By | August 24, 2021

జాతీయ సమైఖ్యత తెలుగులో వ్యాసం. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్నా, సమయం సందర్భం వచ్చినప్పుడు మనుషులంతా ఒక్కటిగానే స్పందిస్తారు. అది ప్రాణాపాయ సమస్య కావచ్చు. సామాజిక విద్రోహ చర్యలు జరిగినప్పుడు కావచ్చు.

అలా ఒక ప్రాంతంలో మనుషులంతా ఒక్కటిగా స్పందించడం సమైఖ్యతగా కనబడుతుంది. అలాంటి ఉదాహరణ అంటే తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ ప్రాంత ప్రజలంతా ఒక్కటైనారు. సమిష్టిగా తెలంగాణ సాదనకు ప్రజలు సహకరించారు.

అంటే ఇక్కడ ఎంత ఎక్కువమంది ఒకే విషయంలో ఒకే అభిప్రాయం కలిగి ఉంటే, ఆ అభిప్రాయం శాసనంగా మారగలదు. దీనినే సమైఖ్యతా కృషి ఫలితం అంటారు.

ఇటువంటి ఫలితాలు దేశమంతా రావాలంటే, దేశం కోసం జాతీయత భావనను కలిగి ఉండి, అందుకు సమైఖ్యతా దృష్టి అందరిలోనూ ఉండాలి.

ఎందుకోసం జాతీయతా సమైఖ్యభావన అవసరం అంటే?

ప్రపంచం అంతటా వివిధ దేశాలు, వివిధ సంస్కృతులు కలసి ఉంటే, ఒక దేశంలో ఒక సంస్కృతి అన్నట్టుగా ప్రపంచ దేశాలు ఉంటాయి. కానీ మన దేశం భిన్న మతాలు, భిన్న సంస్కృతులతో కూడి ఉంటుంది. అదే మన దేశం యొక్క గొప్పతనంగా ప్రపంచం భావిస్తుంది.

అయితే ఇటువంటి భిన్న స్వభావాల మధ్య జాతీయత సమస్య వచ్చినప్పుడు ఒకే విధంగా స్పందిస్తూ భరతజాతి మొత్తం ఒకే విధంగా స్పందిస్తూ ఉంటుంది. మనదేశంలో ఇది మరొక గొప్ప విశయంగా పరిగణింపబడుతుంది.

అయితే రాజకీయ స్వార్ధపరుల వలన సమైఖ్యతా భావన లేనట్టుగా కనబడుతుంది… కానీ భారతీయులంతా భారతదేశమంటే ఒక్కటే అనే భావన బలంగా ఉంటుంది.

భారతీయుల అందరిలో జాతీయ సమైఖ్యత

ఈ విషయం జనతా కర్ఫ్యూ పాటించడంలో ప్రస్పుటం అయ్యింది. దేశ ప్రధాని పిలుపుకు యవజ్జాతి అంతా సంఘీభావం తెలియజేస్తూ… జనతా కర్ఫ్యూ విజయవంతం చేశారు. ఇది మన జాతీయ సమైఖ్యత దృష్టికి నిదర్శనం. ఇది మన మనోభావావేశ బలం.

జాతీయ సమైఖ్యత భావం మతపరంగా చూసినప్పుడు వేరుగా కనబడవచ్చు. కానీ భారతీయులమనే భావన దానిని కూడా ప్రక్కకు నెడుతుంది.

అలాగే కొన్ని ప్రాంతీయ భావజాలం దగ్గర కూడా జాతీయ సమైఖ్యత కొరవడినట్టుగా కనబడ్డా, అది కూడా భరతమాత బిడ్డలమనే భావన ముందు తేలిపోతుంది.

మన భారతీయుల అందరిలోనూ జాతీయ సమైఖ్యత భావన బలంగా ఉంది.

అప్పుడప్పుడు రాజకీయ కారణాల చేతనో లేక మతపరమైన సంఘటనల కారణంగానో ఏర్పడే భావజాలమునకు ప్రభావితం కావడం జరుగుతూ ఉంటుంది.

ఇటువంటి విషయాలలో కారణాంతరాలను చూస్తూ, వాస్తవిక దృష్టిని పరిశీలన చేయాలి. లేకపోతే సమాజాన్ని తప్పుదోవ పట్టించేవారిని అనుసరిస్తే, పాడయ్యేది మనమే అని గుర్తించాలి.

ఆర్ధిక పురోగతి సాధించాలంటే అందరూ కష్టపడుతూ ఉండాలి. సమాజం శాంతిగా ఉండాలంటే అనవసరపు విషయాలకు ప్రాధాన్యతను తగ్గించాలి.

మనమంతా ఒక్కటే అనే భావన మనిషి మనసులో శాంతిని సృష్టించగలదు. వేరు అనుభావన మనసులో అలజడి సృష్టించగలదు. కాబట్టి ఎప్పుడు భారతీయులమనే భావనే మనకు బలం. మన జాతీయ సమైఖ్యత మన కోసం మన దేశం కోసం….

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు