By | January 1, 2023
అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం నూతనోత్తేజం మనసులోకి వస్తుంది. హాయిగా మిత్రులతో సంభాషణలు, పెద్దల ఆశీర్వాదాలు కలసి మనసుకు మంచి శాంతిని చేకూరుస్తాయి. ఆప్యాయంగా మాట్లాడే అమ్మానాన్న మాటలతో మనసు మరింతగా జవం పొందుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడే సమాజం నుండే పొందే గొప్పబలం ఇది. దీనిని సద్వినియోగం చేసుకోవడం అంటే, ఎదిగాక మంచి స్థాయిలో నిబడడమేనని అంటారు. జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే ఆరంభం కావాలి…………………… అలా జీవితం ఉన్నత స్థితికి ఎదగడానికి విద్యార్ధి స్థాయి నుండే, చదువులో లక్ష్యాలు ఉండాలి. ఒక క్రమ పద్దతిలో లక్ష్యాలు ఏర్పరచుకుంటూ, వాటిని సాధిస్తూ వెళుతుంటే, మనసుకు అవి మరింత బలాన్నిస్తాయి. లక్ష్య సాధనలో ఆటంకాలు వస్తాయి. సాధించలేకపోయాము అంటే, ప్రయత్నంలో ఉండే దోషమేమిటో ? గుర్తించాలి. కానీ నిరుత్సాహపడకూడదు.

విద్యార్ధికి క్రమశిక్షణ చాలా అవసరం

జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే

జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే

పిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు, గురువులు అండగా నిలబడతారు. ఎదుగుతున్న కొలది స్వేచ్ఛనిస్తూ ఉంటారు. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవడమే మొదటి లక్ష్యం కావాలి. క్రమశిక్షణగా మెలగడమే విద్యార్ధి మొదటి లక్షణం. ఎంత క్రమశిక్షణలో ఉంటే, అంత ప్రోత్సాహం లభిస్తుంది. క్రమశిక్షణే చదువులో మొదటి మెట్టు. బాగా చదివే విద్యార్ధికి తోటి విద్యార్ధుల ముందు గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపుని గర్వంగా భావిస్తే, చదువు మొదటికే మోసం వస్తుంది. సమాజంలో గొప్ప కీర్తి ప్రతిష్టలు పొందినవారిలో అసలు చదువుకోని వారు ఉంటారు. బాగా చదువుకుని డిగ్రీలు చేసినవారు ఉంటారు. కాని ఇద్దరిలోనూ కామన్ గా ఉండేది క్రమశిక్షణ… ప్రధానంగా క్రమశిక్షణ ఉండడమే జీవితంలో ఉన్నతస్థాయికి మొదటి మెట్టు.

చదవడం పోటీపడాలనే తపన విద్యార్ధికి ఉండాలి.

చదవడం పోటీపడాలనే తపన విద్యార్ధికి ఉండాలి.

చదవడం పోటీపడాలనే తపన విద్యార్ధికి ఉండాలి.

సహజంగానే ఒక క్లాసులో నలుగురు బాగా చదివేవారు ఉంటే, పది పదిహేను మంది ఏవరేజ్ గా ఉంటే, పది పదిహేను మంది బిలో ఏవరేజ్ గా ఉండవచ్చును. అలాగే క్లాసులో ఎప్పుడూ ఒక్కటో ర్యాంక్ సాధించేవారు ఒకరో ఇద్దరో ఉంటారు. నెంబర్ వన్ ర్యాంకర్ నేను బాగా చదువుతున్నాననే గర్వం పొందకుండా ఉండాలి. మొదటి ర్యాంకర్ ని చూసి యావరేజ్ స్టూడెంట్స్ పోటీపడి బాగా చదివేవారిగా మారాలనే తపనను పొందాలి. బిలో ఏవరేజ్ గా ఉండేవారు, తమ చదువులో ఉండే దోషం ఏమిటో తోటి స్నేహితులతో కానీ టీచర్ తో కానీ చర్చించి, అడిగి తెలుసుకుంటూ చదువులో పోటీపడి బాగా చదివే ప్రయత్నం చేయాలి. ఎంతో సాధన చేశాక వచ్చే ఫలితం తర్వాతి వారికి ఒక పాఠం లాగా మారుతుంది. ఒక విద్యా సంవత్సరంలో విద్యార్ధి ప్రతిభను గుర్తించే దిశగా పరీక్షలు విద్యాలయాలు నిర్వహిస్తాయి. వాటిలో ఉత్తీర్ణత శాతం పెంచుకుంటూ పోవడం ప్రధానంగా ఉండే, చిన్న చిన్న లక్ష్యాలు. ఏడాదిలో జరిగే పరీక్షలలో ప్రతి పరీక్ష బాగా చదివేవారికి చాలెంజ్ అనిపిస్తే, చదవలేని వారికి ఆ పరీక్షలు పెద్ద లక్ష్యంగా కనబడతాయి. కానీ టీచర్ల సూచనలను పాటిస్తూ చదువులో సాధన చేస్తే, మంచి ఫలితాలు పొందవచ్చని అంటారు. ప్రతిఏడాది జరిగే పరీక్షలలో ఉత్తీర్ణత పెంచుకుంటూ వెళితే, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు, పోటీ పరీక్షలుగా అనిపించి, వాటిలో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. పోటీ పడి చదవకపోతే, పదవ తరగతి పరీక్షలు వ్రాయడానికి అనాసక్తత ఏర్పడుతుంది. అందుకే హైస్కూల్ చదువులో ప్రతి ఏడాది చదువుపై శ్రద్ద పెట్టడం చాలా అవసరం.

చదువుతున్న సమయంలోనే తమకిష్టమైన రంగం ఏమిటో గుర్తించాలి.

చదువుతున్న సమయంలోనే తమకిష్టమైన రంగం ఏమిటో గుర్తించాలి.

చదువుతున్న సమయంలోనే తమకిష్టమైన రంగం ఏమిటో గుర్తించాలి.

హైస్కూల్ చదువుతున్న సమయంలోనే, తమకిష్టమైన రంగం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వ్యవసాయ రంగం, వైద్యరంగం, పారిశ్రామిక రంగం, ఎలక్ట్రానిక్స్, పొలిటికల్, ఏరోనాటికల్, నావీ, మిలటరీ… ఇలా ఏదో జీవిత లక్ష్యంగా ఉంటూ, అదే ఉపాధిగానూ మారే రంగం ఏమిటో తెలుసుకుని, ఆసక్తిని అనుసరించి… జీవిత లక్ష్యం దిశగా సాధన సాగాలి. ఇష్టమైన రంగంలో ఉన్నత స్థితికి వెళ్లడానికి, హైస్కూల్ విద్యార్ధి దశలోనే అవగాహనను ఏర్పరచుకోవడం వలన 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యాక కాలం వృధా కాకుండా, లక్ష్యం వైపు ప్రయాణం చేయవచ్చును. లేకపోతే పదవ తరగతి తర్వాత ఏం చేయాలి? అనే ప్రశ్నతో కుస్తీపడడం, సలహాలు స్వీకరించడంలో సమయం గడిచిపోయి, చివరకు మనకు ఆసక్తి గల రంగానికి సంబంధించిన చదువులోకి వెళ్లకపోవచ్చును. కావునా హైస్కూల్ విద్యా సమయంలోనే, మన చదువులో ఎంత ఉత్తీర్ణత శాతం ఉంది? ఏ రంగం అంటే మనసు త్వరగా ఏకాగ్రతతో ఉంటుంది? అనే ఆసక్తిని గమనించి, చదువులో తగినంత సాధన చేస్తే, జీవితంలో ఇష్టమైన రంగంలోనే ఉత్తమ స్థితిలో ఉంటూ, దాని నుండే జీవనోపాధిని పొందవచ్చును.

ఉదాహరణకు:

ఒకరికి టీచింగ్ అంటే ఇష్టం, కానీ పదవ తరగతి పూర్తయ్యాక, అతను తన ఆసక్తి తెలుసుకోకపోవడం వలన ఏదో సలహాను బట్టి ఏదైనా టెక్నికల్ కోర్స్ చేస్తే, అతను ఏదైనా పరిశ్రమలో ఉద్యోగం చేయడం వరకే పరిమితం అవుతారు. కానీ అతను టీచింగ్ అంటే ఆసక్తి ఉందని గమనిస్తే, ఒక టీచర్ జీవితంగా ప్రారంభం అయితే, అతను టీచరుగా రాణించగలడు. టీచర్ గానే జీవనోపాధిని పొందగలడు. కావునా ఇష్టమైన రంగంలోనే ఉద్యోగం చేయగలగడం వలన ఆ ఉద్యోగానికి సరైన న్యాయం చేయగలడు. తన జీవనోపాధిని కూడా ఇష్టమైన రంగంలోనే పొందగలడు.
హోదా గల జీవితానికి పట్టుదలతో సాధన చేయాలి.
కొందరికి ఇష్టాలు పెద్ద పెద్దగా ఉంటాయి. అంటే ఐఏస్ అధికారి, ఐపిఎస్ అధికారి, ఎంఎల్ఏ వంటి హోదా గల పదవులు ఆశించవచ్చును. కొందరు ఒక కంపెనీకి సిఇఓ గా మారాలని అనుకోవచ్చును. ఇటువంటి లక్ష్యాలు సాధించడానికి చాలా కష్టపడాలి. ఇటువంటి లక్ష్యం నిర్ధేశించుకుని అందుకు తగిన సాధన చేయడంలో పట్టుదలను ప్రదర్శించాలి. మనసు యొక్క గొప్పతనం ఏమిటంటే, ఏది పదే పదే అనుకుంటామో, ఆ పనిని అలవోకగా చేయగలుగుతుంది. కాబట్టి జీవిత లక్ష్యం హైస్కూల్ విద్యార్ధి దశలోనే ఏర్పడితే, ఆ యొక్క లక్ష్యమే దిశానిర్ధేశం చేస్తూ, మనసుని ముందుకు నడిపిస్తుంది. కావునా ఉత్తమ లక్ష్యం ఉత్తమ జీవనానికి పునాది అవుతుం
జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే

జీవితం లక్ష్యం విద్యార్ధి దశలోనే

ది. విద్యార్ధి చుట్టూ ఉండే స్నేహితులు ప్రవర్తనపై ప్రభావం చూపుతూ ఉంటే, టీచర్ చదువులో మార్గం చూపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏది బాగా గ్రహిస్తున్నామో, అదే మరలా మనసు నుండి బహిర్గతం అవుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం! ఏమిటంటే, బాగా పాపులర్ అయిన సినిమా చూసినవారు, ఆ సినిమాలో హిట్ సాంగ్ పదే పదే పాడేస్తూ ఉంటారు. కారణం ఆ సినిమాలో ఆ సాంగ్ ను దీక్షగా చూడడం కారణం అయితే, ఇంకా ఆ హిట్ సాంగ్ అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట విని ఉండడం కారణం అవుతుంది. అలా అప్పుడప్పుడు విన్న సాంగ్ దృశ్యరూపంలో కనబడగానే మనసులో నాటుకుపోతుంది. పాట పాడడమే కాదు… ఆ డాన్స్ కూడా మనసులో మెదులుతుంది. దీనిని బట్టి మనసు పదే పదే విన్న విషయాన్ని చూడగానే, చక్కగా పట్టుకుంటుంది. కాబట్టి పుస్తకాలలో విన్న విషయం కూడా ప్రాక్టికల్స్ చూడగానే చక్కగా పట్టుకుంటుంది.
పరీక్షలంటే పోటీ తత్వం ఉండాలి. భయం కాదు!
కావునా చదువుకునే సమయంలో చదువులలో ఉండే విషయాలను తలచుకోవాలి.. పరీక్షలలో మంచి ఫలితాలు పొందడానికి మనసులో పోటీతత్వాన్ని పెంపొందించుకోవాలి కానీ పరీక్షలు భయాన్ని కాదు… కొత్త సంవత్సరం మీ లక్ష్యం ఏమిటో? మీరు తెలుసుకోండి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని, వాటిని సాధించండి. పట్టుదలతో కష్టపడి లక్ష్యం సాధించడంలో ఉన్న మజా ఏమిటో ఒక్కసారి మీ మనసుకు అలవాటు అయితే, పరీక్షలు అంటే, పోటీ తత్వం పెరుగుతుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు…. మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.

మరిన్ని తెలుగురీడ్స్ పోస్టులు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?
జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?
దానం గురించి దానం గొప్పతనం
సన్మాన పత్రం ఇన్ తెలుగు
వేచి ఉండడాన్ని నిర్వచించండి
పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?
పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?
అవతారం అర్థం ఏమిటి తెలుగులో
తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు
లీడర్ అంటే ఎలా ఉండాలి
ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?
ప్రేరణ తెలుగు పదము అర్ధము
గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?
నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం
కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు