషయములను ఇష్టంగా మార్చే ప్రయత్నం చేయాలని పెద్దలు చెబుతారు.

ఆటలంటే ఇష్టమున్న వారు కూడా ఆటలపై ఆసక్తితో ఆటల గురించి అనేక విధములుగా విషయ పరిజ్ఙానం పెంపొందించుకోవడంలో మనసు తపిస్తుంది.

పరితపించే మనసుకు మంచి లక్ష్యమును అందిస్తే…

తపించే మనసు శ్రద్దను పెంచుకుంటూ విషయ పరిజ్ఙానమును పెంపొందించుకోగలదు… కావునా తపన ఉన్నవారికి మంచి విషయాలపై ఆసక్తి కలిగేలాగా చూడాలని పెద్దలు అంటారు. అలా పరితపించే మనసుకు మంచి లక్ష్యమును అందించడం చేత మనసుకు కష్టం కూడా ఇష్టంగా ఏర్పడి… ఇష్టపడి కష్టపడి శ్రమకు తగ్గ ఫలితం పొందేవరకు తపించగలదని అంటారు.

పిల్లలకు కష్టపడి వంటచేసే అమ్మకు తన కష్టమంతా ఇష్టంగానే అనిపిస్తుంది. ఇంకా పిల్లల భవిష్యత్తు కొరకు ఇష్టపడి కష్టపడే తండ్రికి కూడా కష్టం ఇష్టంగానే అనిపిస్తుంది. ఒకరి కష్టంపై ఆధారపడి జీవించేవారు, తమ జీవనస్థితిలో తమ కర్తవ్యం ఖచ్చితంగా నిర్వహించాలనేది ప్రకృతి నియమం అయితే, తల్లిదండ్రుల కష్టంపై చదువుకునే విద్యార్ధుల కర్తవ్యం ఇష్టపడి కష్టపడి చదవడమే ప్రధానమైన విషయంగా చెబుతారు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు