By | February 16, 2021

లోన్ తీసుకోవడం తిరిగి చెల్లించడం అవసరాలు ఆలోచనలు ఎలా ఉంటాయో గమనించుకోవడం మనకు మనం మేలు చేసుకోవడం అంటారు.

అవసరం లోన్ గురించి తెలుగులో వ్యాసం. అవసరానికి తగినంత డబ్బు లేనప్పుడు లోన్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. తిరిగి చెల్లించడం కష్టం కాకుండా చూసుకోవడం ప్రధానం.

అటువంటి ప్రయత్నం చేసేటప్పుడు మనసులో గుర్తు ఉంచుకోవలసిన ఆలోచన… ఎందుకంటే ఆలోచనే మనసును మరింత ముందుకు నెడుతుంది.

లోన్ తీసుకునేటప్పుడు ఆలోచన, అవసరాలకు అనుగుణంగా లోన్ తీసుకోవడం ప్రధానం అయితే, తిరిగి చెల్లించడంలో ఉన్న సాధ్యాసాధ్యాలు గమనిచడం అంతకన్నా ప్రధానం.

నియంత్రణ గల మనసు పొరపాటుకు తావులేకుండా ఉండగలుగుతుంది. లోన్ కోసం ప్రయత్నం చేసేటప్పుడు తగు ఆలోచన అవసరం అంటారు.

లోన్ తీసుకోవడం తేలిక కానీ తిరిగి చెల్లించడం కష్టం. తీసుకునేటప్పుడు ఉండే ఆసక్తి కట్టేటప్పుడు కనబడదని కొందరంటారు. కేవలం లోన్ చెల్లించడంలో ఒక్కసారి అశ్రద్ధ మొదలైతే ఇక అంతే, ఆ లోన్ పూర్తయ్యేవరకు మనశ్శాంతి ఉండదు.

ఎందుకు లోన్ తీసుకుంటాము అంటే అవసరం కోసం లోన్ తీసుకుంటాము. ఒక వస్తువు కొనడానికి లేదా ఒక కార్యక్రమము చేయడానికి లోన్ తీసుకుంటాము లేదా ఒక కట్టడము కట్టడానికి లేదా ఒక వాహనము కొనుగోలు చేయడానికి లోన్ వైపు వెళ్తూ ఉంటారు.

ఒక వస్తువు లేదా ఒక వాహనం కొనడానికి మన దగ్గర తగినంత ధనం లేనప్పుడు అదనపు ధనం కోసం లోన్ వైపు ఆసక్తి కనబరుస్తము.

అలాగే ఒక కట్టడం కట్టడానికి సరిపడా సొమ్ములు లేనప్పుడు కూడా మనం లోన్ వైపు మొగ్గు చూపుతాము.

ఇంకా ఏదైనా కార్యక్రమము జరపించడానికి కూడా తగినంత ధనం లేకపోతే లేదా గ్రాండుగా కార్యక్రమం జరిపించాలని తలిస్తే, లోన్ వైపు ఆసక్తి చూపుతాం.

వీటిలో సహజంగా వస్తువుల కోసం తీసుకునే లోన్స్ తిరిగి చెల్లింపులు బాగానే చేయగలం. ఎందుకంటే వస్తువు వాడకం మనకు తెలుస్తూనే ఉంటుంది. కాబట్టి వస్తువు ఉపయోగం కనబడడంతో మనసు తృప్తిగానే ఉంటుంది.

కార్యక్రమం కోసం లోన్ తీసుకుంటే

కాని ఒక్కోసారి ఏదైనా కార్యక్రమం కోసం లోన్ తీసుకుంటే, లోన్ తీసుకునేటప్పుడు ఆసక్తి ఉంటుంది. కార్యక్రమం అయిపోయాక ఆ విషయం గురించి మరుపు మనసుకు ఉంటుంది. కానీ లోన్ తీరేవరకు మాత్రం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఎప్పుడో జరిగిన కార్యక్రమం మరిచిన మనసు మాములుగానే అశ్రద్ధను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.

కార్యక్రమం గురించి అయితే లోన్ తీసుకోవడం కన్నా తక్కువలో తక్కువ ఉన్న డబ్బులతోనే సదరు కార్యక్రమం నిర్వహించడం శ్రేయష్కరం అంటారు.

తాహతుకు మించి కార్యక్రమం తలపెట్టడం కన్నా, ఉన్నంతలో సర్దుకుని కార్యక్రమం తృప్తిగా నిర్వహించడం ఉత్తమమని పెద్దలంటారు.

ఇక వస్తువులు వీలైనంతలో చేతిలో ఉన్న సోమ్ములకు సరిపడా వస్తువునే ఎంచుకోవడం ఉత్తమమైన ఆలోచనగా పెద్దలు చెబుతారు.

ప్రారంభంలో ఉండే ఆసక్తి అంత్యములో ఉండదు. కాబట్టి ప్రారంభంలో మోజు కన్నా అవసరం గుర్తెరిగితే, ప్రారంభంలో ఉండే మనోస్థితి అంత్యములోనూ ఉంటుంది. ఈ విధానంలో ఆలోచన చేసి ఏదైనా కార్యక్రమం లేక వస్తువు కొనుగోలు వ్యవహారాలు నిర్వహించ తలిస్తే, అప్పులు లేక లోన్స్ వైపు ఆసక్తి ఉండదు.

తప్పని సరి పరిస్తితిలో లోన్ తీసుకుంటే, అందుకు తగ్గట్టుగా రాబడి పధకం మన దగ్గర ఉండాలి. లేకపోతే తీసుకున్న లోన్ తిరిగి చెల్లించలేక బాధపడాలి.

వస్తువు మీద ఆసక్తికి అధిక ఆలోచన తోడైతే, ఆ వస్తువుపై మోజు పెరుగుతుంది. మోజు పడ్డ మనసు వస్తువుకు లొంగుతుంది… అటువంటి ఆలోచనను ఆరంభంలోనే తుంచేయడం శ్రేయస్కరం అని పెద్దలంటారు.

లోన్ తీసుకోవడానికి ప్రధాన కారణం అవసరం అయితే, అది భవిష్యత్తులో భారం కాకుండా చూసుకోవడం విజ్ఞులు చేసే మంచి పని అంటారు.

మరిన్ని తెలుగురీడ్స్ వ్యాసాలు

విద్యను అభ్యసించడంలో అర్జునుడి ఎలా ఆదర్శం?

జీవితంలో కర్తవ్య బోధకులు ఎవరు?

దానం గురించి దానం గొప్పతనం

సన్మాన పత్రం ఇన్ తెలుగు

వేచి ఉండడాన్ని నిర్వచించండి

పాఠశాల గురించి తెలుగులో వ్యాసం, పాఠశాలకు ఎందుకు వెళ్లాలి?

పిల్లలు తప్పు చేస్తే ఎలా స్పందించాలి?

అవతారం అర్థం ఏమిటి తెలుగులో

తెలుగు పదాలు పర్యాయ పదాలు అర్ధాలు

లీడర్ అంటే ఎలా ఉండాలి

ఆవిర్భవించింది అనే పదానికి అర్ధం ఏమిటి?

ప్రేరణ తెలుగు పదము అర్ధము

గొప్ప వ్యక్తిగా ఎదగాలి అంటే ఏం చేయాలి?

నిరసన పర్యాయపదాలు నిరసన అర్ధం

కొన్ని తెలుగు పదాలు వాటి అర్ధాలు